S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

07/30/2016 - 21:37

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్‌ని ఎవరైనా కదిలిస్తే కస్సుమంటోందిట..! కారణాలు ఏవైనా..కలిసిచోటల్లా ఆమెను మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతుంటే ‘కస్సు’మనకుండా మరేం అంటోంది చెప్పండి? బాలీవుడ్ తారలు ఎప్పుడూ వార్తల్లో వుండడం మామూలే. ముఖ్యంగా అగ్రతారలైతే మరీనూ...! తనపై వచ్చే రూమర్స్‌కు ఎంతో విసిగి వేసారిన ఈ భామ తాజాగా ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి మరో సంచలనానికి తెరలేపింది.

07/30/2016 - 21:34

బాలీవుడ్‌లో థ్రిల్లర్లు..హారర్లులాంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సృష్టించుకున్న నటి బిపాసాబసు. ఈ బ్యూటీ నటించిన ప్రతీ చిత్రంలోనూ హీరోకు ధీటుగా తన క్యారెక్టర్ వుండేలా చూసుకుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోబట్టే ఇన్నాళ్లు కెరీర్ హాయిగా సాగింది. బిపాసాకు వివాదాలు కూడా కొత్తేం కాదు.

07/30/2016 - 21:32

చిన్ని చిన్ని ఆశ...అని అనుకుంటాం కానీ అందాలతార హన్సికకు టాలీవుడ్‌పై బోలెడన్ని పెద్ద పెద్ద ఆశలే వున్నాయి. ఎన్నో ఆశలు..మరెన్నో కోరికలతో తెలుగు చిత్రసీమకు ‘దేశముదురు’తో పరిచయం అయిన ఈ భామకు అటు తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా టాలీవుడ్‌లో చుక్కెదురైంది. బాలనటిగా పేరుతెచ్చుకున్న హన్సిక కథానాయికగా తెరంగేట్రం చేసినప్పుడు బాగానే నిలదొక్కుకుంటుందని అంతా భావించారు.

07/24/2016 - 07:16

అందాల భామ, సెనే్సషనల్ బ్యూటీ నయనతార ఇటు తెలుగు.. అటు తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేసి రెండు చోట్లా తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరచుకుంది. ‘‘టాలీవుడ్‌లో బిజీగా అగ్రహీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పుడే బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వచ్చాయి. అయితే వాటికి ఏ మాత్రం ఆశపడకుండా వద్దనుకుంది. ఏ నటి అయినా ఇలాంటి అరుదైన అవకాశం వదులుకుంటుందా?

07/24/2016 - 07:14

‘‘జీవితంలో కొన్ని పాత్రలు కొంతమందికి తీపి జ్ఞాపకాలను మిగుల్చుతాయి. అలాంటి అవకాశం అందరీకీ రాదు. అవి కొందరికే రాసిపెట్టి వుంటాయి. అలా వచ్చిన అరుదైన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకున్నప్పుడే ఏ తార కెరీర్ అయినా సరైన మార్గంలో పయనిస్తుంది. నా మటుకు నాకు అలాంటి చక్కటి అవకాశాలు రాబట్టే నేను ఇలా వుండగలిగాను. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు.

07/24/2016 - 07:11

-అంటోంది తాజాగా అందాల భామ కాజల్ అగర్వాల్. అంటే టాలీవుడ్‌లో అనుకునేరు సుమా! కాదు..కోలీవుడ్‌లోనట. అదేంటి? అలా అంటుందేమిటి అనుకుంటున్నారా? నిజమే మరి.. కాజల్ చెప్పిన మాటలో ఎంతో నిజముంది. ప్రస్తుతం జీవా సరసన ‘క వలైవేండామ్’తో పాటు విక్రమ్ జంటగా ‘గరుడా’ ఇవే గాక, అజిత్ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మ వచ్చిందని జోరుగా ప్రచారం కూడా జరిగింది.

07/24/2016 - 07:09

బాలీవుడ్‌లో తను నటించిన చిత్రాల ద్వారా తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరచుకుంది నటి కంగనా రనౌత్. చేసిన చిత్రాలే కాదు, పోషించిన పాత్రలూ కంగనాకు మంచి కెరీర్‌నే అందించాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇటీవల బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాలు చాలానే వున్నాయి. వాటికి ఆదరణ కూడా బాగానే వుండడంతో చాలా మంది దర్శక, నిర్మాతలు ఇలాంటి చిత్రాలపైనే మోజు పడుతున్నారు. అలాంటి క్యారెక్టర్ ఒకటి కంగనా చేస్తోంది.

07/17/2016 - 01:31

-అంటోంది అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్. ‘ఏ నటికైనా టార్గెట్ బాలీవుడ్డే కదా’ అని ఎవరైనా ప్రశ్నిస్తే- ‘‘కావొచ్చు. కానీ, నాకు మాత్రం కాదు. నాకు టాలీవుడ్‌లోనే ఎంతో ఆదరణ లభిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. అంతకంటే ఎక్కవ ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానం మరచిపోలేనిది. ఎలాంటి ఆశలూ.. ఆశయాలు లేకుండానే వెండితెరపై అడుగుపెట్టాను. నా అదృష్టం కొద్దీ మంచి చిత్రాలు..

07/17/2016 - 01:23

బాలీవుడ్ తారలు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం కొత్తేం కాదు. అలాగే టాలీవుడ్ భామలు కూడా బాలీవుడ్‌కి పరిచయం కావడం కూడా. ఇలా రెండు చోట్లా కూడా చిత్రాలు చేస్తూ తమకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటున్న తారలు ఎందరో..! అలా ఇప్పుడు కొత్తగా మరోతార టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది! ఆమే అమైరా దస్తూర్.

07/17/2016 - 01:21

‘‘బాలీవుడ్.. హాలీవుడ్ అంటూ కూర్చుంటే కెరీర్ ముందుకు సాగదు. ఎక్కడైనా చేసే క్యారెక్టర్ ఎలాంటిది..నటించే సినిమా స్టామినా ఏమిటి? అన్నదే ముఖ్యం. ఏ నటి అయినా తెలుసుకోవలసింది ఇదే’’అంటూ కొత్త తరహాలో అవకాశం వచ్చిన చోటల్లా చెప్పుకొస్తుంది అందాల భామ ప్రియాంక చోప్రా. ‘క్యాంటికో’ సీరిస్ తచ్చిన క్రేజ్‌తో వచ్చిన ‘బేవాచ్’ చిత్రం అవకాశాన్ని తనదైన శైలిలో ఇరగదీసింది.

Pages