S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

12/10/2016 - 22:40

ఏ కారణం లేకుండా ఈ భూమీద ఎవరి పేరూ శాశ్వతంగా నిలిచిపోదు.
సహజంగా వాసన కల్గిన పుష్పం పుట్టగానే పరిమళాన్ని వెదజల్లుతుంది. పుష్పాలన్నీ కాదు. నిర్దిష్టమైన ఒక ప్రయోజనం కోసం పుట్టి, అది నెరవేరిన మరుక్షణం, వెళ్లిపోతారు - వారి స్వప్రయోజనం కోసం కాదు. అలా వారు పొందిన ఆనందాన్ని నల్గురికీ పంచటమే వారి ధ్యేయం. దాని కోసమే జీవిస్తారు. అందుకే వారు కారణజన్ములు.

12/04/2016 - 06:39

మేఘాలయ భూతల స్వర్గం. మబ్బు తునకలు చాలా క్రిందికి తలల మీంచి పిల్ల తెమ్మెరలకు మల్లే పయనించడం తీయటి అనుభూతి. కొన్ని మబ్బులు తమతోపాటు మనల్ని కూడా తీసుకుపోతున్నట్లుగా ఉంటుంది. అంత క్రిందుగా మేఘ మాలికలు సాగిపోతాయక్కడ. చక్కటి వాతావరణం, పచ్చని ప్రకృతి, ఎతె్తైన పర్వతాలు, ఉవ్వెత్తున ఎగసి దుమికే జలపాతాలు.. చూడచక్కని అందాలెన్నో. చక్కని ఆతిథ్యం ఇచ్చే ‘ఖాసీ’ ‘జైన్‌టియాస్’ ‘గారోస్’ తెగలకి చెందిన ఆదివాసీలు..

11/19/2016 - 21:49

భగవాన్ రమణ మహర్షిని ఒకసారి దర్శనం చేస్తే చాలు. సమస్యలతో, సందేహాలతో వచ్చేవారికి వెంటనే సమాధానం దొరికి, మరుక్షణం మాటాడకుండా వౌనంగా, తృప్తిగా వెళ్లిపోయేవారట - ఆధ్యాత్మిక ప్రపంచంలో అందుకే వారు యోగులు.
(గురోస్తు వౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు, చ్ఛిన్న, సంశయాః)

11/12/2016 - 20:23

కలం... రాయడం మరిచింది
కీబోర్డ్.. రాయడం మొదలెట్టాక!
మాట.. పలకడం మరిచింది
మెసేజ్.. పంపడం మొదలెట్టాక!
ఛాయాచిత్రం.. నవ్వడం మరిచింది
సెల్ఫీ.. దిగడం మొదలెట్టాక!
భాషణం.. సాగడం మరిచింది
రింగ్టోన్.. మోగడం మొదలెట్టాక!
తోడు.. వెతకడం మరిచింది
ఫోన్.. చేతపట్టడం మొదలెట్టాక!

11/12/2016 - 20:00

సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు పి.బి.శ్రీనివాస్ మద్రాసులో జరిగే సంగీత కచేరీలకు తరచుగా హాజరవుతూ ఉండేవారు. నాకు మంచి మిత్రుడు. వేలాది సినిమా పాటలు పాడిన మీకు, ఈ సంప్రదాయ సంగీత కచేరీలు వినాలనే ఆసక్తి ఎందుకు కలుగుతోంది? అని అడిగాను.

11/05/2016 - 22:50

విన్న వెంటనే ఆనందాన్నిచ్చేది సంగీతం. సాహిత్యం ఆలోచించిన కొద్దీ అమృతమయమైన అనుభూతిస్తుంది. సంగీతానికి.. సొంపు కూర్చేది.. సాహిత్యం. సాహిత్యానికి ఇంపు కూర్చేది సంగీతం. శుద్ధమైన కర్ణాటక సంగీతానికైనా, సరళంగా వినబడే లలిత సంగీతానికైనా ఇదే లక్ష్యం. స్వతంత్రం రాకముందు మనకు రేడియో కేంద్రమంటూ లేదు.

10/29/2016 - 23:22

దీపావళి కేవలం హిందువులకే పరిమితమైన పండుగ కాదు. ఇప్పుడు ఇది విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలో క్రిస్మస్ తరువాత ఎక్కువమంది జరుపుకనే వేడుకగా ప్రసిద్ధి పొందింది. ఇది ఆర్థికరంగానికి కొత్తవెలుగును ఇస్తోంది. ఈ ఒక్క పండుగకు అటు బంగారం, ఇటు బాణసంచా మార్కెట్లో కనీసం పదివేల కోట్ల మేరకు వ్యాపారం జరుగుతుంది.
.................

10/22/2016 - 23:07

పూర్వమొకప్పుడు నారదుడు, తుంబురుడి సంగీతాతిశయాన్ని పరీక్షింపదలచి తుంబురుడి ఆశ్రమానికి వెళ్లాడు. తుంబురుడు లోపల నున్నాడు వీణ మాత్రం యివతల వున్నది. నారదుడు, తుంబురుని కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో కాస్త వాయువు ఆ వీణ మీదుగా ప్రసరించి వెళ్లింది. అంతే.. ఆ కాస్త గాలికి వీణాతంత్రులు మ్రోగి, శ్రవణానందంగా సప్త స్వరాలు చెవికి సోకాయి - అంతేకాదు, ఆ సప్త స్వర సుందరులు కంటికి కనిపించారు.

10/15/2016 - 23:33

మార్గశిర మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ప్రాతఃకాలంలో తిరుప్పావై వినిపించేది అప్పుడే. గుళ్లూ, గోపురాలూ, వినూత్నమైన శోభతో అలరారుతూ, పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి.

10/15/2016 - 23:05

1960 ప్రాంతంలో ‘ఆకాశవాణి’లో మన వాణి వినబడడమే మహాభాగ్యంగా, అరుదైన అవకాశంగా ఉండేది. సినిమాల తర్వాత ‘గ్లామర్’ మీడియా అంటే ఎవరైనా ఏకకంఠంగా రేడియో అని చెప్పాల్సిందే. అలాంటి రేడియో ‘లలిత సంగీతం’ కై అనేక గీతాల్ని రచించి రాణించడమే గాక అదే ‘ఆకాశవాణి’లో ప్రవృత్తికి అనుకూలంగా వృత్తిని కూడ ఏర్పరచుకున్న మహాకవులు శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, దాశరథి కృష్ణమాచార్యులు కావడం విశేషం.

Pages