S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

05/26/2018 - 23:51

ఫ్లాట్ నుంచి విల్లాకు మారి ఓ ఆరుమాసాలు అవుతోంది. గృహ ప్రవేశం చేసినప్పుడు మా అన్నయ్య కొడుకు శివప్రసాద్ అమెరికాలో వున్నాడు. అందుకని కొత్త ఇంటికి రాలేకపోయాడు. ఓ పూజ వుంది రమ్మని పిలిచాను. ఓ రెండు మూడు రోజులు మాతో గడిపే విధంగా వచ్చాడు. నాకన్నా రెండు సంవత్సరాలు చిన్న అతను.

05/20/2018 - 00:28

కొంతమంది కుక్కలని పెంచుకుంటారు. మరి కొంతమంది పిల్లులని పెంచుకుంటారు. ఇంకా కొంతమంది అక్వేరియమ్‌లలో చేపలని పెంచుతారు.
పావురాలని, పక్షులని పెంచుకునే వాళ్లు ఎందరో.
ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో రకంగా ఉంటుంది.
మనుషులని పెంచడం కొంతమేరకు మాత్రమే ఉంటుంది. వాళ్లు కాస్త పెద్దవాళ్లు అయిన తరువాత స్వేచ్ఛా జీవులుగా మారిపోతారు.
పెంపుడు జంతువులు వేరు. మనుషులు వేరు.

04/28/2018 - 22:34

సృష్టిలో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాలి. యువకుడిలాగా ఎవరూ ఎప్పుడూ వుండలేరు. వయస్సు వస్తుంది.
ఈ మధ్య వార్తాపత్రికలో ఓ వార్త చూశాను. ఓ వ్యక్తి బొమ్మ చూశాను. గతంలో అతను ప్రభుత్వంలో ఓ ఉన్నతాధికారి. ప్రధాన సమాచార కమిషనర్‌గా పని చేశారు. కానీ ఇప్పుడు అతను అన్నీ మరిచిపోయాడు. అతన్ని చూడటానికి ఇద్దరు ముగ్గురు మనుషులు అవసరం ఏర్పడినారు.

04/14/2018 - 23:55

కొన్ని ఉద్యోగాలు పదవులు మనకు కొన్ని పరిమితులని ఏర్పాటు చేస్తాయి. ఆ పరిమితులకి లోబడి పని చేయాల్సి ఉంటుంది.
1989లో న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టాను. జిల్లా జడ్జిగా వుండి జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా పనిచేసే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.

04/02/2018 - 22:45

ఈమధ్య ఓ మిత్రుడు ఓ బొమ్మను షేర్ చేశాడు. అది 1914వ సంవత్సరంలో నిజాం నవాబు కట్టిన గెస్ట్ హవుజ్. ఇప్పుడు దాన్ని తీసివేసి, దాని స్థానంలో కొత్తది కట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాన్ని ఆపాలని అతని ఉద్దేశం. హెరిటేజ్ భవనంగా అది ఉంచాలని అతని భావన.
ఈ మెసేజీ సరిగ్గా నేను వేములవాడలోని మా ఇంటిని చివరిసారి చూసి వస్తున్నప్పుడు వచ్చింది.

03/24/2018 - 23:24

మన జీవితం ఓ ఆటలాంటిది.
ఆటలా మనం భావించాలి.
ఆటలో గెలుపులూ వుంటాయి.
ఓటములు శుంటాయి.
గెలుపు సంతోషాన్ని ఇస్తుంది.
ఓటమి నిరుత్సాహాన్ని ఇస్తుంది.
నిజానికి ఓటమి గెలుపునకు పునాదిగా మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుడుంటే మనం గెలుపు వైపు ప్రయాణం చేస్తాం.
జీవితంలో గెలుపు ఓటములు సహజంగా వుంటాయి. అయితే చాలా మంది ఓటములను గుర్తుకు తెచ్చుకొని బాధ పడుతూ ఉంటారు.

03/18/2018 - 00:04

ఆ మధ్య ఓ మిత్రుడు భోజనానికి పిలిస్తే వెళ్లాను. నగరానికి దూరంగా ఖాజాగూడలో అతను ఉంటున్నాడు. అది కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ప్రతి నెలకి దాని రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకసారి గతంలో వచ్చినప్పటికీ అతని ఇల్లు వెతుక్కోవటంలో ఇబ్బంది ఎదురైంది. గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నా అతని ఇంటిని సరిగ్గా తెలుసుకోలేక పొయ్యాను. అందుకని అతనికి ఫోన్ చేశాను. వాళ్ల డ్రైవర్‌ని నేను వున్న ప్రదేశానికి పంపించాడు.

03/10/2018 - 22:16

సాంకేతిక యుగంలో ఎన్నో కొత్త పరికరాలు, పనిముట్లు. ఈ పనిముట్లతో ఎన్నో సౌకర్యాలు. మరెన్నో అసౌకర్యాలు.
స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత మనుషుల ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.
వాట్సప్‌లు, టెలిగ్రామ్‌లు, ట్విట్టర్లు, సోషల్ మీడియాలో చాట్స్. ఇట్లా వాటిల్లో పూర్తిగా మునిగిపోతున్నారు. వాట్సప్‌లలో ఎన్నో గ్రూప్‌లు. అందులో ఎన్నో బొమ్మలు, వీడియోలు.
ఇలా అందరూ కొట్టుకొని పోతున్నారు.

03/07/2018 - 04:13

ప్రముఖ కథారచయిత మునిపల్లె రాజుగారు మరణించారన్న వార్త ఆలస్యంగా తెలిసింది. ఆయన శనివారం చనిపోతే ఆదివారం ఉదయం వరకు నాకు తెలియలేదు. శ్రీపతిగారికి ఫోన్ చేశాను. ఆయన శనివారం నాడే మంజుశ్రీ గారితో కలిసి చూసి వచ్చానని చెప్పారు.
చివరికి రాజుగారి ఇంటికి ఫోన్ చేశాను. ఆదివారం ఉదయం 10.30 గం.ల వరకు ఆయన పార్థీవ శరీరం ఇంట్లో ఉంటుందని, ఆ తరువాత స్మశానవాటికకు తీసుకొని వెళ్తారని ఆయన కోడలు చెప్పారు.

02/24/2018 - 23:15

ఉదయం పూట నడవడం అలవాటై పోయింది. ఆ తరువాత అంతా పరుగే.
నడక నాకిష్టం.
ఇది నడవడానికి వీల్లేని రోడ్డు.
ఎక్కడైనా ఇంత బండ్ల బాట వుంటే ఎంత బాగుండు
ఎందుకంటే నడక నాకిష్టం.
అంటాడు ‘కన్నరోడ్డు’ అన్న కవితలో ఓ కవి.

Pages