S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భరోసా

మా మిత్రునితో కలిసి హోటల్‌కి వెళ్లాను. గతంలో మాదిరి కాదు. మొదట సూప్, ఆ తరువాత స్టార్టర్స్, దాని తరువాత మెయిన్ కోర్సు. అవసరమైన దానికన్నా ఎక్కువ ఆర్డర్ చేశాడు మా మిత్రుడు. చాలా మిగిలిపోయింది. ఓ వ్యక్తి హాయిగా తినేంతగా బిర్యానీ మిగిలింది.
ఆ బిర్యానీని ప్యాక్ చేసి ఇవ్వమని వెయిటర్‌కి చెప్పాను. అతను వెళ్లాడు. బిల్లు తెచ్చాడు. డబ్బులు ఇచ్చేశాం. అయినా ఆ ప్యాక్ తీసుకొని రాలేదు వెయిటర్. మా మిత్రునికి ఆ విధంగా ప్యాక్ చేసుకోవడమే ఇష్టం లేదు. అందులో వేచి ఉండటం ఇంకా నచ్చలేదు. విసుక్కున్నాడు. అయినా ఆ ప్యాక్ కోసం ఆపాను. ఆ ప్యాక్ వచ్చింది. అది తీసుకొని ఇద్దరూ మా కార్లో బయల్దేరాం.
బయట చలి విపరీతంగా ఉంది. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత రోడ్డు పక్కన ఓ వ్యక్తి కన్పించాడు. అలసిపోయినట్టుగా ఉన్నాడు. ఆ రోజు అతనికి సరిపడిన డబ్బులు దొరికినట్టు అన్పించలేదు.
కారు పక్కన ఆపి అతని దగ్గరికి బయల్దేరాను. నా మిత్రుడికి విసుగ్గా ఉంది. అన్నీ నాతో రమ్మని ఒత్తిడి చేశాను. ఆ ప్యాక్ తీసుకొని ఇద్దరమూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లాం.
ఆ వ్యక్తి అలసిపోయి ఉన్నాడు. దాదాపు అరవై సంవత్సరాలు ఉంటాయేమో. ఓ చిన్న బెడ్‌షీట్. కింద ఫ్లెక్సీ బ్యానర్. నేలపైన ఏదో పట్టా. ఏమీ తిన్నట్టుగా అన్పించలేదు.
‘్భజనం చేశావా?’ అని అడిగాను.
మావైపు అదోరకంగా చూశాడు.మా మాటలో ఏదో నమ్మకం కుదిరినట్టుంది.
‘రెండు రోజులైంది అన్నం తినక. చారుూ బ్రెడ్డు తప్ప ఏవీ తినలేదు. భోజనానికి సరిపడ డబ్బులు ఎవరూ ఇవ్వలేదు. దొరకలేదు. డబ్బులు అడుగుతుంటే అందరూ కసురుకుంటున్నారు’ చెప్పాడు.
ప్యాక్ తీసి అతనికి ఇచ్చాను. వెంటనే తెరిచాడు. బిర్యానీ చూసి అతనికి మొఖం విప్పారింది.
‘మీకు ఇది విలువైందో లేదో నాకు తెలీదు. కానీ నాకు ఇది చాలా విలువైంది. రెండు రోజులుగా ఆకలితో వున్నాను. నాకు ఆ భగవంతుని మీద నమ్మకం పోయింది. మళ్లీ నాకు నమ్మకం ఏర్పడింది. అతను నన్ను జాగ్రత్తగా చూస్తాడని అన్పిస్తుంది’ అన్నాడు.
అతని మాటలు మా మనసులని తాకాయి. రెండు రోజులుగా భోజనం లేని వ్యక్తి, ఎవరూ లేని వ్యక్తి, రోడ్డు మీద నివాసం ఉంటున్న వ్యక్తి దేవుని మీద పెట్టుకున్న భరోసా మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
మేం వృధాగా పారేద్దామనుకున్న బిర్యానీలో అతనికి దేవుడు కన్పించాడు. మాకు చిన్నదే. కాని అతనికి అది ప్రపంచం. అంతకు మించి దేవుడు.