S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

10/20/2017 - 22:56

పిల్లలిద్దరూ
ఎంత హుషారుగా ఉన్నారో
కానె్వంట్లో చదువుతున్నా
మమీని ‘అమ్మ’ అంటున్నందుకు.

పిచ్చుకలు
సందడి సందడిగా
కల తిరుగుతున్నాయి
‘సెల్’ టవర్ లేదక్కడ.

బజారంతా
ఒహటే బేజారెత్తుతోంది
వర్తకులు పాపం
‘ఎమ్మార్పీ’ రేటుకే అమ్ముతున్నారు.

10/20/2017 - 22:55

ఎవరికీ అక్కరలేదు
జాలి, దయా కానరాదు
పో.. పొమ్మంటోంది లోకం
తీరిపోయిందిగా అవసరం

అరవై ఏళ్ల మా కష్టార్జితాన్ని
అప్పనంగా అనుభవించి
ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు
ఏమిటో ఈ చీత్కారం

జీవన పోరాటంలో
ఎన్నో ఒడిదుడుకులు
తట్టుకుని నిలిచాం

వీరసైనికుల్లా సాగాం

10/20/2017 - 22:53

అంకిత భావంతో
అడుగు తీసి అడుగేయలేని
బలహీనులు బలోపేతం కావాలి
స్వార్థ సంకుచితత్వాలతో
చినిగిపోతున్న కాగితపు గుండెలు
విశాల హృదయ కమలాలై
మన బ్రతుకుల్లో సౌరభాలను
ఆశ్చర్యానందాల కలబోతగా
అంతటా వెదజల్లగల్గాలి
అహింసా సిద్ధాంతాన్ని గూర్చి
అరక్షణమైనా ఆలోచించగల్గాలి
త్యాగఫలాలను తనివితీరా
ఆస్వాదించే దిశలో మన పయనం

10/20/2017 - 22:53

ఎవరెంత వారయినా
నిజానికి నీ అంత వాళ్లెవరూ లేరు
అలసి సొలసి కనురెప్పలు మూసినా
కలల ఒడిలో హాయిగా నిదరోయినా
ఆలోచనల అలజడులు చెలరేగినా
భావాంబర వీధులలో పయనించినా
అంతా నీ మహిమే సుమా!
సర్వకాల సర్వావస్థలలో
అందరినీ చైతన్యవంతం చేసే
నిన్ను గమనిస్తుంటే
నింగిలో నిర్విరామంగా
విధులు నిర్వహించే సూర్యచంద్రులు

10/07/2017 - 23:09

వానాకాలం పిల్లలంతా
సంతోషం పండుగవుతారు

మబ్బులు కమ్మినప్పుడల్లా
వర్షం తేనెపట్టు కోసం
ఆకాశం చెట్టు వంక చూస్తారు

ఉరుములు మెరుపులు ఊరిస్తోంటే
చినుకుపూల స్పర్శ కోసం
చిగురాకు దోసిళ్లవుతుంటారు

వర్షంలో తడువచ్చనీ..
ఇంటి పక్క నీటి గుంటల్లో
కాగితప్పడవలేసి ఆడొచ్చనీ...
వాళ్లకు ఊహలు పుట్టుకొస్తాయి

10/07/2017 - 23:08

ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి పిలిచి
తాను తింటున్న అన్నంలో
ఇంత ముద్ద పెట్టి
ఆత్మీయతను పంచినవాడు
అతడు మనిషి
శోకంతో కన్నీరు విడుస్తున్న వాని దరిజేరి
నీకు అండగా నేనున్నానని పలికి
ఆత్మబంధువుగా కన్నీరు తుడిచేవాడు
అతడు మనిషి
నడిరోడ్డుపైన నడవలేని
వికలాంగుని చేయి పట్టుకుని
నాన్నా! నిన్ను అవతలికి దాటిస్తానని

10/07/2017 - 23:07

ఎటు చూసినా
మారని వయ్యారం
కనె్నపిల్ల కులుకు
తల్లికి ధరణికి
ఏ బిడ్డయినా
ఏ విత్తయినా ఒకటే

ప్రతి మనిషికి
చివరికి మిగిలే ఆస్తి
అస్తికలు

నా ఓటు
ఎవరేసుంటారు?
రాకీ గంధర్వులు

అందమైన
అవయవ లోపం
బుగ్గసొట్ట

ఈ కోర్టులో
విజయం సాధిస్తే
కోట్లు టెన్నీస్

10/07/2017 - 23:05

నీతిగల ప్రభుత్వాలు
కావాలనుంటే
నీతిగల ప్రజలు కావాలి!

వైద్యులు, న్యాయవాదులు
అహర్నిశలు
దేశం కోసం పరిశ్రమించాలి!

నాయకులు ప్రజల్ని
సొంత బిడ్డల్లా
చూసుకోవాలి!

వాతావరణ
పరిశుభ్రత కోసం
ప్రతివాడూ ఆలోచించాలి!

నేలతల్లిని
సొంత తల్లిని
గౌరవించాలి!

ఉపాధ్యాయుడిని
రాష్టప్రతిలా
చూసుకోవాలి!

10/07/2017 - 23:04

ఓ.. కవీ..! ఏమిటీ వైనం..
నీవు వ్రాసినదాన్ని.. నీవు మాత్రమే
ఆస్వాదించి.. ఆనందించాలనుకుంటే
పదిమందిలోకీ.. పంపటం దేనికి..?!
నీ గొప్పను చాటుకునేందుకా..!

ఏం రాసావో.. ఎందుకు రాసావో..
బోధపడని అయోమయంలో
పాఠకుడ్ని పడేసి.. గొప్పకవి ననుకుని
మురిసిపోవటం భావ్యమా...

10/07/2017 - 23:02

ఒకరు గుడికి
మరొకరు మసీదుకి
వేరొకరు చర్చికి
ఇంకొకరు గురుద్వార్‌కి
జననం నుంచి మరణంలోగా
ఏదో ఒక సందర్భంలోనో
ఒకానొక సమయంలోనో
తమతమ ఆలయాల చుట్టూ ప్రతి ఒక్కరూ తిరిగేవారే..!
ఏమీ తెలియని పసితనంలోనో
తెలిసీ తెలియని బాల్యంలోనో
అన్నీ తెలుసుననుకునే యవ్వనంలోనో
తెలుసేమో! అనుకునే సందిగ్ధపు వృద్ధాప్యంలోనో
తమతమ మతాలకి సంబంధించిన ఆలయాల్ని

Pages