S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

11/06/2017 - 23:29

రెండవ ప్రపంచ యుద్ధం మిగిల్చిన ప్రేతాత్మలన్నీ యింకా
రణ భూమిలోని ఎండిన మోడుల మీద వ్రేలాడుతూనే ఉన్నాయి
హిరోషిమా నాగసాకీల మారణహోమాల జ్ఞాపకాలు
చరిత్ర పాఠాల నుంచి ఇంకా చెరిగిపోనే లేదు
అగ్రరాజ్యపు అహంకారానికి అట్టుడికిన అణువంత దేశాలు
అణ్వాయుధాలకు టోకున చేసిన అనికి కాలుదువ్వుతున్నాయి
ప్రకృతి ప్రకోపాల సునామీలను, హరికేన్‌లను, టోర్నడోలతో

11/06/2017 - 23:28

నిదురలోతుల్లో
నిండా మునిగిన నేను
అలారం అలికిడికి
చద్దరులోంచి గబగబా
శరీరాన్ని తోడుకొని..
జీవిత ధీమాకు
భస్ర్తీకా ప్రాణాయామము
ఖేల్ కూద్ - ఒంటిపై
స్వేద పుష్పాలను పూయించి
వేపపుల్ల రూపాంతరముగా
నోటిని పుక్కిలించి
పొగలు సెగలు కక్కుతున్న
జెమినీ టీ తాగి
ఏనుగంత బలం..
గీసర్ వేడి ధాటికి కుదేలై

11/06/2017 - 23:27

ఓడిపోవటం, గెల్వటం సంగతేముంది
యుద్ధరంగమే లేనపుడు
జనాన్ని శత్రువు తరుముతున్న మాట నిజం
పొలాలు ఇల్లు విడిచి పారిపోతున్న మాట నిజం
కాళ్లు నిల్చిన స్థలంలో కూడా
కాంతిలేని జీవితం జనానిది
కష్టం మొలకెత్తిన పొలాలలో కూడా
శాంతి లేని జీవనం జనానిది
ఎవరు నిలిపారో
జనం గుండెల మీద అమావాస్య నిలిపారు
ఎవరు శత్రువు
రాత్రి దీపాన్ని ఆర్పేస్తున్నారు

11/06/2017 - 23:25

పద్యం రాస్తున్నాను
సముద్రం చూస్తూ ఉంది
స్ర్తిలింగం పుంలింగం ధరించిన జలధి
ఒకరికి తండ్రి సముద్రుడు
ఒకరికి తల్లి సముద్రం!
ఉధృతమై అలలు ముందుకురుకుతుంటే
ప్రమాదాన్ని పసిగట్టి సముద్రుడు
ముక్కుతాడేసి లాగుతుంటాడు
అలల్లో చిక్కిన మానవుడు
అసువులు బాసినపుడు
అలలెంతగా కన్నీరు విరజిమ్ముతాయో
వీక్షకులు ప్రత్యక్ష సాక్షులు

11/06/2017 - 23:23

కూల్చేవానికి నిర్మించటమూ తెల్సు
నిర్మాణానికి రాళ్లెత్తుతున్నా
ఆధిపత్యాన్ని కూల్చే
అస్తిత్వానికి ప్రశ్నలు ప్రాణాలు

ఉసిళ్లపుట్టల్లా ఎగిసా
తేనేటీగల్లా తరిమా
దోసిలిపట్టిన నీళ్లల్లో ముఖమే కాదు
నా గత గాయాలు, భవిష్య దర్శనాలు

ప్రతి అడుగు గెలుపు కాదు
ఒక అడుగు గెలిచింది
రెండో గెలుపునకు అడుగులు పడాలి
నా నేల విముక్తికి రహదారి

11/06/2017 - 23:22

పార్టీ పెట్టడమంటే
గైండ్ల పోరగాండ్ల గోలీలాట కాదు
ఉద్యమమంటే
గోరుముద్దలు తినటం కాదు
తినిపించటం అంతకంటే కాదు
పార్టీ పెట్టడమంటే
పండుగ చేసుకోవటం కాదు
కొత్త బట్టలు తొడుక్కోవటం అంతకంటే కాదు
పార్టీ పెట్టడమంటే
భావాగ్నిలో పెయ్యంతా ఉడికిపోవాలి
కొత్తకొత్త ఆలోచనలతో మస్తిష్కం వేడెక్కాలే
మనిషి లోపల రక్తం వాగులై ఉరకలెత్తాలి

10/28/2017 - 18:36

పరిశ్రమల విల్లుల నుండి వదిలిన
కాలుష్య శరములు అదుపు చేయలేక
వాయు దేవుడు అలసిపోయిన నాడు
జీవుల శ్వాసలు చావుకేకలు వేస్తాయి

రసాయనాలతో ఆహారాన్ని కల్తీ చేసి
అమ్మి సొమ్ము చేసుకొని మురిసిన నాడు
రోగాలు చుట్టుముట్టి బక్కచిక్కిన మనుషుల
మరణ మృదంగం నలుదిక్కులా వినిపిస్తుంద

10/28/2017 - 18:34

దోచుకోవటం - దాచుకోవటం..
ఈ నవ నాగరిక మేధో వికాసమోయ్...
దీనికి - ఈ కులమేంటి ఆ కులమేంటి?
సూటు బూటుల్లో తళతళ మెరిసే దళిత దొరా...

10/28/2017 - 18:32

బ్రతకాలంటె శ్వాసించాలి
శ్వాసించాలంటె కావాలి గాలి
గాలి బ్రతుకులు మనవి
గాలికి లేదు స్ర్తి పురుష భేదం
గాలి లేకుంటె లేదు జీవం

పుట్టేటప్పుడు కావాలి గాలి
పోయెటప్పుడు పోయేది గాలి
ప్రాణం కలిసేది గాలిలో
దేహం కలిసే మట్టిలో

గాలి మన ప్రాణం
గాలి మన గానం
గాలి మన నాదం
గాలి విలువ తెలుసుకో
గాలి దేవుడని తెలుసుకో.

10/28/2017 - 18:30

సివంగి పరిగెత్తుతోంది
సత్తువంతా కూడదీసుకుని లేడిపిల్ల కూడా పడుతూ లేస్తూ
రొప్పుతూ శరీరం గీరి రక్తం కారుతూ
ప్రాణ భయం తెగింపునీ బలాన్నీ పెంచుతోంది
బ్రతకడానికే అయినా ఆ వేట ఓ ఆట సివంగికి
ఆట ముగింపుకొచ్చింది లేడిపిల్ల ఓడింది
అబలత్త్వం సబలత్త్వం ముందు మెడ వంచింది
మెత్తని మెడ కండరాలు గట్టి దంతాల కొక్కీకి తగిలించబడి
వేళ్లాడుతూ నెత్తురోడుతూ

Pages