S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

12/16/2017 - 20:02

అతిక్రమించే వాళ్లు కొందరు
ఆక్రమించేసే వాళ్లు కొందరు
గద్దల్లా నేలను తన్నుకుపోయే
బడా బాబు‘లుండ’నే ఉన్నారు...
రక్షించే వాళ్ల అండదండలుంటే
భూగోళం మొత్తం గందరగోళం కాదా..
కాంక్రీటు జంగిళ్లలో నివసించేవారికి
పైన ఆకాశం, క్రింద నేలా కనిపించే దారేది
పొరపాట్న సెలవులొస్తే
పిల్లలకు ఆడుకోవడానికి
కారిడార్లు, బాల్కనీలే ప్లేగ్రవుండ్లు

12/16/2017 - 20:01

ఫొటోలో
ఇంకా అందంగా
ఆమె కళ్లలో
మెరుపు
కొత్త చివుళ్లు
చెట్టు నిగనిగ
పిట్టలు వాలాయి
కళకళ

తపాలా డబ్బాలు
తొలగిస్తున్నరు
తోకలేని పిట్టను
తొక్కేస్తున్నరు

మబ్బులు ముసిరినా
చినుకు రాలదు
ఉక్కపోతతో
ఉక్కిరిబిక్కిరి

12/16/2017 - 19:59

ఈ గుండెకి గాలి ఆడటం లేదు
ఎప్పుడూ రక్తానికి బదులు
చెమట వరదల్లో తడిసిన ఈ గుండె
ఇప్పుడు తడారిపోయిన ఎడారిలా కనిపిస్తోంది!!
గడియారంలో బ్యాటరీ అయిపోయి
నిస్సత్తువుగా తిరగనా వద్దా అన్నట్లు
తిరగలేక తిరుగుతున్నట్లుంది!!

12/16/2017 - 19:58

నీళ్లకు పాఠం నేర్పించినట్టు
పార ఆడించి పారాడిస్తున్న పిల్వ కాల్వలో
నదిలా పారుతున్న దారిమళ్లని ఆశ.
ఒంగి ఒంగి మట్టికి దండం పెడుతున్నట్టు
నాటుతున్న నాటు నాటులో
వడ్ల నగల సింగారం.
చిట్టి చెరువులో నానుతూ
నీళ్లని శ్వాసిస్తూ, నారు నారులో
ఎదుగుతున్న పిడికెడు సద్దిమూట.

12/16/2017 - 19:57

కవిత్వం మరమ్మమేమిటో గాని
ఆశ్రయిస్తే చాలు త్రోసిపుచ్చక
చేతులు కలిపి హృదయానికి
అతుక్కుంటున్నట్లుంటుంది.

ఒకసారి ఆ ఎత్తునధిరోహిస్తుంటుంది
మరొకసారి అఖాతాల్లోకి
జాలువారుతున్నట్లుంటుంది
జలచరాలతో జతకూడి ఎదురీదుతున్నట్లుంటుంది

12/16/2017 - 19:55

తిరుగుతున్నాను
తిరుగుతూ...నే ఉన్నాను
నేల నాలుగు చెఱగులా కొలిమలె
ఉడికిపోతున్నది మానవ సమాజం
క్రుళ్లిపోతున్నది మానవ నైజం
నింగినంటినాయి
నేల నుండి ఉవ్వెత్తున ఎగసిన జ్వాలలు.. స్వార్థ కీలలు
వ్యాపిస్తున్నాయి మూలమూలలా
పుచ్చులవలె.. కారుచిచ్చులవలె
అంతర్థానవౌతున్నారు విద్వాంసులు
అంతమే ‘అర్థులై’ దూసుకొస్తున్నారు విధ్వంసులు
ఇంతా చూస్తే..

12/02/2017 - 19:48

నేర్చుకోవాలి నేను
జీవించే విధానం ఎలాగో
ఇంకా నేర్చుకోవాలి..!

జీవితంలో బ్రతకడం
ఎలాగో తెలుసుకోవాలి..!

నన్ను నేను మార్చుకుని
నాలోని నన్ను దానికి
అనుగుణంగా మలచుకోవాలి..!

లోకం పోకడ తెలుసుకుని
ఎలా మసలుకోవాలో
అర్థం చేసుకోవాలి..!

విషయాన్నీ వివరించే
సమర్థనీయత పెంచుకుని
సవాళ్లను ఎదుర్కోవాలి..!

12/02/2017 - 19:47

కడుపు చీల్చుకు పుట్టే పసిగుడ్డు
నాలుగు మెతుకులను మోసుకొచ్చే వాహకం

పేదరికపు సాలీడులో పురుగులై
నెలల చక్రంలో కొట్టుకుపోతుంటారు

బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్లు లేని
దేశంలో కరెన్సీకి వేలాడుతున్న శకలాలు

వేరొకరి వంశాంకురపు కలని మెదళ్లలో కుక్కొని
నిశ్శబ్దంగా బతుకు ఈడుస్తారు

12/02/2017 - 19:46

వేల ఏళ్ల నాటి నా సంస్కృతిలో
బుర్రపెట్టి ఆలోచించింది చాలా తక్కువ
నా నీడను కూడ శత్రువుగా భ్రమసి
పారిపోవడానికి, ప్రాణం తీయడానికి
వెనుకాడని ఒకానొక
పేరు పెట్టని దేహాన్ని.

మంచీ.. మానవత్వం
మనిషికి మనిషి అనే బంధాలకు
మా జన్యు నిఘంటువుల్లో అర్థాలు
ఎప్పటికీ వక్రంగానే ఉంటాయి
అవసరం తీరిపోయాక
ఎవరికి వారే.

12/02/2017 - 19:44

విదేశీ గమనం
మబ్బుల్లో విహారం
కలల సింగిడితో సంచారం
విమానయానం
రాత్రి లేదు, పగలు లేదు
రెండింటిని ముక్కున కరుచుకున్న దూరం
రెండు రెక్కల మధ్య కాలం బందీ
కొండ చిలువ మింగిన ప్రాణుల్లా
తల్లడిల్లడం
పొద్దు గడవడం ఆడపిల్ల సింగారం
ఎదురుచూపులకు గిన్నిస్ రికార్డులు
కళ్లల్లో వత్తులేసుకున్నట్లు
కాలం ముళ్లు ఉరేసుకున్నట్లు

Pages