S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

07/27/2017 - 21:13

‘విశ్వసుందరి’గా కీర్తికిరీటం సాధించడమే తన జీవిత లక్ష్యమని అంటోంది హర్యానాకు చెందిన మానుషి ఛిల్లార్. ఇటీవల జరిగిన ఎఫ్‌బిబి కలర్స్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 పోటీల్లో ఆమె విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ పోటీ అయిన ‘మిస్ వరల్డ్’పై దృష్టిపెట్టింది. చైనాలో ఈ ఏడాది చివరిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.

07/27/2017 - 21:10

పందొమ్మిదేళ్ల ప్రాయంలోనే లడఖ్‌లోని అత్యంత ఎత్తయిన ‘ఖర్దంగ్ లా’ శిఖరంపైకి మోటార్ బైక్‌పై చేరుకున్న తొలి యువతిగా రియా యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దిల్లీలోని ఓ ప్రముఖ కళాశాలలో పొలిటికల్ సైన్స్ (ఆనర్స్) చదువుతున్న ఆమె గత నెల 17న తన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350’ బైక్‌పై బయలుదేరి ‘ఖర్దంగ్ లా’ శిఖరంపై కాలుమోపి, తిరిగి ఈనెల 1న ఇంటికి చేరుకుంది.

07/27/2017 - 21:08

ఎంతసేపూ మార్కులు, ర్యాంకులపై తప్ప వ్యక్తిగత హాబీలపై ఆసక్తి చూపని ఈ కాలం కుర్రకారుకు ఆ యువకుడు నిజంగా స్ఫూర్తిదాతే. మంచి అభిరుచులకు, మానసిక వికాసానికి అంతగా అవకాశం లేని నేటి ‘డిజిటల్ యుగం’లో ఇంకా ‘నాణాల సేకరణ’ వంటి హాబీలు ఉన్నాయంటే మనం కాస్త విస్మయం చెందాల్సిందే. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే హాబీలపై ఈ కాలపు యువతకు మమకారం తగ్గుతోంది.

07/21/2017 - 04:07

మిగతా ఆటల మాదిరి అది సులభమైనది కాదు.. చాలా కఠినమైనది అయినా నిరంతర దీక్షతో, అలుపెరుగని కృషితో ఆమె అద్భుతాలను సాధిస్తోంది.. అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తోంది.. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన 18 ఏళ్ల అన్నం తరంగిణి విలక్షణమైన ‘సెపక్‌తక్రా’ క్రీడలో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో సత్తా చాటింది.

07/21/2017 - 04:06

నిద్ర ముంచుకొస్తున్నా స్మార్ట్ఫోన్‌ను వదలలేక పోవడం.. అవసరం ఉన్నా లేకున్నా ‘సోషల్ మీడియా’ వెబ్‌సైట్లలో గంటలకొద్దీ గడపడం.. ఫలితంగా శారీరక, మానసిక సమస్యలను కొని తెచ్చుకోవడం... ఈ ధోరణి నేటి నవ నాగరిక యువతలో పెచ్చుమీరుతోంది.

07/21/2017 - 04:01

‘ఉద్యోగం వేట’లో సవాలక్ష సవాళ్లు ఎదుర్కొంటున్న నేటి యువత ఏదో ఒక వైవిధ్యం చాటుకుంటే తప్ప అవకాశాలు దక్కడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోవడం, అప్పుడప్పుడు నియామకాలు జరిగినా విపరీతమైన పోటీ వల్ల నిరుద్యోగ యువతకు నిరాశ తప్పడం లేదు. ఇంజనీరింగ్ విద్యపై వేలం వెర్రి పెరగడంతో ‘పట్టాలు’ పొందినవారందరికీ తగిన ఉద్యోగాలు దక్కడం లేదన్నది కాదనలేని వాస్తవం.

07/20/2017 - 21:07

ఎక్కడో మారుమూల పల్లెలో వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు ఆసియా స్థాయిలో జరిగిన పోటీ పరీక్షలో సత్తా చాటి మన దేశానికి వనె్న తెచ్చాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం (అమెరికా)లో నిర్వహించే ‘సమ్మర్ క్రాస్ రోడ్ ప్రోగ్రామ్’కు తెలంగాణకు చెందిన గురుకుల కళాశాల విద్యార్థి మాశగల్ల ఆనంద్ ఎంపికై సంచలనం సృష్టించాడు.

07/13/2017 - 21:28

పూణెకు చెందిన రుచా సురేంద్ర సియల్‌ను చూస్తే ఎవరైనా స్ఫూర్తి పొందాల్సిందే. ప్రముఖ బహుళ జాతి సంస్థలో టెక్నోక్రాట్‌గా రెండు చేతులా సంపాదిస్తున్న ఆమె తన ఉద్యోగాన్ని వదిలి పెట్టి, ఎంతో ఇష్టపడి భారత వైమానిక దళంలో చేరింది. జీతం తక్కువ, కష్టం ఎక్కువ అన్న రెండు విషయాలూ తెలిసినా, ఎలాంటి సంకోచం లేకుండా ఎయిర్‌ఫోర్సులో చేరింది. దానికి ఆమె చెప్పే సమాధానం ఒక్కటే- ‘సంతోషం.. దేశం కోసం పనిచేస్తున్న సంతోషం..

07/13/2017 - 21:25

‘ఏ రంగంలోనైనా వైవిధ్యం చూపితేనే గుర్తింపు సాధ్యం.. కష్టం అనిపించినా ఇష్టపడిన దాంట్లో కఠోర శ్రమ చేస్తే అసాధ్యమన్నది లేనే లేదు..’ అంటోంది బెంగళూరుకు చెందిన పదో తరగతి విద్యార్థిని వినయ శేషన్. ఇటీవల జర్మనీలో జరిగిన ‘డ్యాన్స్ వరల్డ్ కప్- 2017’ పోటీల్లో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించన ఆమె ఏకంగా మూడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది.

07/13/2017 - 21:23

చుట్టూ బాంబులు పేలుతున్న శబ్దం.. సైనికుల బూట్ల చప్పుడుతో ఆ ప్రాంతం అట్టుడికిపోతున్నా.. అక్కడి యువతరంలో ఆనందానికి కొదవ లేదు. ఉగ్రవాదాన్ని వారు స్వాగతిస్తున్నారని కాదు.. తీవ్రవాదం అనే రాచపుండుతో వారు ఎన్ని బాధలు పడుతున్నా తమ ‘కెరీర్’పైనే దృష్టిసారించడమే ఇందుకు కారణం. జమ్మూ కశ్మీర్‌లో చాలాకాలంగా తీవ్ర వాద కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతుండడంతో అక్కడి యువత విద్య, ఉపాధి రంగాలకు దూరం అవుతున్నారు.

Pages