S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

10/29/2016 - 23:22

దీపావళి కేవలం హిందువులకే పరిమితమైన పండుగ కాదు. ఇప్పుడు ఇది విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలో క్రిస్మస్ తరువాత ఎక్కువమంది జరుపుకనే వేడుకగా ప్రసిద్ధి పొందింది. ఇది ఆర్థికరంగానికి కొత్తవెలుగును ఇస్తోంది. ఈ ఒక్క పండుగకు అటు బంగారం, ఇటు బాణసంచా మార్కెట్లో కనీసం పదివేల కోట్ల మేరకు వ్యాపారం జరుగుతుంది.
.................

10/22/2016 - 23:07

పూర్వమొకప్పుడు నారదుడు, తుంబురుడి సంగీతాతిశయాన్ని పరీక్షింపదలచి తుంబురుడి ఆశ్రమానికి వెళ్లాడు. తుంబురుడు లోపల నున్నాడు వీణ మాత్రం యివతల వున్నది. నారదుడు, తుంబురుని కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో కాస్త వాయువు ఆ వీణ మీదుగా ప్రసరించి వెళ్లింది. అంతే.. ఆ కాస్త గాలికి వీణాతంత్రులు మ్రోగి, శ్రవణానందంగా సప్త స్వరాలు చెవికి సోకాయి - అంతేకాదు, ఆ సప్త స్వర సుందరులు కంటికి కనిపించారు.

10/15/2016 - 23:33

మార్గశిర మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ప్రాతఃకాలంలో తిరుప్పావై వినిపించేది అప్పుడే. గుళ్లూ, గోపురాలూ, వినూత్నమైన శోభతో అలరారుతూ, పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి.

10/15/2016 - 23:05

1960 ప్రాంతంలో ‘ఆకాశవాణి’లో మన వాణి వినబడడమే మహాభాగ్యంగా, అరుదైన అవకాశంగా ఉండేది. సినిమాల తర్వాత ‘గ్లామర్’ మీడియా అంటే ఎవరైనా ఏకకంఠంగా రేడియో అని చెప్పాల్సిందే. అలాంటి రేడియో ‘లలిత సంగీతం’ కై అనేక గీతాల్ని రచించి రాణించడమే గాక అదే ‘ఆకాశవాణి’లో ప్రవృత్తికి అనుకూలంగా వృత్తిని కూడ ఏర్పరచుకున్న మహాకవులు శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, దాశరథి కృష్ణమాచార్యులు కావడం విశేషం.

10/09/2016 - 22:47

నేను, నా సహచరుడు, మా అబ్బాయి, మా కోడలు వారాంతపు సెలవులలో సియాటిక్ నగరం నుండి కెనడాలోని వాంకూవర్ విక్టోరియా సందర్శనకు ప్లాన్ చేసుకున్నాం. మా ఓడ ప్రయాణానికి ముందుగానే టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నాం. మేం అమెరికా వీసాతోపాటు, కెనడా వీసా కూడా భారత్‌లోనే తీసుకున్నాం.

10/01/2016 - 21:28

మన దేశంలోని అటవీ ప్రాంతాలు విభిన్న రకాలకు చెందిన వేలాది వన్యప్రాణులకు నిలయమై జీవ వైవిధ్యానికి పేరుగాంచాయి. అయితే ఇటీవలి కాలంలో పారిశ్రామికీకరణ, అభివృద్ధి పేరుతో - అటవీ ప్రాంతాలలో కూడా ప్రాజెక్టులు, ఆనకట్టలు నిర్మించడం, గనుల త్రవ్వకాలు, అలానే రోడ్లు వేయడం వంటి పనులను చేపట్టడం వలన వన్యప్రాణుల మనుగడకు పెనుముప్పు ఏర్పడి, చాలా జాతుల వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోవడం..

08/20/2016 - 22:17

చైనాలో మేం చేసిన పర్యటన జ్ఞాపకాలు ఇంకా మదిలో మెదలుతూనే ఉన్నాయి. మా ప్రయాణం జరిగి అప్పుడే ఏడాది కావస్తున్నా నిన్న మొన్నటి పర్యటనగా ఉంది. అందుకే ఆనాటి విశేషాలు మరోసారి గుర్తు చేస్తున్నా...

07/24/2016 - 02:31

రాజసానికి అది చిహ్నం...
అందానికి అది గుర్తు..
సాహసానికి మారుపేరు..
దూకుడుతోకూడిన జీవనశైలికి చిహ్నం..
అదే పెద్దపులి...బెబ్బులి...
ఇప్పుడు దానికి పెద్దకష్టమొచ్చిపడింది.
ఆ జాతి ఇప్పుడు అంతరించిపోయే దశకు చేరుకుంది..అతివేగంగా..
భావి తరాలకు పులుల గురించి చెప్పాల్సి వస్తే బొమ్మలు చూపించే చెప్పే పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితికి మనమే కారణం.

06/26/2016 - 01:27

గురువుగారు లేకుండా అప్పుడే ఏడాది గడిచింది. ఇంటా బయటా ఏ సమస్య వచ్చినా గురువుగారికి చెప్పుకుంటే తీరిపోతుంది; ఏ చిక్కునైనా ఆయనే విప్పాలి; ముఖ్యమైన ఏ నిర్ణయమైనా ఆయనే చేయాలి; ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్ చేస్తే చాలు; అన్నిటికీ ఆయనే ఉన్నారు - అన్న భరోసాతో ఇన్నాళ్లూ ధీమాగా బతికేశాం.
ఆ లగ్జరీ ఇప్పుడు లేదు. ఆ ప్రివిలేజి మరి రాదు.

06/26/2016 - 00:18

పూజ్య సద్గురు కందుకూరి శివానందమ్తూగారి శివసాయుజ్యంతో భారతీయ ధార్మిక ఇతిహాసంలో ఒక అపురూప ఉజ్వల ప్రకరణం ముగిసింది. ఆరు దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ప్రజాజీవన, సేవా రంగాల్లో లక్షల మందిని ప్రభావితులను చేసి ధర్మ మార్గాన నడిపించి, విలక్షణ పౌరులుగా తీర్చిదిద్దిన ఒక దివ్యశక్తి చరిత్రాత్మక జీవనయాత్ర చాలించింది.

Pages