S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

11/11/2017 - 17:33

మలయాళీ భామ అనూ ఇమ్మానుయెల్ జోరు మామూలుగా లేదు. వరుస సినిమాలతో బిజీగా వున్న ఈమె టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’లో నటిస్తున్న అను మరో వైపు పవన్‌కళ్యాణ్ త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా మరో క్రేజీ అవకాశాన్ని దక్కించుకుంది.

11/11/2017 - 17:32

ప్రతి ఏటా ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్స్ జాబితా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగానే 2017 జాబితా వెలువరించింది ఫోర్బ్స్. ఈ జాబితాలో టాప్-100లో చోటు దక్కించుకుంది పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా. అయితే తనని ప్రఖ్యాత ఫోర్బ్స్ ఆ రేంజ్‌లో అందలం ఎక్కించడానికి కారణం ఏమై వుంటుంది? ఇంకేం ఉంది.. హాలీవుడ్ సినిమాల్లో అరంగేట్రం.. ‘క్వాంటికో’ సిరీస్‌తో వచ్చిన ఐడెంటిటీ.. దాంతోపాటు దాన, సేవాగుణం..

11/04/2017 - 17:46

బాలీవుడ్ భామ దీపికా పదుకొనే జోరుగా.. హుషారుగా కనిపిస్తోంది ఈమధ్య. అందుకు కారణం లేకపోలేదు.. తన హుషారంతా తాజా చిత్రం ‘పద్మావతి’ గురించేనట. ఈ చిత్రంలో ధగధగలాడే వస్త్రాలు.. ఒంటి నిండా నగలు. తలపై మేలి ముసుగు ధరించి అంతఃపుర స్ర్తిలతో కలిసి రంగంలోకి దిగి చిందేయడం మరచిపోలేకపోతుందిట. ‘ఘుమార్ ఘుమార్ ఘుమె..’ అంటూ సాగే రాజస్థానీ జానపద గీతానికి హుషారుగా కాలుకదిపింది దీపికా.

11/04/2017 - 17:46

సంచలనాలకు మారుపేరైన సన్నీలియోన్ తెలుగులో మరోసారి మెరిసింది. వివరాల్లోకి వెళితే.. రాజశేఖర్ హీరోగా నటించిన ‘పి.ఎస్.వి గరుడవేగ 126.18ఎమ్’లో సన్నీ ‘డియో..డియో’పాటలో చేసిన నృత్యం టీజర్‌కి ఐదు రోజుల్లో ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సన్నీలియోన్ ఈ పాటపై స్పందిస్తూ- ‘‘డియో..డియో పాటలో నేను చేసిన నృత్యాన్ని లార్జర్ దేన్ లైఫ్ తరహాలో తీశారు.

11/04/2017 - 17:44

దర్శక నిర్మాతలు కథ ప్రకారం హీరోయిన్‌ను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. లేకపోతే కాల్షీట్లు అడ్జెస్ట్ కాక ఎవరో ఒకరు అన్నట్లు హీరోయిన్‌ను ఖరారు చేయడం విన్నాం. కానీ ఈ విషయం వింటే విచిత్రంగా అనిపిస్తుంది. విషయంలోకెళితే, సాహో చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోంది. హీరోయిన్ ఎంపిక సమయంలో అనేకమందిని పరిశీలించి చివరికి శ్రద్ధాను ఎంపిక చేసింది యూనిట్.

11/04/2017 - 17:43

సామాన్యంగా వివాదాలకు దూరంగా వుండే హన్సికను కూడా వివాదాల్లోకి లాగింది బిగ్‌బాస్ (హిందీ)లో కంటెంటెస్ట్‌గా చేసిన హీనాఖాన్. విషయంలోకి వెళితే ఉత్తరాది చిత్రాలకన్నా దక్షిణాది చిత్రాలలో ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా వుంటుందని, అలా చేస్తేనే అక్కడి ప్రేక్షకులు చిత్రాలకు బ్రహ్మరథం పడతారని, అలా ఎక్స్‌పోజింగ్ చేసిన హీరోయిన్లను చూసి జాలిపడడం తప్ప మరేం చేయలేమని వ్యాఖ్యానించిందట హీనాఖాన్.

10/28/2017 - 17:28

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీ మెహరీన్ బిజీ.. బిజీగా కెరీర్‌ను కొనసాగిస్తూనే వుంది. శర్వానంద్ హీరోగా నటించిన ‘మహానుభావుడు’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమేగాక, అందులో అతడికి జోడీగా నటించిన మెహరీన్‌కు హీరోయిన్‌గా మంచి మార్కులే పడ్డాయి. ఆ చిత్రంలోని వివిధ సన్నివేశాల్లో ఈ బ్యూటీ చూపిన హావభావాలు అందర్నీ అలరించాయి. హీరోతో సమానంగా ప్రతిభను చాటుకుంది.

10/28/2017 - 17:18

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోల చిత్రాల్లో అతి తక్కువ సమయంలోనే అవకాశాలను చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది అందాల భామ కాజల్ అగర్వాల్. దాదాపు పదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆమె ఇమేజ్ చెక్కు చెదరలేదు. చాలా మంది గ్లామర్ చిందించినా పరిశ్రమలో ఎక్కువ కాలం నిలవలేకపోయారు. కానీ, కాజల్ అందుకు విరుద్ధంగా ప్రతిభను చూపి తనేంటో నిరూపించుకుంది.

10/28/2017 - 17:15

నమిత.. ఒకప్పుడు తెలుగుతోపాటు తమిళంలో సైతం మంచి ఫాలోయింగ్ వున్న హీరోయిన్. వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె ప్రస్తుతం ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో పెద్దగా సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించడంలేదు. ఇలాంటి తరుణంలో ఆమె పెళ్లి గురించి ఒక సంచలన వార్త బయటికొచ్చింది. అందులో ఆమె సీనియర్ నటుడు శరత్‌కుమార్‌ను వివాహమాడనుందనేది సారాంశం.

10/28/2017 - 17:13

-అంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఈ భామపై ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. అవి రాను రాను ఎన్నో వివాదాలకు దారితీశాయి కూడా. అయినా వాటిని కత్రీనా ఏ మాత్రం లెక్కచేయలేదు. కనీసం అలాంటి రూమర్స్‌కి స్పందించలేదు కూడా. ఏ పార్టీకి వెళ్లినా ఆమెకు ఈ రూమర్స్ గోల తప్పలేదు.

Pages