S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఖయాలో మేఁ

అతను
నడుస్తున్నాడు. ఆలోచిస్తూ నడుస్తున్నాడు. నడుస్తూ ఆలోచిస్తున్నాడు. అతను నడిచేది ఎవరూ లేని అడవి అయినా సరే, ఏదో ఒకటి అడ్డు వస్తుంది. చెట్టు, పుట్ట, పురుగు, పక్షి, ఏదో మేమున్నామంటూ, నడకకు, ఆలోచనకు అడ్డువస్తాయి. ప్రవాహం తెగిపోతుంది. కాళ్లు ముందుకు కదలవు. ఆ సంగతి అర్థం కాకుంటే, ఎక్కడున్నదీ పట్టకుండా, ఆలోచనలు అక్కడే కొనసాగే ప్రమాదం ఉంది. ఆలోచనలు, ఎంత దూరమయినా పోగలవు. అంతరిక్షంలోకి దూరగలవు. మాటలు కోటలు దాటుతయి, కాళ్లు తెంగెళ్లు దాటవు అని ఒక మాట ఉంది. అదుగో, అతను, ఆ సంగతి గురించే ఆలోచిస్తున్నాడు. అంతలో అతని పక్కన, రాక్షసుడులాగ వచ్చిన ఒక బస్సు క్రూరంగా, అపస్వరంతో అరిచింది. ఆలోచనలు తెగినయి. అతను ఆగిపోయినడు. ఒక్కసారి చుట్టు చూడవలసిన అవసరం తోచింది. మాటలు, కాళ్లు, తంగెళ్లు మిగలలేదు. అవి గాలిలో కలిసిపోయినయి. సీను చటుక్కున మారింది.
అతను రోడ్డు, (రోడ్ అనాలేమో?) (ఈ ఆలోచన రాస్తున్న భవదీయునిది. పెన్ అనే మాటను పెన్నుగా మార్చి తెలుగోయ్ అన్నాము. కప్, షిప్‌లు కప్పుకుపోయి తెలుగయ్యాయి. పోనిద్దురూ మరి అతను ఏం చేస్తున్నాడన్నది వదిలి మనం ఇక్కడ భాషా కార్యశాల నడిపించడం సరికాదు మరి.
అతను రోడ్ మీద నడుస్తున్నాడు, అని మాట వరుసకు అన్నా, నిజానికి రోడ్ పక్కన నడుస్తున్నాడు. అతను బస్సుకు అడ్డు రాలేదు. బస్సుకు (బస్‌కు) ఎవరూ అడ్డు రాలేదు. అలవాటు కొద్దీ నడిపిస్తున్న మనిషి హార్న్ మోగించాడు. అందులో మొరటుతనం నిండుగా ఉంది. దాన్ని మోగించడంలోనూ మొరటుతనం ఉంది. అతను ఉలిక్కిపడ్డాడు. అంత రద్దీ ఉండే దారిలో, అట్లా మతితప్పి నడవడం తప్పు గాదా? ఆ సంగతి అతనికి తెలిసిందా?
అతను చుట్టూ కలియజూశాడు. అక్కడ ఒక అంగట్లో కొబ్బరి బోండాలు అమ్ముతుంటారు. ఇవాళ కూడా అమ్ముతున్నారు గంగాబోండాలు అనే మాట గుర్తుకు వచ్చింది. ఇక్కడున్న కొబ్బరికాయలు బెంగళూరు నుంచి వస్తాయని చెపుతుంటారు. వేసవితో సంబంధం లేకుండా సంవత్సరమంతా ఈ అంగట్లో కొబ్బరి నీరు తాగవచ్చు. అయితే, ఇవాళ చూస్తే అక్కడ పలక మీద రాసిపెట్టిన ధర కొంచెం చిత్రంగా కనిపించింది. అతనికి పదిహేడు రూపాయలట. అందరూ ముందే చిల్లర లేక చస్తుంటే, ఈ పదిహేడు ఏంటి? పదిహేను సులభంగా ఇవ్వవచ్చు. మరో రెండు రూపాయల కొరకు వెతకాలి. ఈ మధ్యన రూపాయ, రెండు ఇస్తే పిల్లలు కూడా తీసుకోవడం లేదు. అయిదు రూపాయలు మినిమం. మరి ఈ బొండాం మనిషికి ఇరవయి ఇస్తే మూడు రూపాయిలు తిరిగి ఇస్తాడా? పదిహేడు ఇవ్వాలంటే, రెండు రూకల బిళ్లతో పని ముగుస్తుంది. అతను ఇరవయి తీసుకుంటే, రెండుతోబాటు మరో ఒక రూపాయ బిళ్ల కూడా ఉండి తీరవలసిందే. శివాయ, విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే, గుర్తొచ్చింది. ఈ రూపాయ, రూక, రూపాయికి ఆ పేరు ఎందుకు, ఎట్లా, ఎవరు నిర్ణయించారు? కసక్! సీన్ తెగింది. అంగట్లో అతను చేతిలో పట్టుకున్న కాయను మట్టకత్తితో తెగ నరికాడు. భయంకరం, క్రూరం, అపాయకరం! ఆ కత్తేమిటి, ఆ నరకడమేమిటి? ఆ రంధ్రం ఏమిటి, నీళ్లు తాగిన తరువాత కాయను మళ్లీ, నిలువునా రెండుగా నరకడం ఏమిటి? ఎందుకో తెలియకుండానే అతను అక్కడి నుంచి చూపులను పక్కకు తిప్పుకున్నాడు.
మరోవేపు చూచేలోగా పదిగోడు గుర్తుకు వచ్చాడు. అతను చిన్నతనంలో, బడిలో చదివే రోజుల్లో ఒక వ్యాపారిని చూచాడు. ఆ వ్యాపారి, ఇందాకటి బస్సులాగా, భారీగా ఉండేవాడు. గొంతు కూడా అంతగానూ గంభీరంగా ఉండేది. అతను ఇంటికి అవసరమయే గినె్నలు, బొచ్చెలు అమ్ముతాడు. బట్టలు కూడా అమ్ముతాడు. పాతకాలం మనిషి గనుక కొన్ని పద్ధతులు విచిత్రంగా పాటించేవాడు. లెక్కపెడుతున్నప్పుడు, ఆరు తరువాత ‘యోడు’ అంటాడు. ఏడు, అంటే ఏడువు అన్నట్టు ఉంటుందట. ఎవరినీ ఏడువు అని మనం అనగూడదు కదా! ఆహా? ఏమి లాజిక్. అతను, పదిహేడును, పదిగోడు అనేవాడు. గోడు అంటే మరేదో అర్థం ఉందని అతనికి, అంటే యోడు అనే ఆయనకి, తెలియదని, అతనికి, అంటే మన నడక మాస్టారుగారికి ఇప్పుడే అర్థం అయినట్టుంది. అతని ముఖంలో ఒక చిరునవ్వు చిందింది.
ఇంతకూ అతను ఎక్కడున్నాడు? (తనువు అంటే శరీరం. అతను అంటే శరీరం లేనివాడు అని అర్థం. ఓలీ, హోలీ, హోళీ పండుగకు కామున్ని కాలుస్తరు గదా! హోలీ అంటే ఇంగిలీషు వానికి పవిత్రం. ఓలి అనే మాటకు గూడ అర్థాలున్నాయి. ఈ రకంగా భాషాకార్యశాల పెడితే, సతనువయిన మన నాయకుడు అతను తప్పుకుపోతాడు) అక్కడే ఉన్నాడు. కొంచెం పక్కకు తప్పుకుని నిలుచున్నాడు. అతని ఆలోచనలే గానీ, కాళ్లు కదలడం లేదు. అక్కడ మెయిన్‌రోడ్ నుంచి ఒక లేన్, అంటే వీధి, అంటే గలీ, అంటే సందు, కరీంనగరం వారి సంది, మొదలవుతుంది, ఆ మూలన మిఠాయి అంగడి ఉంది. దాని మూలన టెలిఫోన్ తీగల స్తంభం ఉంది. దాని పక్కన పుల్లల స్టాండు మీద పానీపూరీ అంగడి ఉంది. అల్లదుగో, ఆ పక్కనే, వారగా, మన అతనుడు నిలబడి, ఆలోచనల్లో తేలుతున్నాడు.
పానీపూరీకి, గోల్‌గప్పా, గప్‌చుప్ అని కూడా పేర్లున్నాయి. నోరంతా తెరిచి గప్‌చుప్‌గా ఆ నీరు నిండిన పూరీని, లోపలికి నెట్టి నోరు మూసుకోవాలి, ఆ ఆలోచన అతనికి రాలేదు. అతను అట్లా ఎక్కడ బడితే అక్కడ పానీపూరీ తినడు. అంటే ఎక్కడో మరొక్కచోట తింటాడనే అనుకోవాలా? ఇప్పుడతని చూపులు పానీపూరీ మీద లేవు. మిఠాయి అంగడి మీద అసలే లేవు. ఆ పక్కనే ఉన్న మిరపకాయ బజ్జీల అంగడి వేపు అతను చూస్తున్నాడు. ఎందుకని అంత మంది అక్కడ చేరి ఆ బజ్జీలు తింటారు? అది అతని మెదడులో తిరుగాడుతున్న ప్రశ్న. ఆ రకంగా మిరపకాయ బజ్జీలు తింటే కడుపులో మండదా? ఈ మన అతను ఏమీ తినడు. అయినా కడుపులో మండుతుంది. తినకుంటే కడుపులో మండుతుంది. అది ఆకలి మంటయినా కావాలి. అసిడిటీ మంటయినా కావాలి. ఆలోచన లేకుండా రకరకాల బజ్జీలను తినే వారిని చూస్తే కడుపులో మండుతుంది. ఈ మంట మనసులో ఉంటుంది. ఠపిక్! ఏం పడింది? ఆలోచన మీద తెర పడింది.
అతను కాలుకదిపి ముందుకు సాగాడు. సందు మళ్లిన దిక్కుగా నడిస్తే, ఇంటికి చేరుకుంటడు. ఇంత త్వరగా ఇంటికి పోతే ఏం బాగుంటుంది? అసలు ఏముంటుంది? కనుక ప్రధాన మార్గం వెంటనే అతను నడవడానికి నిర్ణయించుకున్నాడని సులభంగానే అర్థమవుతున్నది. మెయిన్ రోడ్ మీద కదిలే ట్రాఫిక్‌లో కలవడానికి సందులో నుంచి బండ్లు వస్తుంటాయి. వాటిని వాహనాలు అనాలి. వియకిల్స్ అనాలి. కానీ ఇంగ్లీష్ మాట స్పెలింగ్ అట్లాగుండదు. అందుకే అందరూ వెహికిల్ అంటారు. ఈసారి భాషాకార్యశాల మనదిగాదు. అతని మెదడులో సాగుతున్నది. ఆ వచ్చే బండ్లు ఎద్దుల బండ్లయితే కూడా తప్పించుకుని ముందుకు సాగడం ఈ రద్దీలో కష్టమే. బండి అనే మాట వినగానే, అతనికి మనోఫలకం మీద పెద్ద చక్రాలుండే ఎద్దుల బండి మాత్రమే కనబడుతుంది. ఇక్కడ ఆ బండ్లు అంతగా లేవు. ఉండేవన్నీ ఇనుపబండ్లు. వాటికి ఎద్దులుండవు. కొంత నూనె పోస్తే, తమంత తాము కదులుతాయి. ఆలోచిస్తూనే అతను సందు ట్రాఫిక్ సమస్య నుంచి ముందుకు కదిలాడు.
హారన్ మోతలు మళ్లీ వినిపించాయేమో? అతను మళ్లీ చురుకుగా చూస్తున్నాడు. ఆలోచనల్లో తేలడం లేదు. అక్కడి వాతావరణాన్ని గట్టిగా పట్టించుకునే పద్ధతిగా అటుయిటు చూస్తున్నాడు. ఇక కొత్త సమాచారం బుర్రలోకి చేరుతున్నది. ఈసారి ఆలోచనలో పడితే, ఏదోచోట తట్టు తగిలి పడడం తప్పదని అర్థమయినట్టుంది. ఖాట్ లేదా కాఠ్, లేదా కట్, ఇంగ్లీష్ మాట! తెగేసెయ్!
సీన్ మారాలి. సాయంత్రం బ్యాంకు ఉండదు. బ్యాంక్, పగలయినా, రాత్రయినా అక్కడే ఉంటుంది. అందులో కర్మచారీలు, అంటే ఉద్యోగులు, అంటే కూలీలు, ఠాఠ్ (తంతారు) సిబ్బంది ఉండరు. అక్కడ లావాదేవీలుండవు. లానా అంటే తేవడం, దేనా అంటే ఇవ్వడం జరగవు, కాట్, మంచం కాదు కట్ అని అర్థం!...
*

కె. బి. గోపాలం

కె. బి. గోపాలం