S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

10/06/2018 - 18:45

వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ తరుచూ ఒక మాట చెబుతుంటారు.
ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఇతరులెవ్వరిలో లేని ప్రత్యేక గుణాలు ప్రతి వ్యక్తికి ఉంటాయని, ఎన్నో వీర్య కణాల్లో పోటీ పడి అండాన్ని చేరిన వీర్య కణమే మనిషని, అందుకని ప్రతి వ్యక్తీ ప్రత్యేకమని చెబుతుంటారు.

09/29/2018 - 17:32

చాలా మంది మిత్రులు స్మార్ట్ ఫోన్‌తో, కంప్యూటర్ కీ బోర్డుతో టైప్ చేస్తుంటారు. నేను ఇంకా దానికి అలవాటు కాలేదు. పెన్నుతో రాయటంలోనే ఉన్నాను.
టేబుల్ ముందు కూర్చోగానే తెల్ల కాగితాలు నా వైపు చూస్తూ వుంటాయి, ఏమైనా రాయమన్నట్టు. ఏమీ రాయనప్పుడు వెక్కిరిస్తున్నట్టు కూడా అన్పిస్తుంది.

09/22/2018 - 18:32

చెట్టు ముందా? విత్తు ముందా?
ఇది కొన్ని యుగాల నుంచి ఎంతో మందిని ఆలోచింపజేస్తున్న ప్రశ్న.
భగవంతుడు సృష్టించాడు విత్తుని. ఆ తరువాత అది చెట్టుగా ఎదిగింది. భగవంతుడు ఎలా వచ్చాడు.
ఈ ప్రశ్నలకి సమాధానాలు లేవు.
ఇలాంటి ప్రశ్నలు అనేకం. గుడ్డు ముందా? కోడి ముందా?
ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తున్నప్పుడు మరో ప్రశ్న ఈ మధ్య ఓ మిత్రుడు వేశాడు.

09/22/2018 - 18:31

నడక ఆరోగ్యానికి మంచిదని అందరూ అంటారు.
అందులో ఎలాంటి సందేహం లేదు.
ఒక శారీరక ఆరోగ్యానికే కాదు - మానసిక ఆరోగ్యానికి కూడా అది ఎంతో మంచిని కలుగజేస్తుంది.
మనం పార్క్‌ల్లో నడుస్తున్నప్పుడు ఎన్నో విషయాలని గమనించవచ్చు.
పక్షుల కిలకిలారావాలు వినవచ్చు. మనుషులని చూస్తూ నడవచ్చు. వారి వేషధారణలని గమనించవచ్చు.
విచ్చుకున్న పుష్పాన్ని చూడవచ్చు.

09/15/2018 - 16:58

చాలా కాలం నుంచి ‘లా’ పుస్తకాల షాపుల వైపు వెళ్లలేదు. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తరచూ వెళ్లేవాడిని. పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ‘లా’ పుస్తకాల షాపుల వైపు వెళ్లడం చాలా తగ్గింది.

09/08/2018 - 18:30

గత పది నెలల నుంచి ఓ గేటెడ్ కమ్యూనిటీలో వుంటున్నాను. కాలనీకి సంబంధించిన విశేషాలూ, వార్తలు అన్నీ వాట్సప్ గ్రూప్‌లో వస్తూ వుంటాయి. డ్రైవర్ కావాలన్నా, పనిమనిషి, వంట మనిషి కావాలన్నా అన్నీ అందులో అడుగుతూ ఉంటారు. ఎవరో ఒకరు వాటికి సమాధానాలని ఇస్తూ వుంటారు.

09/08/2018 - 18:28

జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం.
కొంతమందికి ఎక్కువసార్లు చదవాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి చదివితే చాలు. అంతా గుర్తుండిపోతుంది.
ఒక్కసారి వింటే చాలు.
గుర్తుండిపోతుంది.
ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు.
చాలామంది రెండు మూడుసార్లు చదివితే తప్ప, వింటే తప్ప గుర్తుండదు.
ఏకసంథాగ్రాహులు చాలా తక్కువమంది ఉంటారు. సహజంగా వాళ్లకి వచ్చిన లక్షణం.

09/02/2018 - 22:39

ఈ ప్రపంచం చాలా వింతగా ఉంటుంది.
ఈ ప్రపంచంలోని మనుషులు ఇంకా వింతగా ఉంటారు.
ఎవరైనా సవాలు విసిరితే చాలా మంది నిరుత్సాహ పడతారు. కొంతమంది దాన్ని స్వీకరించి విజయంవైపుప్రయాణం చేస్తారు.
1960 సంవత్సరంలో అంతరిక్షంలో ప్రయాణం చేయడం అనేది దుస్సాధ్యం అన్న అభిప్రాయం ప్రపంచంలో వుండేది. కాని ఆ తరువాత 10 సంవత్సరాలలో మనిషి చంద్రుని మీద కాలు మోపాడు. ఇదొక అద్భుతమైన విజయం.

09/01/2018 - 18:11

ఈప్రపంచం చాలా వింతగా ఉంటుంది.
ఈ ప్రపంచంలోని మనుషులు ఇంకా వింతగా ఉంటారు.
ఎవరైనా సవాలు విసిరితే చాలా మంది నిరుత్సాహ పడతారు. కొంతమంది దాన్ని స్వీకరించి విజయంవైపుప్రయాణం చేస్తారు.
1960 సంవత్సరంలో అంతరిక్షంలో ప్రయాణం చేయడం అనేది దుస్సాధ్యం అన్న అభిప్రాయం ప్రపంచంలో వుండేది. కాని ఆ తరువాత 10 సంవత్సరాలలో మనిషి చంద్రుని మీద కాలు మోపాడు. ఇదొక అద్భుతమైన విజయం.

09/01/2018 - 18:09

మీరు ఏదైనా పని చేద్దామని అనుకుంటే చాలామంది విశ్వసించరు. విశ్వసించకపోయినా పర్వాలేదు. కానీ అధైర్యపడకూడదు. కానీ చాలామంద అధైర్యపరుస్తారు. ఈ లోకంలో ఇవన్నీ సహజమే.
మిమ్మల్ని ఇష్టపడేవారు లేరు.
పర్వాలేదు.
మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారా లేదో అనేది ముఖ్యం. మిమ్మల్ని మీరు ఇష్టపడితే చాలు. చాలా మంది మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే అర్థం.

Pages