S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

10/02/2017 - 22:55

మనిషికి సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంట్లు లేని వ్యక్తి ఎవరూ వుండరు. విప్లవవాదులకి సెంటిమెంట్ మరీ ఎక్కువ. వాళ్లు ఈ విషయాన్ని ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇది నిజం. అమరవీరుల స్థూపాలే అందుకు నిదర్శనం.

09/16/2017 - 22:59

కొంతమంది రచయితలు విరివిగా రాస్తూ ఉంటారు. మరి కొంతమంది తక్కవగా రాస్తూ ఉంటారు.
చిత్రకారులూ అంతే!
కొంతమంది రోజూ బొమ్మలు వేస్తూ ఉంటారు. మరి కొంత తమకు ఇష్టమైనప్పుడు వేస్తూ ఉంటారు.
ఎక్కువ రాయడానికి, అతి తక్కువ రాయడానికి ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు.

09/09/2017 - 23:31

చాలా సంవత్సరాల తరువాత యూనివర్సిటీకి వెళ్లాను. అదేదో నిన్న మొన్న అక్కడ చదువుకున్నట్టుగా అన్పించింది.
కానీ ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయింది.
ఆ మధ్య సిరిసిల్లలోని కోర్టుకి వెళ్లాను. అక్కడ నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాను. అది కూడా నిన్ననో, మొన్ననో అక్కడ ప్రాక్టీస్ చేసినట్టు అన్పించింది.
కానీ ముప్పై సంవత్సరాలు దాటిపోయింది.

09/05/2017 - 22:46

మా చిన్నప్పుడు సీతాకోక చిలుకలు, ఆరుద్ర పురుగులు, మిణుగురులు మమ్మల్ని ఎక్కువగా ఆకర్షించేవి. ఆరుద్ర పురుగులు మఖుమల్ లాగా మెత్తగా ఉండేవి. మిణుగురులు వెలుగుతూ కన్పించేవి. సీతాకోక చిలుకల తరువాత పిల్లలని ఎక్కువగా ఆకర్షించేవి ఈ ఆరుద్ర, మిణుగురు పురుగులు.

08/28/2017 - 22:26

జీవిత చరమాంకంలో చాలామందికి జ్ఞానోదయం కలుగుతుంది. క్షమాగుణం వచ్చేస్తుంది. ఇతరుల పట్ల తాము కఠినంగా వ్యవహరించామని అన్పిస్తుంది. ఇది సహజం.
అయితే సమాజం గురించి ఆలోచించే రచయితలు సంపాదకులలో కూడా ఇలాంటి జ్ఞానోదయం జీవిత చరమాంకంలో కలగడం ఆశ్చర్యంకన్నా, బాధ ఎక్కువ కలుగజేస్తుంది.

08/21/2017 - 23:30

మనిషి జీవితం ఓ ప్రయాణం లాంటిది. మరీ ముఖ్యంగా రైలు ప్రయాణం లాంటిది. దార్లో ఎన్నో స్టేషన్లు, ఎన్నో మలుపులు, రకరకాల మనుషులు, స్నేహితులు, అపరిచితులు ఇట్లా ఎంతోమంది తారసపడుతుంటారు.
ఎక్కడో పుడుతాం. అక్కడే చదువుకోవచ్చు. మరో ఊళ్లో చదువుకోవచ్చు. హైస్కూలు, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజీ, పీజీ, ఉద్యోగం, రకరకాల ప్రదేశాలు ఇట్లా ఎన్నో దాటుకుంటూ ప్రయాణం కొనసాగిస్తాం.

08/12/2017 - 22:29

ఈమధ్య ఓ ఇద్దరు మిత్రులు కలిశారు. వాళ్లిద్దరు న్యాయవాదులే. నేనే న్యాయవాద వృత్తిని వదిలి న్యాయమూర్తి పదవిలోకి వెళ్లిపోయాను. వాళ్లు న్యాయవాద వృత్తిలో చేరి బహుశా ముప్పై ఐదు సంవత్సరాలు దాటి ఉంటాయేమో. అయినా ఈ మధ్య ఓ గమ్మతె్తైన సంభాషణ జరిగింది.

08/10/2017 - 20:45

నేను రాసిన కథలని, కవిత్వాన్ని పుస్తక రూపంలో ప్రచురించాలని అనుకున్నాను. అది ఏప్రిల్ నెలలోగా ప్రచురించాలని కూడా నిర్దేశించుకున్నాను. కానీ అది సఫలం కాలేదు. అగస్టు నెల కూడా వచ్చేసింది. ఒకరిద్దరు మిత్రులు ఆ విషయం గుర్తు చేశారు. మా ఆవిడ కూడా గుర్తు చేసింది. వాళ్లకి ఎన్నో కారణాలు చెప్పాను.

07/29/2017 - 22:32

ప్రపంచం అంతటా ఇప్పుడు యోగామంత్రం వినిపిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్య రక్షణకు యోగా అద్భుతంగా పనిచేస్తోందని ఇప్పుడంతా విశ్వసిస్తున్నారు. అయితే అమెరికాలో ఇప్పుడు ఈ యోగా శిక్షణకు సరికొత్త హంగులు జోడిస్తున్నారు. నైజిరియాకు చెందిన డ్వార్ఫ్‌గోట్స్ అతి చిన్నగా, ముద్దుగా ఉంటాయి. యోగా శిక్షణ ఇచ్చే చోట వాటిని వదులుతున్నారు. యోగాచేస్తున్నవారి వీపులపై అవి ఎక్కి సందడి చేస్తున్నాయి.

07/29/2017 - 22:25

మాఇంట్లో గోడలకి ఫొటోఫ్రేమ్‌లు ఎక్కువగా వుండేవి. వాటి వెనక పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేవి. వాటి నుంచి అప్పుడప్పుడు వాటి గ్రుడ్లు క్రిందపడి పగిలిపోయేవి. ఒక్కోసారి పక్షి పిల్లలు కూడా క్రింద పడేవి. తల్లి పిచ్చుక వాటి చుట్టూ తిరిగి వాటిని తిరిగి పైకి తీసుకొని వెళ్లేవి. కొంత పెద్దగా అయిన పక్షులు కూడా క్రిందపడేవి. అవి పైకి ఎగరడానికి ప్రయత్నం చేసేవి. ఎవరైనా కొంత సహాయం చేస్తే పైకి ఎగిరిపోయేవి.

Pages