S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లోకాభిరామం
హాంటింగ్ మెలొడీస్ అని నాకొక పద్ధతి ఉన్నది. కొన్ని పాటలు వద్దన్నా నా మెదడులో తిరుగుతూ ఉంటాయి. వాటిలో మొదటిది అక్క మహాదేవి రచించిన ఒక కన్నడ వచనం. తెలుగులో కూడా వచనాలు ఉన్నాయి. వాటిని పాడాలని ఎవరికీ తోచినట్టు లేదు. పెద్దలు గమనింతురు గాక.
సూర్యుడు తూర్పున ఉదయించును, అంటే ఈ ప్రపంచంలో తొంభయి తొమ్మిది శాతం మంది అవును అంటరు. సూర్యుడు ఉదయించడము, అస్తమించడము నిజమే. అయితే కదిలేది సూర్యుడు కాదు భూమితో బాటు మనం సూర్యగోళం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఒక చుట్టు తిరగడానికి ఒక సంవత్సరము. అయితే సూర్యుని చుట్టు తిరుగుతున్న భూమి, బొంగరంలాగ తన చుట్టు తాను కూడా తిరుగుతున్నది. కనుక పగలు రాత్రి కలుగుతున్నయి.
క్యాలెండర్ మారింది. అంతకు మించి మరేదీ మారదు. సూర్యుడు నిత్యంలాగే తూర్పున ఉదయిస్తాడు. పడమట అస్తమిస్తాడు. ఆ సూర్యుడి కదలికలను లెక్కించడానికి మనిషి వేసుకున్న పథకం క్యాలెండర్. ఆ సంగతి సూర్యుడికి తెలియదు. కొత్త సంవత్సరం అని అందరూ ఎంత గోల చేస్తున్నా అతను మాత్రం తన దారిలో, తన పాత దారిలో, తన పద్ధతిలో, తన పాత పద్ధతిలో నడిచి వెళ్లిపోతాడు.
ధనుర్మాసంలో ఒకరోజున ఉదయానే్న గుడిలో పూజలు జరిగాయి. పులిహోర, దధ్యోధనం, చక్కెర పొంగలి ప్రసాదాలు పుష్కలంగా పెట్టారు. అందరూ లేచి బయలుదేరుతున్నారు. ‘ఒక కప్పు టీ కూడా ఇస్తే, ఇంటికెళ్ల నవసరం లేకుండా ఇక్కడి నుంచే పనిలోకి వెళ్లిపోయేవాళ్లం కదా!’ అన్నాడొకాయన. చాయ, మనలను ఛాయలాగ పట్టుకున్నది. మన అలవాట్లలో భాగమయింది. కానీ ఆచారాల్లో భాగం కాలేదు. లేకుంటే గుడిలో తీర్థంతోబాటు ‘టీ’ర్థం కూడా ఇచ్చేవారేమో?
చప్పుడు లేని పేలుడు గురించి ఆలోచిస్తే అది ఎప్పుడు జరిగిందని ఒక ప్రశ్న. ఇదిగో, ఈ విషయం గురించి ఒక హోటేల్‌లో కూచుని ఇద్దరు సైంటిస్టులు మాట్లాడుకుంటున్నారట. వాళ్ల మాటలు విశ్వం ముగిసిపోవడం వేపు మళ్లాయి. దాని పుట్టుక చెప్పాపెట్టకుండా జరిగినట్టే. ముగింపు కూడా జరిగే వీలుందని వాళ్లు అనుకుంటున్నారు. పక్క బల్ల దగ్గర ఉన్న ఒక పెద్దమనిషి ఆత్రంగా లేచి వచ్చి వీళ్లను ‘అంటే విశ్వం ముగుస్తుందంటారా’ అని అడిగాడట.
ఏమొదట్లో.. అన్నిటికన్నా మొదట్లో.. ఏ అన్నిటికన్నా.. అసలు అన్నిటికన్నా.. అనగా.. ఈ ప్రపంచము, విశ్వమూ ఏవీ లేనప్పుడన్నమాట.. నిజంగా మొదట్లో అసలేమీ లేదు. ఆ పరిస్థితిని ఊహించడమే కష్టం. ఇవాళ మనకు అన్నిటికన్నా చిన్నది అని చెప్పవలసి వస్తే పరమాణువు గుర్తుకు వస్తుంది. మన ప్రాచీనులు కూడా పరమాణువులలో అణువు, మహత్తులలో మహత్తు అంటూ వర్ణనలు చేశారు. పరమాణువులో భాగాలున్నాయి అంటున్నారు. అందులో ప్రోటాన్ ఒకటి.
సంగీత సముద్రం తీరానికి కూడా దూరంగా నిలబడి, అలల కారణంగా పుట్టే తుంపర తగిలితే ఆహా, సంగీతం అనుకుంటున్న అతి సామాన్యుడిని నేను. కానీ భారతీయ శాస్ర్తియ సంగీతం బతుకులో భాగంగా మారింది. కేవలం వినడంతో కుదరదు. వేలాది గంటల సంగీతాన్ని కంప్యూటర్‌లో పదిలపరిచాను. అందులో కొంత భాగం నా వద్దకు స్పూల్స్, కాసెట్స్, గ్రామఫోన్ డిస్క్‌ల రూపంలో వచ్చింది. వాటిని డిజిటల్ పద్ధతిలోకి మార్చడము నాకు ఒక నిత్యకృత్యంగా మారింది.
చిన్నప్పుడు పల్లెలో యింటి ముందర పండుకుంటే ఆకాశంలో నక్షత్రాలు జొన్నలు ఆరబోసినట్టు సందులేకుండ కనబడేవి. పొగడ చెట్టు కింద పండుకుంటే పూలు మన మీద చుట్టూ రాలి పడతయి. అట్లనే ఈ చుక్కలు గూడ రాలి పడితే ఎంత బాగుండును అనిపించేది. ఎనె్నల కుప్పలు అని ఒక ఆట ఆడేవాళ్లము. వెనె్నల ఎట్లుంటుందో చూచి ఎంత కాలమయిందో. బతుకు పేరున పట్నం చేరిన తరువాత చుక్కలు కనిపించకుండ అయినయి.
నూచివాడు అనే చీనుగాడు అనే శ్రీనివాసు వరంగల్‌లో చదువుకుంటున్నాడు. మొదటి నుంచి వాడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండేది అలవాటు. చదువు వదిలి వరంగల్ పోవుడు కుదురదు గాని, చుట్టపుచూపుగ పోవచ్చు గద! ఆలోచన రావాలెగాని, ఆచరణలో లోపము ఏనాడు ఉండదు. పాలమూరు నుంచి అంత దూరము పోయేటందుకు పైసలు ఎవరు యిచ్చినది గుర్తులేదు. చీను ఇచ్చి ఉంటడని నా అనుమానము. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్ అని ఉంటుంది.
పెండ్లికి, తీర్థయాత్రకు తప్పిస్తే మనవాండ్లకు ప్రయాణం చేయాలన్న ఆలోచన పుట్టదు గదా? నాకు భ్రమణకాంక్ష, అంటే తిరిగి దేశం చూడవలెనని ఉన్నది గాని పరిస్థితులు పడనియ్యవు. పరిశోధనలో ఉండంగ కాన్ఫరెన్స్‌ల పేరు మీద కొంచెం తిరిగిన. ఉద్యోగంలో ఉండంగ కూడ కొంత తిరిగిన. అయితే ఆ తీరు వేరుగ ఉంటుంది. కార్యక్రమంలోనే కాలము అంత గడిచిపోతుంది. నగరం విశేషాలు చూచేందుకు సమయం దొరకదు.