S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్ కథ

10/30/2016 - 06:40

ఆ వేసవి శనివారం రాత్రి ఎనిమిదికి ‘స్టీవ్స్ పీజా’ దుకాణంలో పీజాలు తృప్తికరంగా అమ్ముడు అవుతున్నాయి. ఆ వ్యాపారం ఓ శుభ్రమైన కారు గేరేజ్ నించి జరుగుతోంది. వంట గది, ఆఫీస్ గది కూడా ఆ గేరేజ్‌లోనే. స్టీవ్స్ పీజా ఫార్చూన్ 500 కంపెనీల జాబితాలోకి ఎప్పుడైనా ఎక్కినా ఆశ్చర్యం లేదని స్టీవ్ నమ్మకం. అతను పరిపూర్ణ ఆశావాది.

10/22/2016 - 21:59

ఆగస్ట్ నెల.
గురువారం.
రాత్రి 10.25. టేక్సీ డ్రైవర్ హాగ్‌లేండ్ బెవర్లీ హిల్స్‌లోని ఓ ఖరీదైన హోటల్ ముందు తన టేక్సీని ఆపి అప్పటికే పావుగంట అయింది. ఈసారి అతని వంతు వచ్చింది. సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు, ఫైనాన్షియర్లు తరచు వచ్చే హోటల్ అది.

10/16/2016 - 03:23

కేవలం చంపడంలోని ఆనందం కోసమే చంపేవారు సైకోలు. డబ్బు కోసం చంపేవారు కిరాయి హంతకులు. కాని నేను ఆ రెండూ కాదు.

10/08/2016 - 21:32

ఆ సెడాన్ కారు రోడ్డు పక్కన ఆగింది. లిఫ్ట్ కోసం నిలబడ్డ ఇద్దరు టీనేజ్ కుర్రాళ్లు ఆ కారు డ్రైవర్ దగ్గరికి వెళ్లారు.
‘దయచేసి లిఫ్ట్ ఇస్తారా?’ వారిలో బలంగా ఉన్న పద్దెనిమిదేళ్ల కుర్రాడు అడిగాడు.
‘ఎక్కడికి?’ డ్రైవర్ స్నేహపూర్వకంగా అడిగాడు.

09/30/2016 - 21:25

గురువారం ఉదయం కోరీ నించి వచ్చిన ఫోన్ నన్ను నిద్ర లేపింది. అతను పోలీస్ శాఖలో చేరాక మేం దూరం అయ్యాం.
‘హలో మార్క్! కోరీని. నిన్ను పక్క మీంచి లేపానా?’ ప్రశ్నించాడు.
‘్ఫన్‌లో మాట్లాడటానికి మంచం మీంచి లేవక్కర్లేదు. ఎలా ఉన్నావు కోరీ?’ అడిగాను.
‘ఒకోసారి బాగా ఉండను. ఒకోసారి బావుంటాను. నువ్వు నాకో సహాయం చేస్తావా?’
‘నేను నీకో సహాయం బాకీ పడ్డానా?’

09/24/2016 - 23:34

‘తర్వాత కలుద్దాం’ మెలనీకి గుడ్‌బై చెప్పి నిక్ రెస్ట్‌రెంట్‌లోంచి బయటకి వచ్చాడు.

09/18/2016 - 23:14

న్యూయార్క్‌లోని ఓ ప్రైవేట్ క్లబ్‌లో ఆ ఐదుగురు కలిసి భోజనం ముగించారు.
‘్భజనం బాగుంది కదా పీటర్స్?’ ఫెర్గుసన్ అడిగాడు.
‘అవును’
‘బై ది వే ఇతను పీటర్స్’ ఫెర్గుసన్ అతన్ని మిగిలిన వారికి పరిచయం చేశాడు.
తర్వాత చెప్పాడు.
‘మనం ఒకరికొకరం పరిచయం అయాం.. వెయిటర్. అందరికీ స్కాచ్ తీసుకురా’
తర్వాత తను చెప్పేది ఫెర్గుసన్ కొనసాగించాడు.

09/10/2016 - 22:08

ఆ సమయంలో ఇద్దరు కస్టమర్స్ మాత్రమే ఉన్న డ్రాప్‌బేక్ ఇన్ (బార్)లోకి వచ్చిన అతన్ని చూసి కేప్రిలియన్ నివ్వెరపోయాడు. నడిచి వచ్చే ఫ్రెడ్ వంక నోరు తెరచుకుని చూస్తూండిపోయాడు.
క్రితంసారి ఫ్రెడ్‌ని చూసింది కూడా వర్షపు సోమవారమే. ఆ రోజు అతను ఇద్దరి బరువుని మోస్తున్నట్లుగా కృంగిపోయి కనిపించాడు. ఇప్పుడతను చక్కటి ఖరీదైన సూట్‌లో, ఎన్నడూ వ్యక్తిగత విషాదం అనుభవించని సాధారణ మనిషిలా కనిపించాడు.

09/04/2016 - 05:53

సమాధి కోసం గోతిని తవ్వడాన్ని పూర్తి చేశాక, పొగ మంచులో ఓ నల్లటి ఆకారం తన దగ్గరికి రావడం గమనించి హనీగాన్ ఉలిక్కిపడ్డాడు. పసిఫిక్ మహాసముద్రం బీచ్ వైపు నించి వచ్చిన ఆ వ్యక్తి హనీగాన్ చేసే పని చూసి అల్లంత దూరంలో ఆగాడు. హనీగాన్ లాంతరు వెలుగు అతని మీద పడటం లేదు.
‘ఎవరు మీరు?’ హనీగాన్ అడిగాడు.
అతను హనీగాన్ పాదాల దగ్గర కుప్పగా ఉన్న ఇసుకతో కూడిన మట్టిని, కేన్వాస్‌ని చూసి చెప్పాడు.

08/27/2016 - 23:34

యునైటెడ్ నేషన్స్ భవంతి పైన తిరిగే ఫ్లయింగ్ సాసర్‌ని చాలా మంది అప్పటికే చూశారు. ఆ ఫ్లయింగ్ సాసర్ నించి సమాచారం అందుకున్న యు.ఎన్.ఓ. సెక్రటరీ జనరల్ అప్పటికే తమ సభ్యత్వ దేశాల ప్రతినిధులని అత్యంత అవసర సమావేశానికి ఆహ్వానించాడు. చైనా, రష్యా, కొలంబియా, ఇంగ్లండ్ మొదలైన దేశాల ప్రతినిధులతో సమావేశ హాలు నిండిపోయింది. అది దేని గురించని వారు ఒకరితో మరొకరు గుసగుస లాడుకుంటున్నారు.

Pages