S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

01/05/2020 - 23:57

సైన్సు, లెక్కలు అంటే ఇష్టం వుండే విద్యార్థులు కొంతమంది వుంటే అవి ఇష్టపడని వ్యక్తులు మరెందరో వుంటారు.
ఆ రెండవ కేటగిరీకి చెందిన వ్యక్తిని నేను. అయినా లెక్కల సబ్జెక్టుని పదవ క్లాసు వరకు, సైన్సుని డిగ్రీ వరకు కష్టంగా చదివాను. సైన్సు నాకిష్టం లేదని చెప్పే స్వాతంత్య్రం లేని కాలం అది.
డిగ్రీ తరువాత స్వేచ్ఛ వచ్చింది. ‘లా’కి మారిపోయాను. ఇష్టంగా చదివాను.

12/29/2019 - 23:57

హైదరాబాద్‌లో సంవత్సరానికి ఒకసారి జరిపే పుస్తక ప్రదర్శన వచ్చేసింది. పుస్తకాలు ఇష్టపడే వ్యక్తులకి డిసెంబర్ చివరి వారం ఓ పండుగలా అన్పిస్తుంది. చాలా పుస్తకాలని, పుస్తకాల షాపులని ఒక్క దగ్గర చూసే అవకాశం దీనివల్ల లభిస్తుంది. ఇలాంటి ప్రదర్శనని మిగతా నగరాల్లో కూడా జరుపుతున్నారు. అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా జరిపితే బాగుంటుందేమో. ఎందుకంటే పుస్తకాలు కొనని వ్యక్తులు కూడా ఈ ప్రదర్శనకు వస్తారు.

12/23/2019 - 23:40

1995 సంవత్సరంలో తిరిగి హైదరాబాద్‌కి బదిలీ అయి వచ్చినప్పుడు, ఓ రోజు మా కజిన్ మహేశ్ మా ప్లాట్‌కి వచ్చాడు. వాడి నడుముకి వున్న బెల్ట్‌కి ఓ దీర్ఘ చతురస్రంలో ఓ పరికరం కన్పించింది. కాస్సేపు మాట్లాడిన తరువాత ఏదో శబ్దం వచ్చింది. అది ఆ పరికరాన్ని తీసి అందులోని నెంబర్‌ని నోట్ చేసుకొని ఆ నెంబర్‌కి మా ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తరువాత దాని గురించి తెలుసుకున్నాను. అది పేజర్.

12/14/2019 - 23:49

ఉదయానే్న నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని వాకింగ్‌కి వెళ్లడం చాలా మందికి అలవాటు. నేనూ అంతే! ఆరోగ్యానికి మంచిదని చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా శ్రమతో కూడుకున్నది కాదు. సులభంగా రోజూ చేస్తున్న వ్యాయామం.
ఇలాంటి వ్యాయామం మన శరీరానికే కాదు, శరీరంలోని చాలా అవయవాలకి అవసరమే. అవయవాల కన్నా మన మనస్సుకి మరీ ముఖ్యం. ఇది కష్టసాధ్యమేమీ కాదు. సులభమైన ప్రక్రియ.

12/10/2019 - 23:16

భగవంతుడిని అందరూ పూజిస్తారు. ప్రార్థిస్తారు. కోరికలు కోరతారు. బాధ కలిగినప్పుడు నిందిస్తారు కూడా. ఇది సహజం. దేవుణ్ణి ఎలా పూజించాలి? దేవుడిని ఏ విధంగా సంతోషపరచాలి అన్న సందేహం ఆలోచన అందరిలో వుంటాయి.
పాల్ కొహలో ఈ విషయం గురించి ఓ కథ రాశాడు. ఆ కథ పేరు ‘నోవీస్ కథ’
ఆ కథలోని పాత్ర ఓసారి అబ్బట్ మకారిస్ దగ్గరికి వెళ్లి దేవుణ్ణి ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో చెప్పమని అడుగుతాడు.

11/30/2019 - 23:01

ఈ మధ్య ఇంట్లో పుస్తకాలు సర్దుతుంటే ఓ పాత నోట్‌బుక్ కన్పించింది. 1974వ సం.లో వివిధ పత్రికల్లో వస్తున్న పజిల్స్‌ని ముఖ్య విషయాలని రాసుకున్న పుస్తకం అది. నేను రాసుకున్న చేతివ్రాత, చిన్నచిన్న బొమ్మలు చూస్తూ అలాగే ఎక్కడికో వెళ్లిపోయాను.

11/23/2019 - 23:15

ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు ఫోన్ చేసి ‘మీకు మన ఆర్టిస్టులు ఎవరైనా ఫోన్ చేశారా?’ అని అడిగారు. ‘చేయలేదు. ఎందుకని?’ అడిగాను.
‘న్యాలపల్లి రాజేశ్వర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతని పార్ధీవ శరీరాన్ని వాళ్ల ఊరు తీసుకొని వెళ్తున్నారు’ చెప్పారు.

11/16/2019 - 23:00

కొన్ని పెట్టుబడుల విలువ మనకు తెలియదు. దాన్ని పెట్టుబడిగా చాలామంది భావించరు. దాన్ని ఖర్చుగా చాలామంది భావిస్తారు. మరి కొంతమంది వృథా ఖర్చుగా భావిస్తారు.
అలాంటిది పుస్తకాలు కొనడం.
మనం కొన్న పుస్తకాలు పెట్టుబడిగా మారాలంటే మంచి పుస్తకాలు కొనాలి. కొనడమే కాదు. వాటిని చదవడం
చదవడం వల్ల మన జీవనశైలి మారే అవకాశం వుంది. మనకు కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం వుంది.

11/09/2019 - 18:23

ఉదయం నిద్ర లేవాలని చాలా మంది అనుకుంటారు. కానీ నిద్ర లేవరు. గతంలో అలారమ్ గడియారాలు వుండేవి. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత చాలా వస్తువులు మూలన పడ్డాయి. అది రేడియో కావొచ్చు. టేప్‌రికార్డర్ కావొచ్చు. వీడియో రికార్డర్ కావొచ్చు. ఇలా ఎన్నో.. అందులో అలారమ్ పీస్ కూడా.

11/02/2019 - 19:22

మనకు తెలియకుండా అన్నీ లభిస్తున్నప్పుడు వాటి విలువ మనకు తెలియదు.
ఈ మధ్య నాకు తీవ్రమైన గొంతు నొప్పి వచ్చింది. గొంతు తరచూ బాధ పెడుతోంది. గొంతు బాగా వుందని అనుకొని చల్లటి నీళ్లు త్రాగడమో, గొంతుకు పడని పళ్లని తినడమో జరుగుతుంది. అంతే!
ఓ వారం రోజులు గొంతు బాధిస్తుంది. మందులు, మాకులూ పడిన తరువాత మామూలు స్థితికి చేరుకుంటుంది.
ఓ కవి మిత్రుడు గొంతు గురించి ఇలా కవిత చెబుతాడు.

Pages