S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

09/24/2016 - 22:16

పిల్లలు చదువు మీద దృష్టి కేంద్రీకరించకుండా మిగతా వాటి మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు వాళ్లని పెద్దవాళ్లు నిరుత్సాహపరుస్తూంటారు. అందులో తప్పు కన్పించదు. పెద్దవాళ్ల ఉద్దేశం మంచిదే. చదువుకొని వృద్ధిలోకి రావాలన్నది పెద్దవాళ్ల కోరిక.

09/18/2016 - 22:01

సంస్థల్లో పని చేయడం వేరు. ఏదో ఒక ఆఫీసులో పని చేయడం వేరు. సంస్థల్లో పని చేసినప్పుడు ఉద్యోగిగా పని చేయడం వేరు. ఆ సంస్థకి ‘హెడ్’గా పని చేయడం వేరు. ప్రధానమైన వ్యక్తిగా పని చేస్తున్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉంటుంది. తన కొలీగ్స్‌ని తన కింద పని చేస్తున్న ఉద్యోగులని కలుపుకొని పని చేయాల్సి ఉంటుంది. అట్లా చేయనప్పుడు సరైన ఫలితాలు రావు.

09/11/2016 - 01:06

నా బెడ్‌రూంలోని గోడకి నా పెళ్లినాటి ఫొటో ఒకటి వ్రేలాడుతుంటుంది. అది పెళ్లికి రెండు రోజుల ముందు మా పెద్దింటికి వంటింటికి మధ్యన మెట్ల మీద కూర్చున్న నా చేతికి మైదాకు (గోరింటాకు) పెడ్తున్న దృశ్యం. ఆ ఫొటోలో దాదాపు ముప్పై మంది ఉంటారు. నలుగురు అక్కలు, నలుగురు స్నేహితులు, అక్కల పిల్లలు, అన్నల పిల్లలు. చాలా అరుదైన ఫొటో. అది నలుపు తెలుపు చిత్రం.

09/03/2016 - 21:11

ఆ మధ్య ఓ కథ రాశాను. బీచుపల్లి దగ్గర బస్సు ప్రమాదం గురించిన కథ అది. కర్నూలుకి వెళ్తున్న బస్సు కృష్ణానదిలో పడి బస్సులోని ప్రయాణీకులందరూ చనిపోతారు.

08/27/2016 - 22:35

ఇంట్లో ఎవరైనా పొరపాటు చేసినప్పుడు పెద్దవాళ్లు కోప్పడతారు. అదే విధంగా ఏదైనా గొడవ జరిగితే ఇంట్లో వాతావరణం వేడెక్కిపోతుంది. ఇలాంటి సమయాల్లో ఇల్లు వౌనం దాలుస్తుంది. అందరి మూడ్ కూడా అదోలా ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో ఆ ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, ఆ ఇంటిలోని వ్యక్తి ఇంటిలోకి బయట నుంచి వచ్చినా ఆ విషయం తెలియకుండానే గమనిస్తాడు. అంటే ధ్వని తరంగాలు ఆ పరిస్థితిని తెలియజేస్తాయి.

08/20/2016 - 21:11

అనారోగ్యంగా వున్న వ్యక్తులని కలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మనస్సు బాధగా ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులని కలవడం చాలా తగ్గించాను. కానీ వాళ్లను కలవడం లేదన్న బాధ ఎక్కువగా ఉండేది.

08/12/2016 - 22:13

జీవితం ఓ ప్రయాణం లాంటిది. ఎన్నో సందేహాలు భయాలు కలుగుతూనే ఉంటాయి. కూతురుకి వివాహం చేసినప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉంటారో అంతే ఆందోళనగా ఉంటారు. ఆ కూతురు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కొత్త వాళ్లతో కొత్త ప్రదేశంలో ఎలా వుండాలోనన్న ఆలోచనలు ఆమెను వెంటాడుతాయి.

08/06/2016 - 21:38

మా పూజారి పేరు బుచ్చి కిష్టయ్య. ఆయనకు ఓ అక్క ఉండేది. ఆమె పేరు కాశమ్మ. ఆమె భర్త చనిపోయాడు. అప్పటికి ఆమె వయస్సు 50 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆమె పిల్లలు పెద్దవాళ్లైపోయారు. ఆమె వాళ్ల పిల్లల దగ్గర ఉండకుండా మా ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో వున్న ఓ రామాలయంలో ఉండేది. అప్పుడప్పుడు మా ఇంటికి, పక్క ఊళ్లో ఉన్న మా పెద్దమ్మ ఇంటికి వచ్చేది. వచ్చినప్పుడు మాత్రం మా దగ్గర ఓ వారం రోజులు ఉండేది.

07/30/2016 - 21:59

అనుకున్న పనులు జరుగకపోతే విరక్తిగా ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నట్టు వెలితిగా ఉంటుంది. ఇలాంటి స్థితి వున్నప్పుడు అలా బయటకు రావడం నా అలవాటు. కాస్సేపు రోడ్డు మీద అటూ ఇటూ నడిచి దగ్గర్లో వున్న సూపర్ మార్కెట్‌కి వెళ్తుంటే అక్కడ వున్న బిచ్చగాడు ధర్మం చేయమని విసిగించాడు. అసలే మూడ్ బాగాలేదు. అందులో బిచ్చగాడి విసుగు. అతన్ని కసురుకొని సూపర్ మార్కెట్‌కి వెళ్లాను.

07/23/2016 - 22:46

నేను హైదరాబాద్‌లో పని చేసిన తరువాత తిరుపతికి బదిలీ అయ్యింది. తిరుపతి మేజిస్ట్రేట్‌గా పని చేయాలని చాలామంది ఉత్సాహపడతారు. కానీ అలాంటి ఉత్సాహం కలుగలేదు. కారణాలు అనేకం. అక్కడ వుండే ప్రొటోకాలు పనులు. అందులో ముఖ్యమైనది. వారం రోజుల్లో ఒక్కరోజు కొండ పైన కోర్టు నిర్వహించాలి. ఆ రోజు మాత్రం ఉత్సాహంగా ఉండేది. కొండపైకి వెళ్తుంటే ఉండే అనుభూతి ఒకటైతే, వి.ఐ.పి దర్శనం మరొకటి.

Pages