S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

08/26/2017 - 21:37

అందాల బాలీవుడ్ తార ఇషాగుప్తా ఇప్పుడు సోషల్ మీడియాని హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ఆమె నెటిజన్ల మతిని పోగొట్టేలా ఫొటో షూట్‌ని చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిచ్చింది. ఆ ఫొటో షూట్ మామూలుదైతే ఫర్వాలేదు కానీ, టాప్‌లెస్‌గానూ, లోదుస్తుల్లో అర్ధనగ్నంగా ఉండడంతో యువతను కిక్కెస్తోంది. అలా నెటిజన్లను తన అందాల ఆరబోతతో కిక్ ఎక్కించాలన్నదే తన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ ఫొటో షూట్ పెద్ద వైరల్‌గా మారింది.

08/26/2017 - 21:35

‘‘ఎక్కడికెళ్లినా పెళ్లెప్పుడు.. పెళ్లెప్పుడు అని అడుగుతోంది మీడియా. నాకంటే మీడియాకే నా పెళ్లి గురించి పెద్ద ఆతృతగా ఉన్నట్లనిపిస్తోంది. నాకు మాత్రం పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేనేలేదంటే నమ్మండి. నాకు అప్పుడే పెళ్లేంటి? కెరీర్‌లో ఏం సాధించానని పెళ్లి చేసుకొని సెటిలైపోవాలి? నేను సాధించాల్సింది ఇంకా చాలా వుంది. కెరీర్‌లో మైలురాయిలాంటి చిత్రాలెన్నో చేయాలనుంది.

08/19/2017 - 21:50

టాలీవుడ్‌లో ‘హ్యాపీడేస్’ నుంచి కెరీర్‌లో ఆగకుండా ముందుకు పయనిస్తూనే వుంది మిల్క్‌బ్యూటీ తమన్నా. వేసే ప్రతీ అడుగూ ఆచి తూచి వేయడం వల్లే ఇంతకాలం విరామం లేకుండా కెరీర్‌లో రివ్వున దూసుకెళ్లింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడికి కాస్త బ్రేక్ పడిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అవును..నిజమే మరి! ఈ బ్యూటీ డైరీని తెరచిచూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది.

08/19/2017 - 21:49

అంటున్నారు సొగసరి లావణ్య త్రిపాఠిని చూసినవారంతా. ఎందుకలా అంటున్నారు? అనే కదా మీ డౌటు! అక్కడికే వద్దాం.. స్లో అండ్ స్టడీగా గుట్టు చప్పుడు కాకుండా కెరీర్‌లో పరుగులు పెడుతున్న ఈ సుందరాంగికి టాలీవుడ్ ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి. అగ్ర హీరోలే కాదు, నవతరం కథానాయకులతో కూడా జోడీ కడుతూ తన ప్రతిభను చాటుకునే దిశగా చూపు మరల్చింది. అందులో భాగంగానే తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

08/19/2017 - 21:47

అందాల భామ హన్సిక కెరీర్‌లో ముందు నుంచి ఆటుపోట్లు తప్పడం లేదట. ఆమె కెరీర్ అంతా అయోమయంలోనే కొనసాగుతూనే వుంది. ఎన్నో ఆశలతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఇక్కడ కాలం కలిసిరాలేదు. తెలుగు పరిశ్రమలో ఇక ఇంతే కెరీర్ అనుకున్న సమయంలో కోలీవుడ్ పిలుపునందుకుంది. అక్కడ అడుగుపెడుతూనే విజయపథంలో దూసుకెళ్లింది. అవకాశాల మీద అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఒక దశలో టాప్-5 కథానాయికల్లో ఒకరిగా నిలిచింది.

08/19/2017 - 21:46

తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతూనే చక్కటి చిత్రాల్లో సహజ నటన కనబరిచి ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టింది బ్యూటీ రెజీనా. అదే ఊపులో ఏడాదికి మూడు, నాలుగు చిత్రాల్లో మెరిసింది. యువతరం కథానాయికలతో జోడీ కట్టి కెరీర్‌లో దూసుకెళ్లింది. అయితే ఈ భామ ఇప్పుడు కాస్త నెమ్మదించింది. రెజీనా నటించిన తాజా చిత్రం ‘నక్షత్రం’ బాక్సాఫీస్ వద్ద చతికిలబడి ఆమెను మరింత కుంగదీసింది.

08/12/2017 - 21:16

అంటోంది టాలీవుడ్ టాప్‌స్టార్ రకుల్ ప్రీత్‌సింగ్. పరిశ్రమలోకి ఎంతమంది కొత్తవారు వస్తే అంత బావుంటుందని కూడా చెబుతోంది. కథానాయికల మధ్య పోటీ పెరగడం వల్ల దర్శక, రచయితలు మంచి పాత్రలపై దృష్టిపెడతారని, అలా చేయడం వల్ల పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ పుట్టుకొస్తాయని ఈ భామ నమ్మకం. తెలుగు చిత్రసీమలో ఏడాదికి ఐదు సినిమాలకు తక్కువ కాకుండా తన చేతిలో ఉంచుకొంటోంది. తను చేయబోయేది పెద్ద సినిమానా? చిన్న సినిమానా?

08/12/2017 - 21:15

‘‘ఏ క్యారెక్టర్ చేసినా అందులో లీనమవ్వాలి. అప్పుడే ఆ పాత్రకు జీవం పోసిన వాళ్లమవుతాం. కెరీర్‌లో ఎప్పుడూ గొప్ప గొప్ప పాత్రలు రాకపోవచ్చు. అయితే వచ్చినవన్నీ మంచివే కానక్కర్లేదు. ఎంచుకున్న ప్రతీ పాత్రకు నటిగా న్యాయం చేసినప్పుడు కలిగే తృప్తి అంతా ఇంతా కాదు. అంతేకాదు, పోషించిన పాత్ర మనకు పేరు తెచ్చి కెరీర్‌ని ముందుకు తీసుకెళ్లడంలో మన ప్రతిభ కనపడాలి’’ అంటోంది అందాల తార హెబ్బాపటేల్.

08/12/2017 - 21:13

నిజంగా..నిజం! బాలీవుడ్‌ని తన అందచందాలతో, నటనతో షేక్ చేసిన మాధురి దీక్షిత్ జీవితకథ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదీ.. హాలీవుడ్‌లో అంటే ఆశ్చర్యమే మరి! హాలీవుడ్‌లో బాలీవుడ్ భామల సందడి జోరుగానే సాగుతోంది. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా అక్కడి వారిని అలరించింది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇప్పుడు ఈ సీరిస్ మూడో భాగంలోనూ నటిస్తోంది.

08/12/2017 - 21:10

దర్శకుడు శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘్ఫదా’లో తళక్కున మెరిసిన కథానాయిక సాయిపల్లవి తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ‘్ఫదా’ చేసేసింది. తన పాత్రలో అడుగడునా తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించి అందర్నీ మెప్పించి చిత్ర విజయంలో ప్రధాన భూమిక పోషించింది. అంతేకాదు, విమర్శకుల నుంచి మంచి మార్కుల్ని కొట్టేసింది. ఇక తెలుగులో సాయిపల్లవికి ఎదురేలేదన్న టాక్‌ని తెచ్చుకుంది.

Pages