S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

08/10/2017 - 22:33

వినోదం కోసమో, వికాసం కోసమో కాదు.. దేశ సరిహద్దుల్లో సైనికులకు ఉపయోగపడే అద్భుత రోబోను రూపొందించి ఓ ఇంటర్ కుర్రాడు అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగానే గుర్తింపు పొందిన ఒడిశాకు చెందిన నీల్మాధబ్ తలానగర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ తన మేధస్సుకు పదును పెట్టి ఈ అద్భుతాన్ని సాధించాడు.

08/10/2017 - 22:30

పేరుకున్న చెత్తకుప్పలు, పాడైన రహదారులు, వెలగని వీధిదీపాలు, పనిచేయని నల్లాలు, పూడుకుపోయిన డ్రైనేజీ... ఇలాంటి సమస్యలతో అనునిత్యం ఇబ్బందిపడేవారిని చేతనైనంత మేర ఆదుకోవాలని ఆ విద్యార్థులు సంకల్పించారు. నగరాల్లో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వారు ఓ వినూత్న ‘యాప్’ను రూపొందించారు.

08/10/2017 - 22:26

చిన్నపిల్లాడేం కాదు.. అయినా వీడియోగేమ్‌లంటే విపరీతమైన మోజు.. ఇంజనీరింగ్ చదువుతున్న ఆ కుర్రాడు వీడియోగేమ్ కొనివ్వలేదని తండ్రిపై అలిగాడు.. తండ్రి కోప్పడ్డాడని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. హైదరాబాద్ నగర శివారులో జరిగిన ఈ విషాద ఘటన - క్షణికావేశంలో జరిగే అనర్థాలకు నిదర్శనం..
***

08/03/2017 - 22:39

కఠినమైన రహదారుల్లో, భయం గొలిపే పర్వత ప్రాంతాల్లో సైతం ‘ఎదురే మాకు లేదు.. మమ్మెవరూ ఆపలేరు..’ అంటూ ఆ యువతులు బైకులపై జోరుగా సాగిపోతున్నారు. కేవలం కాలక్షేపానికో, మానసిక ఉల్లాసానికో కాదు.. సామాజిక చైతన్యం కోసం దేశ విదేశాల్లో వీరు బైక్ యాత్రలు చేస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రెండేళ్ల క్రితం పదిమంది మహిళలతో ప్రారంభమైన ‘బైకింగ్ క్వీన్స్’ క్లబ్ అంచెలంచెలుగా ఎదిగింది.

08/03/2017 - 22:36

యువతులకు నిజంగా ఓ అద్భుత అవకాశం.. జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా నిలిచిన ఐఐటిల్లో అడ్మిషన్ పొందాలనుకునే అమ్మాయిల కలలు సాకారం కాబోతున్నాయి.. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటిల్లో అడ్మిషన్ల కోసం ఏటా నిర్వహించే ‘జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్’ (‘జీ’)లో ప్రస్తుతం అబ్బాయిల హవా కొనసాగుతోంది. ఈ పరిస్థితిని మార్చాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ (హెచ్‌ఆర్‌డి) ఓ ప్రణాళికను సిద్ధం చేసింది.

08/03/2017 - 21:15

మార్కెటింగ్ నిపుణురాలిగా హాంగ్‌కాంగ్‌లో భారీ సంపాదనను తృణప్రాయంగా వదలిపెట్టి ఆమె మాతృదేశంపై మమకారంతో భారత్‌కు తిరిగొచ్చింది. మన దేశంలో మహిళల పట్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలకు మీడియాలో మితిమీరిన ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోందని ఆమె అంటోంది. సాధికారతకు మహిళలు దూరం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆమె విశే్లషిస్తోంది.

08/03/2017 - 21:13

అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వమే లక్ష్యంగా మహిళల నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని జి-20 (గ్రూప్ ఆఫ్ ట్వంటీ) మహిళల బృందం అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న 20 దేశాలకు చెందిన మహిళా ప్రతినిధులతో ఈ బృందం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తతరానికి చెందిన మహిళలు నాయకత్వం వహించేలా చూడటం, పనిచేసే వర్గంలో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చూడటం ఈ గ్రూప్ లక్ష్యం.

08/03/2017 - 21:11

గ్రూప్ చాటింగ్, మెసెంజర్, గేమ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఫొటో-వీడియో షేరింగ్.. ఒకటేమిటి..? నేటి యువతకు అవసరమైన ఎన్నో ఫీచర్లతో ఓ సరికొత్త ‘యాప్’ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. స్మార్ట్ఫోన్‌లో పదుల సంఖ్యలో ‘యాప్స్’ అందించే ఫీచర్లను ఆ ఒక్క ‘యాప్’ అందజేస్తుంది. ఇ-కామర్స్ దిగ్గజమైన ‘అమెజాన్’ ఆవిష్కరించే ఈ వినూత్న మెసేజింగ్ యాప్ నేటి కుర్రకారును అలరించబోతోంది.

07/27/2017 - 21:21

ప్రపంచ స్థాయి నైపుణ్య శిబిరంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది హైదరాబాద్‌కు చెందిన మెహర్ రిషిక. అబు దాబిలో త్వరలో జరిగే ‘వరల్డ్ స్కిల్స్ ఈవెంట్- 2017’లో మన దేశం తరఫున పాల్గొంటున్న ఏకైక ప్రతినిధిగా ఆమె ఇప్పటికే సంచలనం సృష్టించింది.

07/27/2017 - 21:19

‘జీవితం ఎవర్నీ వదలదు, అది అందరి సరదా తీర్చేస్తాది..’ ఇది ఓ సినిమాలో పంచ్ డైలాగ్. అవును జీవితం కోసం మనం మారకపోతే- అందరి సరదా అది తీర్చేయడం ఖాయం. అందుకే రమణ మహర్షి చెప్పినట్టు కాలంతో పాటు కలసి ముందుకు వెళ్లాల్సిందే. ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన ఓ చిత్రంలో- ‘ఎన్ని సమస్యలు రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసినా’ తనేం చేయాలో తెలిసిన క్లారిటీ ఆయనకే కాదు, ఎవరికైనా అవసరం. ప్రపంచం అవకాశాల పుట్ట.

Pages