S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్ కథ

01/08/2017 - 05:18

ఆర్చర్ ఆ చిన్న దుకాణం తలుపు తెరవగానే తలుపుకి కట్టిన చిరుగంట మోగింది. ఆ షాప్‌లో గోడలకి వేలాడే చాలా గడియారాల టిక్‌టిక్ శబ్దాలు వినపడసాగాయి.
ఓ గడియారాన్ని బాగు చేసే ఓ లావుపాటి పొట్టి వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగాడు.
‘మీరేనా జేజర్?’
‘అవును’
‘నన్ను డగెట్ పంపాడు. దీన్ని మీకు ఇవ్వమన్నాడు’

12/31/2016 - 18:34

గత రెండు గంటలుగా జాక్ ఆ ఎడారి వేడిలో రైలు పట్టాల పక్కన నడుస్తున్నాడు. హై వే, దానికి కొద్ది దూరంలో ఉన్న ఏకైక భవంతి కనపడ్డాక అతను అలసటగా ఆగాడు.

12/24/2016 - 21:53

ఆ రాత్రి తుఫాను వల్ల చాలా చలిగా ఉండబోతోందని కాటిల్ ఊహించాడు. గది మధ్యలోని ఇనప కుంపటి దగ్గరికి వెళ్లి కొత్త కట్టెని నిప్పులో ఉంచాడు. అతనికి కొండల్లోని పైన్ వృక్షాల మధ్య నించి వచ్చే ఉత్తర గాలుల శబ్దం వినిపిస్తోంది. కిటికీలోంచి మంచు తునకలు పడటం కనిపిస్తోంది. బయట ఉన్న వాళ్లకి అది నరకపు రాత్రి అవుతుందని అనుకున్నాడు. కుంపటి నించి వేడి వస్తున్నా అతనికి స్వల్పంగా చలిగా ఉంది.

12/18/2016 - 04:57

స్మగ్లర్ల దీవిని ఎవరో కొన్నారని నేను మొదటిసారి మే నెల్లో విన్నాను. కేమరూన్ తీరంలో సాల్మన్ చేపలని పట్టే వృత్తి నాది. వాటిని అమ్మడానికి ప్రాసెసింగ్ షెడ్‌కి వెళ్లినప్పుడు చేపలని తూకం వేస్తూ కేషియర్ చెప్పాడు.
‘వెర్నే! లాస్‌ఏంజెలెస్ నించి వచ్చిన ఎవరో లక్ష డాలర్లు చెల్లించి స్మగ్లర్ల దీవిని కొన్నారట’
‘ఎవరు కొన్నారు?’ నా పక్కనే ఉన్న ఏబ్నర్ ప్రశ్నించాడు.
‘రోజర్’

12/10/2016 - 21:44

అది నవంబర్ ఆఖరి వారంలోని ఓ గడ్డ కట్టే చలి రాత్రి.
ఈస్ట్ కోస్ట్‌లోని మా గ్రామానికి పావుమైలు దూరంలోని పర్వతాల్లోంచి వచ్చే చల్లటి తూర్పు గాలి కత్తిలా కోస్తోంది.

12/04/2016 - 06:38

ఆ రాత్రి అకస్మాత్తుగా నా కాటేజ్ బయట అడుగుల చప్పుడు వినిపించింది. నేను తలుపు తెరచి చూస్తే అందులోంచి దిగిన ముగ్గురు కనిపించారు. ఆ అపరిచితులు నా కాటేజ్‌కి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు.
‘మేము ఈ రాత్రికి మీ అతిథులం’ వారు లోపలికి వచ్చాక బాస్‌లా కనిపించే వ్యక్తి చెప్పాడు.
మాటల్లో వారిలోని ఒకరి పేరు హేంక్స్ అని నాకు తెలిసింది. మిగిలిన ఇద్దరి పేర్లు తెలీలేదు.

12/03/2016 - 22:28

కొద్దిలో అతను పట్టుపడేవాడే. చంపడానికి వచ్చిన ఎర్ల్ ఆ ఇంటి వెనుక పొదల్లో నక్కి ఆ ఇంటి వంకే చూస్తున్నాడు.
అరగంట క్రితం అతను ఛార్లీని చంపడానికి ఐదు నిమిషాల దూరంలో ఉండగా షెరీఫ్ ఫ్రెడ్ అడ్డంకి అయ్యాడు.
‘ఓ ఛార్లీ! తలుపు తెరు’ అన్న ఫ్రెడ్ మాటలు విన్న తక్షణం అతను ఛార్లీ ఇంట్లోకి ప్రవేశించే తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
‘లేదా నేను తలుపు విరక్కొట్టుకుని లోపలకి వస్తాను’

11/19/2016 - 21:23

తలుపు చప్పుడు విని బట్లర్ తలుపు తీసి ఎదురుగా నిలబడ్డ వ్యక్తి వంక చూశాడు.
‘మిస్టర్ హార్డేకర్ నన్ను భోజనానికి పిలిచారు’
‘మంచిది. మీ పేరు?’
‘కెన్‌షా’
బట్లర్ వెంటనే అతన్ని లోపలికి ఆహ్వానించి తీసుకు వెళ్లి హార్డేకర్‌కి పరిచయం చేశాడు. అతనితో కరచాలనం చేస్తూ హార్డేకర్ చెప్పాడు.
‘నంబర్ వన్. గుడీవినింగ్ మిస్టర్ కెన్‌షా’

11/12/2016 - 19:09

సముద్ర ప్రయాణాలు మార్టిన్‌కి కొత్త కాకపోయినా ఓడ అటూ ఇటూ ఊగడానికి అతను ఇంకా అలవాటు పడలేదు. ముఖ్యంగా రాత్రిళ్లు. అందువల్ల అట్లాంటిక్‌ని దాటేప్పుడు అతనికి తక్కువ నిద్ర పడుతుంది. దాంతో ఇక అలసటతో కళ్లు వాటంతట అవే మూత పడేదాకా నిద్ర కోసం వేచి చూడాల్సి వస్తుంది. అతనికి వ్యాపారం వల్ల తరచు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతూంటుంది. భార్య అతన్ని విమానంలో వెళ్లమని తరచూ తిడుతూంటుంది.

11/05/2016 - 22:23

‘రండి. కిందకి దారి ఇటువైపు. తలుపు దగ్గర మీ తలలు జాగ్రత్త. మెట్లని కూడా చూసుకోండి. బాగా అరిగి జారుతున్నాయి. మనం మళ్లీ ప్రాంగణంలోకి చేరుకున్నాం’
‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. ఇంతటితో మన టూర్ ముగుస్తుంది. మీ సమయానికి, సహనానికి థాంక్స్. గేటు దగ్గరికి ఇటు వైపు నించి వెళ్లాలి.

Pages