S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

02/08/2016 - 08:49

అతడు తన భుజాల మీద
పీడిత, తాడిత భూగోళాన్ని మోసినోడు
పగటికి ఒక నేత్రం
రాత్రికి మరొక నేత్రాన్ని నిఘా పెట్టి,
మండే సూర్యుణ్ని
తన దేహంలో ఆవాహనం చేసుకున్నోడు
అలంకారం ఎరుగని - ఇంగిత జ్ఞాన స్వాప్నికుడు
కలహాలతో - చిరుదరహాసంతో చెలిమి చేసినోడు
రాత్రికి గుక్కెడు సారా పోసి భేతాళుడైనోడు
గుండె వేదనల్ని ఆత్మగౌరవ పిడికిలిగా మార్చిన

02/01/2016 - 08:58

జీవితం నాటకానికి చివరి అంకం వృద్ధాప్యం
సుఖదుఃఖాలు జీవన సారాంశాలు
అన్నీ ఉండి అవసరానికి అక్కరకు రానప్పుడు
దగ్గరుండి చేతికి అందనప్పుడు
సంతానం - సంపద తనదై తనది కానప్పుడు
ఒంటరితనం కత్తిలా కోస్తున్నప్పుడు
వృద్ధాప్యం శాపవౌతుంది.
వృద్ధాశ్రమం దిక్కవుతుంది.

01/23/2016 - 18:29

క్షణం మరిచా
అలల్తో ఆడుకుంటూ-
తల్లి మరణం
అంధభిక్షుకి-
రెండుసార్లు తడిమి
చిల్లరిస్తోంది.

చలి సాయంత్రం-
ఇంటి తాళం ముందు
దిగాలు కుక్క

మహా విగ్రహం
అరచేతి సందుల్లో
బల్లి గుడ్లు

కాసేపు ఆట..
కాసేపు భిక్షాటన..
వీధి బాలురు
చలిగాలులు
పొత్తిళ్ల బిడ్డ చెవుల్ని
మూస్తోంది తల్లి

01/14/2016 - 17:49

పెదవులపై చిరునవ్వును పూసుకొని
పలుకరించి ఆత్మీయతను అభినయిస్తారు
మనం ఇచ్చే ఆతిథ్యపు తేనీటిని
సేవిస్తూ ఉపరాగ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు
వారి కవితా వదూటిపై
మనం ప్రశంసాపూర్వక జల్లు కురిపిస్తాం
మన అభినందనకు ఉబ్బితబ్బిబ్బై
వొకింత గుర్వోన్మత్తులౌతారు
అహం ఆవహించి ఆకాశం దాకా పయనిస్తారు
అప్పుడప్పుడూ వారి ఆర్థిక సమస్యల పరిష్కారానికి

01/09/2016 - 17:23

కొన్నిసార్లు నిన్ను నువ్వు తవ్వుకోవటం కూడా మంచిదే
జారిపడ్డ కన్నీళ్లని, తుడుచుకుపోయిన జ్ఞాపకాలని
మోసుకు తిరగకుండా అక్కడికక్కడే వొదిలేసేయవచ్చు

చాలాసార్లు నీకు తెలియకుండానే నీలోని ఆత్మతో సంభాషిస్తావు
వౌనంగా నీలో వెలితిని పూడ్చుకోవటానికో
లేదు మరో మొక్కగా మారి అస్తిత్వాన్ని నిలబెట్టుకోడానికో

01/02/2016 - 17:38

ఉలిదెబ్బలతో
దేహం దుమ్ము కొట్టుకపోతున్నా
కండరాలను కరిగించి
బండరాళ్లకు జీవం పోసి
అందమైన ఆకృతులుగా మలిచే
అమరశిల్పి జక్కన్నలు వారు
శిల్పారామము
అమరశిల్పి జక్కన్నలు వారు
శిల్పారామము
సుత్తి ఉలి శబ్దాలతో
సవ్వడి చేస్తుంటే
రాళ్లు వెన్నలా కరిగి
సుందర నాట్య భంగిమలుగా
నర్తిస్తాయి
వారి నిర్మలమైన నవ్వే

12/26/2015 - 23:27

అనాదిగా అందరిలో ఉంటూ
మంచివారిని మట్టుబెట్టేందుకు
పచ్చని పంటకు పట్టిన చీడలా
కడుపు నిండా కషాయం నింపుకొని
మెదడు నిండా దుర్బుద్ధి పెట్టుకొని
కరడు గట్టిన ఆలోచనలతో
కఠిన హృదయంతో
అబద్ధాలూ మాయలు వొలకబోస్తూ
నేరాల్లో మెలకువలు నేర్చుకొని
ఒళ్లంతా విషభరితమై
ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ
బాధించి ఆనందపడుతూ
నిరంతర అవకాశవాదులై

12/19/2015 - 18:21

చీకట్లో ఆకాశం
చుక్క చామంతులు పూసిన తోటవుతుంది
రాత్రంతా
వెనె్నల వనమాలి గస్తీ తిరుగుతూ వుండగా
కొబ్బరాకొకటి
సిరాబుడ్డీలో నానుతున్న పక్షి ఈకలా
గాలి వాక్యాలు పైకెగదోస్తున్నట్టు
అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది
నైటు డ్యూటీ లోయ తలుపులు తెరచి చూస్తానా!
దృశ్యం మారిపోతుంది.

12/12/2015 - 18:15

ఎన్ని కాలాలు
అలలు అలలుగా నడచి వచ్చినా
నాలో వట వృక్షంలా నిలిచిన నా ఊరు
విజ్ఞానాన్ని బుర్రలోకి వొంపుకుంటూ
ఎన్ని దూరాలు
జీవిత సందర్భాలుగా మారినా
కాస్తంత సమయం దొరికితే చాలు
నా పైరు నా పల్లె
రెప్పల మీద పిట్టల్లా వాలుతూనే ఉంటాయి
నా పల్లెలో
వలస పక్షుల్ని చూస్తున్నాను
తడారిన గుండెల్లో
పగిలిన బీడు భూముల్లో

12/05/2015 - 17:56

జ్ఞాపకాల ఇంద్రధనస్సును
వేలాడదీశాను
రంగురంగును విడదీసి
అనుభవాల్ని అద్దుతున్నాను

సర్కారు దవాఖానా నిర్లక్ష్యానికి
వరండాలో అమ్మ ప్రసవం
నాటి నా పుట్టుక విషాదం
నేటి నా జ్ఞాపకం!

ఎంతెంత దూరం
బారబార దూరమంటూ
బడిలో రెండు బారల దూరంలో
నా అంటరానితనం
దూరంగా కూర్చున్న జ్ఞాపకం!

Pages