S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మండి! ఇది నిజం!!

05/15/2016 - 05:46

ఇండియా, పాకిస్తాన్, చైనా లాంటి అభివృద్ధి చెందే దేశాల్లో రైలు పెట్టెలు కిక్కిరిసి ఉండటమే కాక, ఒకోసారి రైలు డబ్బాల మీద కూడా ప్రయాణీకులు ఎక్కి ప్రయాణించే దృశ్యాలు కనపడుతూంటాయి. బీద దేశాల్లో ప్రయాణీకులు ఎక్కువ. రైళ్లు తక్కువ. చైనాలో కొత్త సంవత్సరం సందర్భంగా కోట్ల మంది తమ స్వగ్రామాలకి ప్రయాణిస్తారు. ఆ వారమంతా రైళ్ల డబ్బాల మీద కూడా వారు ప్రయాణిస్తూంటారు.

05/07/2016 - 22:45

ఒక చినుకు ఎన్నడూ వరదకి బాధ్యత తనది అనుకోదు. కాని స్పెయిన్‌లో ఓ చిన్న కెథడ్రిల్ అతని జీవితంలోని ప్రతీ క్షణం బాధ్యతని వహిస్తోంది. అతని పేరు డాన్ జెస్టోగవేవో మార్టినెజ్. స్పెయిన్‌లో మేడ్రిడ్‌కి 12 మైళ్ల దూరంలోని మెజోరరా డెల్-కెంపో అనే చిన్న గ్రామంలో ఇతను వొంటరిగా ఓ కెథడ్రిల్ నిర్మాణాన్ని చేపట్టాడు. తను క్రిస్టియానిటీకి ఇచ్చే కానుకగా అతను దాన్ని భావిస్తున్నాడు.

05/02/2016 - 23:06

మట్టిలో పండిన ఆహార పదార్థాలని తింటూంటాం కాని మట్టిని తినడానికి మనం ఇష్టపడం. కాని కొన్ని సందర్భాలలో మనిషి మట్టిని ఇష్టంగా తినడం జరుగుతుంది. కొందరు చిన్నపిల్లలు మట్టి తింటూంటారు. కొన్ని సంస్కృతుల్లో మట్టిని తినడం సంప్రదాయం కూడా. ఇలా మట్టిని తినడాన్ని జియోఫాజియా అని పిలుస్తారు.

04/23/2016 - 21:33

ఆఫ్రికాలోని గ్రామాలని చూడాలంటే అమెరికన్స్ ఆఫ్రికా ఖండానికి వెళ్లాల్సిన అవసరం లేదు. నార్త్ కరోలినాలోని ఓ గ్రామానికి వెళ్తే చాలు. ఆ గ్రామం పేరు ఓయోటుంజి. ఓయోటుంజి అంటే అర్థం ఓయో మళ్లీ లేచాడు అని. 25 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ గ్రామం నార్త్ కరోలినా స్టేట్ హైవే 17 నించి పది నిమిషాల దూరంలో, ఇంటర్ స్టేట్ 95 హైవేలో ఉంది. చెట్ల మధ్యగల సాధారణ రోడ్ మీద ప్రయాణించి ఈ గ్రామానికి చేరుకోవచ్చు.

04/16/2016 - 23:28

కొన్ని రకాల జంతువులని మనం ఊళ్లో చూస్తాం. మరి కొన్నిటిని చూడాలంటే అడవికి వెళ్లాలి. నాగరికత పెరిగాక మనిషి జంతువులని చూడటానికి అడవికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఓ పద్ధతిని ఏర్పాటు చేశారు. అదే జంతు ప్రదర్శనశాల. లేదా జూ.

04/10/2016 - 00:32

భారతదేశంలో వ్యాపారస్థులకి, వినియోగదారులకి, ఆదాయం కోసం ప్రభుత్వాలకి, ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకి మద్యం ఉపయోగిస్తోంది. ఒకసారి మద్యానికి అలవాటు పడితే ఇక అందులోంచి బయటపడటం కష్టం. భారతదేశంలోని గ్రామాల్లో మద్యం వినియోగం ఎక్కువ. ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం వినియోగం మీద ఎక్సైజ్ శాఖకి కోటా కూడా విధిస్తున్నాయి.

04/03/2016 - 10:04

గ్రంథాలయం మనిషి పురోగతికి దోహదం చేస్తుంది. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రంథాలయ వ్యవస్థని ప్రజలకి అందుబాటులో ఉంచడం, వారు వాటిని ఉపయోగించుకోవడం జరుగుతూంటుంది. పుస్తకం అనగానే రచయిత గుర్తొస్తాడు. అతను పుస్తకం ద్వారా ఓ కొత్త విషయాన్ని చదువరులకి అందిస్తాడు. ఐతే పాఠకులు ఆ రచయితని తమ సందేహాలు ముఖాముఖి అడిగి నివృత్తి చేసుకునే అవకాశం లేదు. అలాగే రచయిత పుస్తకంలో రాసింది తప్ప ఇంకేమీ చెప్పలేడు.

03/26/2016 - 22:51

హాలీవుడ్ సినిమాల్లో చూసే చాలా సన్నివేశాలు నిజ జీవితంలో ప్రేక్షకులకి అనుభవంలోనికి రానివి. కిడ్నాప్ చేయబడటం, తిరిగి క్షేమంగా బయటకి రావడం లాంటివి తమకి జరిగితే అవి భయంతో పాటు థ్రిల్‌ని కూడా కలిగిస్తాయి. అలాంటి థ్రిల్‌ని కోరే వారికి ఫ్రాన్స్‌లోని ఓ కంపెనీ ఆ సేవని అందిస్తోంది. తూర్పు ఫ్రాన్స్‌లోని ఆ కంపెనీ పేరు అల్టిమేట్ రియలైట్.

03/20/2016 - 00:22

అమెరికాకి చెందిన మెక్‌డోనాల్డ్స్ రెస్ట్‌రెంట్ బ్రాంచ్‌లు ప్రపంచంలోని చాలా దేశాల్లో విస్తరించుకున్నాయి. అమెరికాలోని ఆ రెస్ట్‌రెంట్లో దొరికే అన్ని పదార్థాలు అన్ని దేశాల్లో లభించవు. ఇలా ఓ దేశానికి చెందిన మెక్‌డోనాల్డ్స్ మెనూలోని ఐటెంస్ మరో దేశంలో లభించవు. స్థానిక రుచులని బట్టి మెక్‌డోనాల్డ్స్ ప్రతీ దేశంలో కొత్త ఆహార పదార్థాలని ప్రవేశపెడుతూంటుంది.

03/13/2016 - 09:04

ప్రజాస్వామ్యంలో నిరసనలు సాధారణం. నిరసన వ్యక్తం చేయని మనిషే ప్రపంచంలో ఉండడు. ఏ నిరసన అయినా కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో ముగుస్తుంది తప్ప కాలంతోపాటు కొనసాగదు. కానీ అమెరికాలో అత్యధిక కాలం కొనసాగిన నిరసన ఒకటి ఉంది. అది కూడా వైట్‌హౌస్ సమీపంలోనే.

Pages