S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

09/09/2017 - 20:50

టాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాదిన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొంటున్న భామల జాబితాలో అనుష్క పేరు కూడా వుంటుంది. అతి తక్కువ సమయంలో కోటి రూపాయల మార్కుని చేరుకోగలిగింది ఈ బ్యూటీ. నటించిన చిత్రాల్లో అనుష్క చేసిన క్యారెక్టర్స్ వేటికవే భిన్నంగా వుండడంతో అటు చిత్రసీమ, ఇటు ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఒకటా.. రెండా ఎన్నో వైవిధ్యమైన, అరుదైన పాత్రల్లో నటించి జీవించింది.

09/09/2017 - 20:48

....అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు నవతరం కథానాయిక సాయి పల్లవి అత్యాశను చూసి. ఎదుగుతున్న నటికి ఆశ వుండాలే కానీ, మరీ ఇంత అత్యాశ పనికిరాదని కూడా వాపోతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘్ఫదా’తో అందరి అభిమానాన్ని చూరగొనడమేగాక, తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా యువతరం మనసుల్ని తన నటనతో కొల్లగొట్టేసి, తన వైపునకు తిప్పుకుంది సాయి పల్లవి.

09/09/2017 - 20:46

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా రూటే సపరేటు. బాలీవుడ్‌లో శత్రఘ్న సిన్హా తనయగా వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. కెరీర్‌లో క్రేజీభామగా బాలీవుడ్‌లో ఉన్నత స్థాయికి ఎదిగింది. తనకు లభించిన చిత్రాల్లో తను పోషించిన మంచి పాత్రలే కెరీర్‌లో ఎదిగేలా చేసాయంటోంది సిన్హా. ‘‘నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకోను కూడా.

09/09/2017 - 20:43

నవతరం కథానాయికలకు టాలీవుడ్ ఎప్పుడూ అక్కున చేర్చుకుంటూనే వుంటుంది. వారి ప్రతిభను గుర్తించి తమ చిత్రాల్లో మంచి పాత్రలు చేసేలా ప్రోత్సహిస్తుంటుంది. ఇప్పుడు అలాంటి కోవలోకే చేరింది బ్యూటీ మేఘా ఆకాశ్. తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తూనే మంచి అవకాశాలను తన ఖాతోలో వేసుకుంటూ బిజీ బిజీగా మారుతోంది. యంగ్ హీరో నితిన్ 25వ చిత్రంతో పాటు, రామ్‌తో మరో సినిమాలో నటిస్తూ యమ స్పీడుగా ఉరకలేస్తోంది మేఘా.

09/01/2017 - 21:30

తెలుగు, తమిళ చిత్రాల్లో అతి తక్కువ సమయంలో అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ముద్దుగుమ్మ ప్రియమణి శ్రీమతిగా కొత్త అవతారం ఎత్తింది. అవతారమంటే చిత్రాల్లో కాదు సుమా! నిజ జీవితంలో శ్రీమతిగా అడుగుపెట్టింది. ప్రముఖ వ్యాపారవేత్త ముస్త్ఫా రాజ్‌తో కొనే్నళ్లుగా పీకలోతు ప్రేమలో కూరుకుపోయింది. ఒకరినొకరు గాఢంగానే ప్రేమించుకున్నారు. ఈ ప్రేమజంట ఇటీవలే జరిగిన పెళ్లితో ఒక్కటయ్యారు.

09/01/2017 - 21:29

బాలనటిగా అనేక చిత్రాల్లో చక్కటి నటనను కనబరిచి అందర్నీ ఆకట్టుకున్న షామిలీ కథానాయికగా రంగప్రవేశం చేసి కెరీర్‌లో నిలదొక్కుకోలేకపోయింది. బాలనటిగా మాత్రమే ప్రేక్షకులు ఆమెను ఆదరించారు కానీ, హీరోయిన్‌గా మాత్రం చూడలేకపోయారు. గతంలో చాలా మంది హీరోయిన్లు దర్శకులుగా అవతారమెత్తారు. ఇప్పుడు ఆ జాబితాలో షామిలీ కూడా చేరే ప్రయత్నం చేస్తోందిట.

09/01/2017 - 21:27

తెలుగు, తమిళ చిత్రాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ అంజలి త్వరలో రాజకీయాల్లోకి వెళ్లబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవునా.. ఇది నిజమా? అని అందరూ ప్రశ్నిస్తున్నారట. అదీ..తమిళనాట ఈ పుకారు అత్యంత స్పీడుగా షికారు చేస్తోంది. కథానాయికలు రాజకీయాల్లోకి రావడం తమిళనాట పాత విషయమే. ఖుష్బూ లాంటి తారలు ప్రస్తుతం తమిళనాట పాలిటిక్స్‌లో కొనసాగుతున్నారు.

09/01/2017 - 21:25

టాలీవుడ్‌లో శర్వానంద్ హీరోగా నటించిన ‘రన్ రాజా రన్’ గుర్తుంది కదా? అందులో అతడి సరసన ఆడిపాడిన బికినీ బ్యూటీ సీరత్‌కపూర్ తాజాగా ‘రాజుగారి గది’ సీక్వెల్ చిత్రంలో అవకాశాన్ని చేజిక్కించుకుంది. అయితే ఇటీవల తన బికినీ ఫొటోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేసేసింది. ఈ ఫొటోలు చాలా వైరల్ అయ్యాయి. అంతే కాదు, ఒక వీరాభిమాని సీరత్‌కపూర్ పేరుని తన చేతి మీద చెక్కేసుకున్నాడు. అదీ..

08/26/2017 - 21:41

ఐటమ్ భామల రూటే సపరేటు! అలా అని అందరూ ఐటమ్సే అనుకుంటే పొరపాటే..! అందులో పోర్న్‌స్టార్, బాలీవుడ్ ఖతర్నాక్ ఫిగర్ సన్నీ లియోన్‌ది ప్రత్యేక శైలి. ప్రేక్షకుల్లో ఆమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సన్నీ ఎక్కడికెళ్లినా హాట్ హాటే! కమర్షియల్ సినిమాలకు ఎన్ని హంగులున్నా ఐటమ్ పాటల ప్రత్యేకతే వేరు. ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ప్రత్యేక గీతాల హవా కొనసాగుతూనే వుంది.

08/26/2017 - 21:40

..అంటున్నారు బాలీవుడ్ సినీ దిగ్గజాలు. వారు అలా అనడానికి కారణం లేకపోలేదు. బాలీవుడ్‌లో ఎన్నో మంచి పాత్రలు చేసి, అగ్ర హీరోలతో జోడీకట్టి నటిగా వంద మార్కుల్ని కొట్టేసింది. తన ఇమేజ్‌ని ఎక్కడికో తీసుకెళ్లింది. అది..గతం! మరి ఇప్పుడు హాలీవుడ్‌లోనూ మెరుపులు కురిపిస్తోంది. అక్కడ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది ప్రియాంక. ఫలితంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా వుంది.

Pages