S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఓ చిన్నమాట!
నేను రాసిన కథలని, కవిత్వాన్ని పుస్తక రూపంలో ప్రచురించాలని అనుకున్నాను. అది ఏప్రిల్ నెలలోగా ప్రచురించాలని కూడా నిర్దేశించుకున్నాను. కానీ అది సఫలం కాలేదు. అగస్టు నెల కూడా వచ్చేసింది. ఒకరిద్దరు మిత్రులు ఆ విషయం గుర్తు చేశారు. మా ఆవిడ కూడా గుర్తు చేసింది. వాళ్లకి ఎన్నో కారణాలు చెప్పాను.
ప్రపంచం అంతటా ఇప్పుడు యోగామంత్రం వినిపిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్య రక్షణకు యోగా అద్భుతంగా పనిచేస్తోందని ఇప్పుడంతా విశ్వసిస్తున్నారు. అయితే అమెరికాలో ఇప్పుడు ఈ యోగా శిక్షణకు సరికొత్త హంగులు జోడిస్తున్నారు. నైజిరియాకు చెందిన డ్వార్ఫ్‌గోట్స్ అతి చిన్నగా, ముద్దుగా ఉంటాయి. యోగా శిక్షణ ఇచ్చే చోట వాటిని వదులుతున్నారు. యోగాచేస్తున్నవారి వీపులపై అవి ఎక్కి సందడి చేస్తున్నాయి.
మాఇంట్లో గోడలకి ఫొటోఫ్రేమ్‌లు ఎక్కువగా వుండేవి. వాటి వెనక పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేవి. వాటి నుంచి అప్పుడప్పుడు వాటి గ్రుడ్లు క్రిందపడి పగిలిపోయేవి. ఒక్కోసారి పక్షి పిల్లలు కూడా క్రింద పడేవి. తల్లి పిచ్చుక వాటి చుట్టూ తిరిగి వాటిని తిరిగి పైకి తీసుకొని వెళ్లేవి. కొంత పెద్దగా అయిన పక్షులు కూడా క్రిందపడేవి. అవి పైకి ఎగరడానికి ప్రయత్నం చేసేవి. ఎవరైనా కొంత సహాయం చేస్తే పైకి ఎగిరిపోయేవి.
ఈమధ్య కొంత ఆందోళనగా ఉంది. సకాలంలో జరగాల్సిన పనులు సకాలంలో జరుగకపోవడం నా ఆందోళనకి ప్రధాన కారణం. మా కుటుంబంలో జరిగిన అకాల మరణాలు మా ఆవిడకి వచ్చిన చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా నా ఆందోళనకి కారణమైనాయి.
అరవై సంవత్సరాలు వయస్సులో అంతుపట్టని అనారోగ్య సమస్యతో మా గుణక్క చనిపోయింది.
కేన్సర్‌ని ఆలస్యంగా గుర్తించడం వల్ల మా ప్రమీల వదిన తీవ్రమైన అనారోగ్యంతో చనిపోయింది.
పెద్దపెద్ద లక్ష్యాలు నిర్దేశిస్తే ప్రయాణం కొనసాగదు. మనకు కన్పించే, మనం అందుకునే అవకాశం వున్న లక్ష్యాలు నిర్దేశించుకుంటే మనం ఆ పనిని సాధించుకునే అవకాశం ఉంటుంది.
అడవిలో ఓ మహావృక్షం విరిగి పడిపోయింది. అప్పుడు విపరీతమైన శబ్దం వచ్చింది. అయితే చుట్టుపక్కల ఎవరూ లేరు. కనీసం జంతువులు కూడా లేవు. మరి అది పడిపోయినప్పుడు శబ్దం వచ్చినట్టా? రానట్టా? ఈ విషయాన్ని పూర్వకాలంలో తత్త్వవేత్తలు ఎక్కువగా చెప్పేవారు.
ఈ విషయం పూర్వకాలం కన్నా ఇప్పుడే ఎక్కువగా అవసరం అన్పిస్తుంది. చాలా సంఘటనలని మనం నిశితంగా గమనించినప్పుడు ఈ విషయం బోధపడుతుంది.
ప్రతి సంఘటనలోనూ రెండు రకాలైన అంశాలు ఉంటాయి. అందులో ఆశావహ కోణం ఉంటుంది. వ్యతిరేక భావన కోణం ఉంటుంది. మనలో చాలామంది ఆశావహ కోణంకన్నా వ్యతిరేక భావనని ఎక్కువగా గ్రహిస్తారు.
కుక్కల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో నేర్చుకోకూడనివి కూడా అనే్న ఉన్నాయి.
చిన్నప్పుడు మా ఇంట్లో ఓ చిన్న కుక్క ఉండేది. దానితో ఆడుకోవడం గొప్ప సరదాగా ఉండేది. దాని మెడకు ఓ గొలుసు వేసి ఎప్పుడన్నా దాన్ని బయటకు తీసుకొని వెళ్లేవాళ్లం. ఓ రోజు మా మేనమామతో కలిసి మా పెంపుడు కుక్కని తీసుకొని బయటకు వెళ్లాను.
వాట్సప్‌లు వచ్చిన తరువాత చాలా సౌకర్యాలు పెరిగాయి. మాట్లాడుకోవచ్చు. అదే విధంగా చూస్తూ మాట్లాడుకోవచ్చు. వీడియోలు పంపుకోవచ్చు. ఫొటోలు సరేసరి! అలా త్వగరా ప్రపంచవ్యాప్తంగా స్నేహితులతో, పిల్లలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవచ్చు. బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లో ఒకే ఒక్కసారి బటన్ నొక్కి వందల మందికి సమాచారాన్ని పంపించుకునేందుకు వీలవుతుంది.
చదరంగం ఆటని జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు మనకి బోధపడతాయి. సైనికుడు (పాన్) ఎప్పుడూ ముందు అడుగు వేస్తాడు. అతనికి వెనక అడుగు వేసే అవకాశం లేదు. ‘రాజు’ ఒక్క అడుగు మాత్రమే వేస్తాడు. అన్ని వైపులా అడుగు వేసే అవకాశం ఉంటుంది. వెనక్కి కూడా అడుగు వేయవచ్చు. కానీ ఎప్పుడూ రక్షణలో ఉంటాడు. ఒక్క గుర్రం మాదిరిగా తప్ప, మంత్రి అందరిలా నడుస్తాడు.