S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

03/31/2016 - 21:23

గూగుల్ వంటి కంపెనీలు డ్రైవర్‌లెస్ కారు తయారీకోసం ఏళ్ల తరబడి తపస్సు చేస్తుంటే, ఖరగ్‌పూర్ ఐఐటికి చెందిన మన కుర్రాళ్లు చడీచప్పుడు లేకుండా డ్రైవర్‌లెస్ బైక్‌ను తయారు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మేకిన్ ఇండియా సత్తా ఏపాటిదో ప్రపంచానికి రుచి చూపించారు.

03/31/2016 - 21:21

అనిరుద్ధ తయారుచేసిన ఈ సైకిల్ ల్యాంప్ పేరే లూమినీర్. శక్తిమంతమైన చిన్న సైజ్ బల్బును, దానితోపాటే రీచార్జబుల్ యూనిట్‌ను సైకిల్ హ్యాండిల్ బార్ మధ్యలో ఏర్పాటు చేశాడు. దీనిని కంప్యూటర్ యుఎస్‌బి ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. కాబట్టి బయటకి వైర్లేమీ కనిపించవన్నమాట. సైకిల్ ఉన్నవారెవరైనా ఈ లూమినీర్‌ను కొనుక్కోవచ్చు. సైకిల్‌కి అమర్చుకోవచ్చు.
---

03/31/2016 - 21:16

లాప్‌టాప్‌లు ఉన్నాయి. ఒళ్లో పెట్టుకుని పనిచేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్లున్నాయి. కొత్తరకం స్టాండ్స్ వచ్చాయి. మరి టాబ్లెట్లు, ఐపాడ్ల సంగతేమిటి? ఇలా అడిగే వారికోసమే అన్నట్టుగా మార్కెట్లోకి టాబ్లెట్ టేబుల్స్ కూడా వచ్చేశాయి. మార్కెట్లో దొరుకుతున్న రకరకాల టాబ్లెట్లు, ఐ ప్యాడ్లకి అనుకూలంగా ఉండే ఈ టేబుల్ రెండు సైజుల్లో దొరుకుతుంది. నలుపు, తెలుపు, పసుపు రంగుల్లో ఈ స్టాండ్లు లభ్యమవుతాయి.

03/31/2016 - 21:15

కంటి చూపు మందగిస్తే పుస్తకాలు చదవడం కష్టమే మరి. ఫ్లోర్ స్టాండింగ్ మాగ్నిఫయర్ కొనుక్కుంటే ఆ సమస్య తీరినట్టే. ఫోటోలో చూస్తున్నారుగా భూతద్దం అమర్చిన స్టాండ్ ఇది. ఎలా కావాలంటే అలా వంచుకోవచ్చు. హాయిగా కుర్చీలో కూర్చుని ఈ గ్లాస్ సాయంతో పుస్తకాలు చదువుకోవచ్చు. దీని ధర 129 డాలర్లు.

03/24/2016 - 21:19

కూర్చునే పనిచేసేవారికంటే నిలబడి లేదా కాసేపు అటూ ఇటూ తిరుగుతూ పనిచేసేవారిలో గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం 34 శాతం తక్కువ. కూర్చుని పనిచేసేవారు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.
*********

03/24/2016 - 21:14

ఎవరెస్టే కాదు...ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు వెళ్లడం కూడా అంత ఈజీ కాదు. నేలమట్టానికి 17,600 అడుగుల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌కు వెళ్లాలన్నా ప్రత్యేకమైన శిక్షణ, తగిన వయసూ అవసరం. పర్వతారోహణలో కొమ్ములు తిరిగిన వారికి సైతం చేతకాని ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది హైదరాబాద్‌కు చెందిన పదేళ్ల చిన్నారి రియా కొరియా. అంతేకాదు...పదేళ్ల వయసులో బేస్ క్యాంప్ చేరుకున్న తొలి తెలంగాణ బాలిక రియానే కావడం విశేషం.

03/24/2016 - 21:12

వర్షం కురుస్తుంటే గొడుగేసుకుని వెళ్లడం బాగానే ఉంటుంది. కానీ ఈ గొడుగులతోనూ సమస్యలు లేకపోలేదు. ఒకటి- అకస్మాత్తుగా వర్షం పడితే చేతిలో గొడుగు లేకపోవడం. రెండు- ఎక్కడ పడితే అక్కడ మరచిపోయే వీలు ఉండటం. మూడు- గాలి ఉధృతంగా వీస్తే గొడుగు వంగి పోవడం. ఇంగ్లీష్‌లో గొడుగును అంబ్రెల్లా అంటారని తెలిసిందే. అయితే ఈ మూడు సమస్యలనూ తట్టుకునే విధంగా కొత్త గొడుగొకటి మార్కెట్లోకి రాబోతోంది. దీని పేరు ఊంబ్రెల్లా!

03/24/2016 - 21:10

ఇప్పటివరకూ షాపింగ్ మాల్సూ, కార్పొరేట్ ఆఫీసులకు మాత్రమే పరిమితమైన రోబోలు ఇకపై రోడ్డెక్కనున్నాయి. రోడ్డెక్కడమే కాదు...వేడి వేడి పిజ్జాలు డెలివరీ చేయనున్నాయి. ఆశ్చర్చపోతున్నారా? నిజమండీ బాబూ! ఇందుకు ప్రఖ్యాత సంస్థ డోమినో రంగం సిద్ధం చేస్తోంది. ‘డోమినోస్ రోబోటిక్ యూనిట్’గా పిలుచుకునే ఈ డ్రైవర్‌లెస్ యూనిట్...న్యూజీలాండ్ ప్రభుత్వ సహకారంతో ఆస్ట్రేలియాలో తయారైంది.

03/24/2016 - 21:08

పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం పాలకులకు పెను సవాల్‌గా పరిణమిస్తున్న తరుణంలో దీనికి పరిష్కారంగా ఇజ్రాయెల్‌కు చెందిన ‘గ్రీన్ రైడ్’ అనే స్టార్టప్ ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. అదేంటంటే..బ్యాటరీతో నడిచే ఫోల్డింగ్ స్కూటర్! నడిపేవారి బరువు, ప్రయాణించే దూరం... ఈ రెండు అంశాల ఆధారంగా రూపొందిన ఈ స్కూటర్ పేరు ఐఎన్‌యు.

03/24/2016 - 21:06

చేసుకున్నవాడికి చేసుకున్నంత.. కష్టాన్ని బట్టే ఫలితం. ఆ ఫలితాన్ని బట్టే రాణింపు. ఎవరికైనా 24గంటలే సమయం. క్షణమో యుగం కాకూడదు. 24గంటలూ సరిపోవన్నట్టుగా లక్ష్యాల బాటను వేసుకోవాలి. అహరహం శ్రమిస్తూ కొత్త మైలురాళ్లను అధిగమిస్తూ ఆశల సౌధాలను అందుకోవాలి. ఇదే విజయ పధం..విజేతల విజయరహస్యం.

Pages