S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

10/29/2016 - 21:23

ఎవరి బుగ్గలు చిదిమి పెట్టారో
ఈ చిట్టి దీపాలు
చిరుగాలికే అల్లల్లాడిపోతున్నాయి
ఎన్ని పాదులు వెదికి తెచ్చారో
ఈ కాకర పూలు
చిన్ని చేతుల్లో కాంతులీనుతున్నాయి
ఎన్ని రవాలణచి కట్టారో
ఈ టపాకాయలు
గాలే పేలి గూబలు పగులుతున్నాయి
ఎన్ని వెలుగులు కూరి చేశారో
ఈ మతాబులు
ముద్దలుగా కాంతి నొలకబోస్తున్నాయి
ఎన్ని చీకట్లు నలిపి కలిపారో

10/29/2016 - 21:20

అతడు దేశాన్ని ప్రేమించాడు
స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని ప్రేమించాడు
విప్లవాన్ని ప్రేమించాడు
ప్రేమను విప్లవీకరించిన విప్లవ ప్రేమికుడై
ఉరికంబానే్న వధువుగా వరించాడు
అతడు సిలువనే పెళ్లాడిన స్పార్టకస్!

10/22/2016 - 23:26

గాఢమైన దిగులు పొరల్లోంచి
ఉత్సాహవంతమైన కిరణమొకటి
అలా నడచి వస్తుంది
మెల్లగా మనసుని తడుముతుంది
అసందర్భంగా జారిపోయిన
క్షణాలను వెనకకు తెస్తుంది
అరచేతుల్లో ఆనందాన్ని
మోసుకొస్తుంది

వికసించే విరి ఆవిరి తెమ్మెరలో
ఉక్కిరిబిక్కిరి కానిదే
పుష్పం పరిమళం వెదజల్లదు

10/22/2016 - 23:24

ఏ చెట్టు అయినా
బోధివృక్షం కావచ్చు
దాని కింద
నిజంగా బుద్ధి వెలిగితే.

మెరుపు మెరిసేది
త్రుటికాలమే కావచ్చు
దాని కోసం
ఎన్ని చీకట్లను మింగిందో!

10/22/2016 - 23:22

యుద్ధం-
అదొక వింత పదార్థం
మనిషి మేధస్సులో సృష్టించిన
వర్తమానపు విలువల్ని
మనిషి చేతనే ధ్వంసం చేయిస్తుంది
మనిషి జీవన రథాన్ని
మరో మనిషి చేత కూలదోయిస్తుంది
విరిగిన అవయవాలు రోదిస్తూ
నెత్తుటి మడుగులో తేలుతుంటే
వినోదంగా తిలకిస్తూ
ఆకలి తీరినట్లు త్రేన్చుతుంది
యుద్ధాలెన్ని చూడలేదు
గత చరిత్ర మిగిల్చినదంతా

10/15/2016 - 21:59

ఓసారి ఓ జానెడు
తీరుబాటు చేసుకోగలవా...
నా ఈ గుప్పెడు మాటల్ని నీ గుండెలోకి
ఒంపాలిగా మరి...
తుఫాను రాతిరి సముద్ర తీరంలా
వేల కిలోమీటర్ల వేగంతో
ఆలోచనలు పరుగెడుతోంటే...
అద్భుతాలు అగాధంలో దాగి
ఒక్కొక్కటిగా బయట పడ్డట్టు
నా మనసు లోతుల్లో
నీ జ్ఞాపకాలు
వరుసలు వరుసలుగా ఉండి
ఒక్కసారిగా తెగిన ముత్యాల హారంలోని

10/15/2016 - 21:56

నేను చేరుకోవాల్సిన గమ్యం ఎప్పటికైనా అదే..
కానీ నా చిన్ని రెక్కల కదలికలు ఈసారి వ్యతిరిక్తంగా ఉన్నాయ్!
నా స్వరం సిద్ధమై పెగలకముందే ‘గ్రీష్మం’ కర్కశంగా తరుముతోంది..
ఇక్కడికి దూరంగా ఎక్కడికైనా ఎగిరిపోవాలి
సమయం కంటే ముందే శిశిరం శిథిలమై పోయి జీవచ్ఛవంలా మారింది
మృతపల్లవులే తప్ప చివురించే ప్రణయ గీతికలు లేవు!
పరవశించి ప్రతిధ్వనించే తొలకరి విరహ వేదనల జాడలేదు!

10/15/2016 - 21:54

వెలుగు వెనె్నలయే మలిసంజెవేళ
పేరు తెలియని రాగంతో పాట
ఎక్కడ మొదలై వస్తుందోగాని
ఇపుడు తడి స్పర్శతో
నన్ను తీగలాగ అల్లుకుని
మునపటి జ్ఞాపకాలతో
మనసును తడిపి ముద్ద చేస్తోంది
ఇదే రాగబంధమో గాని
ఎక్కడో లోయలూ.. శిఖరాలు
నదులూ... నగాలు దాటుకుని
నన్ను వెదుక్కుంటూ వచ్చి
నాకు మాత్రమే తెలిసిన
సంకేత భాషలో సందేశాలను తెస్తుందేమో

10/09/2016 - 23:11

సముద్ర ఘోష
నా గోస
నడి సంద్రంలో
నా జీవన సమరం
సగం జీవితం
సముద్రయానమే
ఆలి తీరంలో
నేను బతుకు తెరువుకై
సంద్రంలో
పడవలో
వలలతో
చేపలకై
వారం పక్షం రోజులో
ఎన్ని రోజులో ఏమో
ఆకలి దప్పిక ఎరుగను
చేపలు ఎన్ని పడితే
అంత ఆనందం నా కళ్లల్లో
నా రాకకై
సూర్యోదయం నుండి
సూర్యాస్తమయం దాకా

10/09/2016 - 23:10

తొలకరి వేళ
చిరుజల్లులు కురిసి
పుడమి కాంత మేనుకు
హాయిని కలిగించాయి!
గ్రీష్మతాపంతో
కమిలిన ధరాసుకుమారి
సుందర రూప లావణ్యం
ఆషాఢ మేఘం పలకరింపునకు
స్వాంతన పొంది
చిరుదరహాసంతో
పులకరించింది!
ఇంకా...
నువ్వు వస్తావనే ఆశ
నా గుండెలోతుల్లో
భద్రంగా దాగి ఉంది!
ఉగాదులెన్నో మారాయి
విరహం వేసవికి
నా హృదయంలో

Pages