S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

08/12/2017 - 22:26

ఒకాయన ఆసుపత్రిలో అనారోగ్యంతో పడుకుని ఉన్నాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ ఆసుపత్రిలో ఆయన చాలా రోజులుగా ఉన్నాడు. ఒకనాడు ఒక వింత విషయం తెలిసింది. కోర్టు కేసు కారణంగానో మరొక రకంగానో ఆయనకు చాలా బోలెడు డబ్బు, ఆస్తి వచ్చాయని తెలిసింది. ఆ సంగతి ఆయనగారికి చెప్పాలి. ముందే అనారోగ్యంగా ఉన్నాడు. ఏమయిపోతాడో అని, ఆయనకు కావలసిన వారంతా మల్లగుల్లాలు పడుతున్నారు.

08/07/2017 - 00:03

అయిదు వారాలు, అనవరతంగ, నా ఆలోచనలతో ఊదరగొట్టేసరికి అందరూ కాలం మారింది, లోకాభిరామం అనే కాలమ్ మారింది అనుకున్నరు. ఏమీ మారలేదు. అందుకే మరోసారి నడుస్తున్న మన ‘అతని’ గురించి, కొరకు వెదుకుతూ వెళదాం పదండి!

07/30/2017 - 23:27

విశ్వం చాలా పెద్దది. అందులో మనిషి పరిశీలించినది చాలా తక్కువ. ఆ తక్కువ మీదనే ఇప్పుడున్న తెలివి మొత్తం ఆధారపడి ఉన్నది. తెలిసిన ఈ నాలుగు సంగతులు శాశ్వత సత్యాలు, సర్వత్రా సత్యాలు అన్న భావంతో మనిషి ముందుకు పోతున్నాడు. విశ్వానికి మనమే నిర్ణయించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. పదార్థ నిర్మాణానికి ఆధారమయిన న్యూట్రాన్, ఎలక్ట్రాన్ లాంటివి మొదటి ఉదాహరణ. అవి నిరంతరం కదులుతూ ఉండే నిర్మాణాలు.

07/22/2017 - 22:33

ఆలోచన సామాన్యం. అంటే అందరికి వస్తుంది. అందులో ఎవరికి వారే ప్రత్యేకం. ఎవరి ఆలోచన వారికి వస్తుంది. శరీరంలో కూడా ఇదే రకమయిన వైవిధ్యం. ఇదే రకమయిన సమానత్వం కనపడుతున్నాయి. మెదడు, చేతన అన్నవి మరొక స్థాయిలో వైవిధ్యానికి, సామాన్యతకు ఉదాహరణలుగా ఉన్నాయి.

07/16/2017 - 04:36

రెండు వారాలుగా సాగుతున్న ఈ చర్చ మరింత దూరం నడవాలని నా అభిమతం. నేను చెప్పదలుచుకున్న సంగతులు నేనే చెప్పాలి. మరొకరు చెప్పరు. కనుక చెపుతున్నాను. దయచేసి నా కొరకు చదవండి.

07/09/2017 - 00:10

గడచిన వారం లోకాభిరామం చదివినా చదవకున్నా ఈ సంగతులు మీకు అర్థమవుతాయి. మన గురించి మనం ఆలోచించ వలసిన అవసరం ఉంది అనుకునే వారంతా ఈ మాటలను గురించి ఆలోచించాలి కూడా.

07/04/2017 - 04:07

లియో సిలార్డ్ అని ఒక భౌతికశాస్త్ర పరిశోధకుడు ఉండేవాడు. అతనికి గొప్ప పేరు లేదు. మిత్రుడు హాన్స్ బెత్ మాత్రం కొంచెం పేరున్నవాడు. లియో మిత్రుడితో తనకు డయరీ రాయాలని ఉందని చెప్పాడు. పరిశోధకులు రాసిన సంగతులను పుస్తకాలుగా ప్రచురించడం అలవాటు. లియో మాత్రం తనకు అట్లాంటి ఉద్దేశం లేదని అన్నాడు. తాను చేస్తున్న పనులు దేవునికి తెలియాలని రాసే ప్రయత్నం అని కూడా అన్నాడు.

06/25/2017 - 00:14

ఐజక్ బషేవిస్ సింగర్ పోలాండ్‌కు చెందిన రచయిత. యిద్దిష్ అనే భాషలో గొప్ప కథలు, నవలలు రాశాడు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా అతను కూడా మరెందరో వలెనే అమెరికాకు వలస వచ్చాడు. (అదేదో అమెరికా మా ఊరయినట్టు వచ్చాడు అని రాశాను. నా కొడుకు, కోడలు ఆ దేశంలో ఉన్నంత మాత్రాన అది నా దేశం ఎంత మాత్రం కాదు. అక్కడికి వెళ్లాలన్న ఆలోచన నాకు లేదు.

06/18/2017 - 00:03

ఛణా వణగ వెంధరా, దాని ఛెక్తి వెంధరా? అంతగలిసి తంతె మళ్ల. అంతు దొరకదంటరా’ అని రెండెద్దుల సంజీవరెడ్డి చిన్నప్పుడు బడిలో పాట పాడడం గుర్తుంది. (చైనా అనగ ఎంతరా? దాని శక్తి ఎంతరా?’ అని వాని కవి హృదయము. అప్పట్లో భారతదేశం, చైనాలకు యుద్ధం జరిగింది. కనుక దేశభక్తి పేరున శత్రుదేశాన్ని తక్కువ చేసి, ఉత్సాహం పెంచే ప్రయత్నంగా ఆ పాటలు పాడుకున్నాము.

06/11/2017 - 00:37

నా రాతకు ఒక పరిమితి ఉంటుంది. అదే నా మూర్ఖత్వము. గడిచిన వారాలలో ఒకసారి చిన్నతనంలో తిన్న పండ్ల గురించి రాసినట్టున్న. వ్యాసము చదివిన ఒక మిత్రుడు ఫోన్ చేసి, మీకు ఫలాన ఫలాన పండ్లు తెలియవా? అని అడిగినడు. ప్రపంచములో ఉండే పండ్లన్ని మా ఊరిలో, ఊళ్లో, ఊళ్లె ఉన్నయి గనుకనా? ఉన్నవన్ని నాకు గుర్తున్నయి గనుకనా? పులిచెరి పండ్లు అని ఉండేటివి. వాటిని గుర్తుతోని పులిచింత పండ్లు అని రాసినట్టున్న.

Pages