S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్ కథ

03/04/2018 - 20:52

ట్రాఫిక్ సార్జెంట్ మైఖేల్ ఓ బుధవారం ఉదయం డౌన్‌టౌన్‌లో ట్రాఫిక్‌ని నియంత్రించేప్పుడు కోహెన్ ఓ కార్లో వెళ్తూండటం చూశాడు. అది కొత్త, తెల్ల కేడీలాక్. కోహెన్ రెండేళ్ల క్రితం ఓ పచారీ దుకాణంలో రివాల్వర్‌ని చూపించి, బెదిరించి దొంగతనం చేసిన చిన్న దొంగని మైఖేల్‌కి తెలుసు. దొంగతనం చేసాక అతను స్వచ్ఛందంగా పోలీసుస్టేషన్‌కి వచ్చి తన తప్పుని అంగీకరించడంతో తక్కువ శిక్ష పడింది.

02/03/2018 - 22:52

టు,
ది కౌంటీ జడ్జ్
ఫ్రం
స్టేట్ ప్రిజన్
అయ్యా,

01/20/2018 - 20:52

ఒక సూఫీ గురువు దగ్గర కొత్తగా ఇద్దరు శిష్యులు చేరారు. సూఫీ గురువు ఇంటి చుట్టూ తోట ఉంది. ఒకరోజు ఇద్దరు శిష్యులూ ఆ తోటలో తిరుగుతున్నారు. నడవడం కూడా ధ్యానంలో భాగమే.

01/20/2018 - 20:50

‘నేను టేక్సులు చెల్లించే ఈ దేశ పౌరుడ్ని. నా ఆస్థి మీద మీరు ఇలా దాడి చేసి నాశనం చేస్తున్నారు. మళ్లీ ప్రతీది మీరు వచ్చినప్పుడు ఎలా ఉందో అలా చేసి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాను’ వారెన్ కోపంగా చెప్పాడు.
‘మిస్టర్ వారెన్! మీకా విషయంలో చింత వద్దు. మేము వెదికేది మాకు దొరికినా, దొరక్కపోయినా అలాగే చేస్తాం’ డిటెక్టివ్ సార్జెంట్ లిట్లర్ చెప్పాడు.

01/06/2018 - 21:18

టోనీతో అతను పనిచేసే అడ్వర్టయిజ్‌మెంట్ ఏజెన్సీ మేనేజర్ రస్సెల్ చెప్పాడు.
‘సీటన్ సోప్ ప్రకటన మనకి వచ్చింది. వారి షాంపూ, సోప్‌లకి పత్రికా ప్రకటనలకి చక్కటి ఫొటోలు కావాలి’

12/24/2017 - 00:01

కోపంతో అరవడం, అసంబద్ధమైన ఆజ్ఞలు జారీ చేయడం, చిన్నచిన్న విషయాల్లో కూడా మండిపడటం మొదలైనవన్నీ వత్తిడికి గురైన మనిషి లక్షణాలు. ఆ లక్షణాలు అతని కింద పని చేసేవారు పోలీస్ చీఫ్ లోపెజ్‌లో గమనించారు. దాంతో వారు ఆయనకి సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే కెప్టెన్ మేజా చొక్కా పై గుండీని పెట్టుకోలేదని హెడ్ క్వార్టర్స్‌కి ఫిర్యాదు చేస్తానని లోపెజ్ బెదిరించాడు.

12/23/2017 - 20:54

డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ స్లోవన్ దీర్ఘంగా నిట్టూర్చి తన ముందు కూర్చున్న ఆ వృద్ధురాలికి మనుషులు తమ ఇష్టప్రకారం ఎప్పుడైనా మాయం అవుతూంటారని నచ్చజెప్పసాగాడు. కాని కోపధారైన మిసెస్ బ్రిక్స్ తన కూతురు అలా మాయం కాలేదని గట్టిగా చెప్పింది.
‘నా సూసాన్ అలాంటిది కాదు. ఇది స్వేచ్ఛా దేశం అని, ఎవరైనా కావాలని మాయం అవచ్చని మీరు చెప్పినా నేను అంగీకరించను’

12/17/2017 - 01:09

‘అతను వచ్చాడు’ కిటికీలోంచి బయటకి చూసిన వృద్ధురాలు చెప్పింది.
‘అయ్యో! జీవించి ఉన్న ఏకైక బంధువు. ఇప్పుడు ఆస్థి మొత్తం అతనికే ఇవ్వాలి అనుకుంటాను’ ఆవిడ భర్త బాధగా చెప్పాడు.
‘ఆవిడని మనం గత ఇరవై ఏళ్లుగా కనిపెట్టి ఉన్నాం. మనకి ఆవిడ కొంత ఇవ్వడం సబబు’ ఆ వృద్ధురాలు చెప్పింది.

12/03/2017 - 00:36

14 నవంబర్ 1880.
అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని ఆ చెట్టు దగ్గరికి ఆరుగురు గుర్రాల మీద చేరుకున్నారు. నెక్ టై పార్టీగా ముద్దుగా పిలిచే ఆ కార్యక్రమం కోసం వారు అక్కడికి చేరుకున్నారు. చెట్టు నించి ఉరి తాడు వేలాడుతోంది. గుర్రం మీద కూర్చుని చేతులు వెనక్కి కట్టబడ్డ జోసెఫ్ కేజువల్ మెడకి ఉరి తాడు తగిలించారు. హింసాత్మక జీవితం గడిపిన జో కేజువల్ ఆఖరి నిమిషాల్లో ప్రశాంతంగా కనిపించాడు.

11/25/2017 - 21:23

పోలీస్ ఆఫీసర్ వారి ఇంటికి వచ్చినప్పుడు రీనా హోలీ లివింగ్ రూంలో ఉంది. ఆమె మొహం పాలిపోయి ఉంది. అతన్ని కిటికీలోంచి చూసిన ఛార్లెస్ హోలీ పైనించి కిందకి దిగి వచ్చాడు.
‘ఛార్లెస్. ఇతను లెఫ్టినెంట్ కేసీ. రిచర్డ్ మరణం గురించి విచారించడానికి వచ్చాను’ రీనా చెప్పింది.
ఛార్లెస్ బలంగా, లావుగా ఉన్న అతని దగ్గరికి వెళ్లి కరచాలనం చేశాడు. ఆశ్చర్యంగా ఆ బలమైన మనిషి చేతులు మృదువుగా ఉన్నాయి.

Pages