S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్ కథ

03/25/2017 - 23:51

పోలీసుస్టేషన్లోని లెఫ్టినెంట్ బ్రాండన్ తన దగ్గరికి వచ్చిన ఆవిడ వంక చూశాడు. సుమారు నలభై ఐదేళ్లున్న ఆవిడ ఒంటి మీది దుస్తులు చిరిగి ఉన్నాయి. ఓ చవక మనీ పర్స్‌ని బ్రాండన్‌కి చూపించి చెప్పింది.
‘ఇది నాకు దొరికింది. ఎవరికి ఇవ్వాలి?’
‘నాకే’
దాన్ని అందుకుని అందులో ఉన్న ఐదు డాలర్ల నోట్లని తీసి లెక్కపెట్టాడు. సరిగ్గా వంద డాలర్లు ఉన్నాయి.

03/18/2017 - 22:26

డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ బ్రిడ్జ్‌మీద ఓ కారు ఆగడాన్ని చూశాడు. ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పుడు అక్కడ చాలా మంది కార్లు ఆపి ఆ నగరాన్ని రెండుగా విభజిస్తున్న నదిని, అవతలి వైపు కనిపించే ఎతె్తైన భవనాలని చూస్తూంటారు. ఆ నగరంలోని టూరిస్ట్ ప్రాంతాల్లో అదొకటి. రద్దీగా ఉంటే అక్కడ కారు వేగాన్ని కొద్ది క్షణాలు తగ్గించి, వెనక నించి హార్న్ వినిపించే దాకా ఆ దృశ్యాన్ని చూసి వెళ్తూంటారు.

03/15/2017 - 23:11

ఆ శుక్రవారం సాయంత్రం నాలుగుకి నేను ఎయిర్‌పోర్ట్ నించి మా ఇంటికి చేరుకునే సరికి సూట్లోని ఓ లావుపాటి పొట్టి వ్యక్తి మా ఇంటి తలుపు మూస్తూ నాకు కనిపించాడు. అతను పూర్తిగా అపరిచితుడు అవడంతో అతను నా ఇంట్లోకి ఎలా వెళ్లగలిగాడు, అసలు అక్కడ ఏం పని అనే ఆశ్చర్యం నాకు కలిగింది.

03/04/2017 - 21:46

రోజు మిసెస్ జిల్లీకి తన భర్తకి తన మీద అసూయ కలిగితే చూడాలనే కోరిక కలిగింది. ఆ విధంగా ఆమె సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో పడేసుకుంది.

02/26/2017 - 04:03

ఆగస్ట్‌లో మంచు, చలి పోయి బయట తిరిగేంత వెచ్చటి ఎండ ఉంటుంది కాబట్టి కుక్కల యజమానులు తమ పెంపుడు కుక్కలతో బయటకి వచ్చే నెల అది. అందుకని కెనడాలో అగస్ట్ నెలని కుక్కల నెలగా పిలుస్తారు.
ఆ ఊళ్లోని ఓ కుక్కకి యజమాని లారా ఫ్రాన్సిస్. ఆమె కీవ్ బీచ్‌కి ఆ సాయంత్రం తన పెంపుడు కుక్కని వాకింగ్‌కి తీసుకువెళ్లింది. దారిలో అనేక మంది పరిచయస్థులు ఆమెని పలకరించారు. ఆమె కూడా వాళ్లని గ్రీట్ చేసింది.

02/18/2017 - 23:48

మీరు మార్కన్ అండ్ డేవిస్ సర్కస్ కంపెనీలో మేనేజర్ కదా?’ బార్లోని ఆమె నన్ను ప్రశ్నించింది.
‘అవును. మీరు?’ అడిగాను.
‘నా పేరు అనవసరం. రేపు మీ సర్కస్ టెంట్లు ఎత్తేసి మీరంతా ఇంకో ఊరు వెళ్లిపోతున్నారు కదా?’
‘అవును’
ఆమె కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి తర్వాత అడిగింది.
‘డబ్బు కోసమేగా మీరు సర్కస్‌లో చేరి దేశమంతా తిరిగేది?’
‘అవును. ఏం?’

02/12/2017 - 04:27

వాల్టర్ తన ఇంటికి ఎంత ఆలస్యంగా వచ్చినా అతని కోసం ఎదురుచూస్తూ కుర్చీలో కూర్చున్న హెలెన్ కనిపిస్తూంటుంది. అది వాల్టర్ ఇల్లు. అతనికి అక్క మాత్రమే ఉంది. వాళ్లకి టివి కూడా లేదు. అందుకే ఆమె ఎప్పుడూ బైబిల్‌ని చదువుతూంటుంది.
ఆమె చేతిలో ఎప్పటిలానే బైబిల్ ఉంది. ఆ పుస్తకంలోంచి తలెత్తి చూస్తూ హెలెన్ చెప్పింది.
‘ఇప్పుడు అర్ధరాత్రయింది’

02/04/2017 - 21:34

సెమినరీ (క్రిస్టియన్ మత కాలేజీ) ఆవరణలోని తోటలో కెవిన్ ఆనందంగా గులాబీ మొక్కల ఎండు కొమ్మలని కత్తిరిస్తూండగా అతని చెల్లెలు రోజ్ మరణించిందన్న సమాచారం అందింది. అది ఆత్మహత్య కాబట్టి ఆ మరణం కెవిన్‌ని మరీ బాధించింది. అతనికి చెల్లెలి నించి అందిన పార్సిల్‌లోని ఆమె డైరీ చదివాక అతని బాధ రెట్టింపైంది. ఆ డైరీలోని చేతిరాత, దాంతోపాటు వచ్చిన ఉత్తరంలోని చేతిరాత రోజ్‌దే.

01/29/2017 - 03:44

మారిసన్ దంపతులు ఎప్పుడూ నిజమే చెప్పేవారు. అది ఎంత బాధాకరమైనా సరే. ఇన్‌కంటేక్స్‌ని ఎగ్గొట్టకుండా చెల్లించేవారు. ఓ రోజు స్టాప్ బోర్డ్ దగ్గర తన కారుని ఆపనందుకు మారిసన్ ట్రాఫిక్ కోర్ట్‌కి వెళ్లి పది డాలర్ల ఫైన్‌ని చెల్లించాల్సి వచ్చింది. దానికి వారు ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే మిస్టర్ అండ్ మిసెస్ మారిసన్‌లు చట్టాన్ని అతిక్రమించడానికి ఇష్టపడరు.

01/21/2017 - 22:17

నేను ఎన్నడూ చూడకూడదని ఆశించిన దృశ్యం అది. మా ఇంటి తలుపు బార్లా తీసి ఉంది. బయట బెకీ నిలబడి ఉంది. మా కారు చూడగానే ఆమె బయటకి పరిగెత్తుకు వచ్చింది.

Pages