S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సరియైన రీతిన సంసిద్ధతే సమర్థత

భగవద్గీత అంటే మేనేజ్‌మెంట్ సైన్స్. ఇది ఫిలాసఫీ క్లాస్‌లా అనిపించే సైన్స్ ల్యాబ్. ప్రయోగ ఫలితం రియలైజేషన్ అండ్ ఎనలైటెన్‌మెంట్. ఇదంతా సరికొత్త జీవితానికి సరియైన రీతిన సంసిద్ధం కావటానికే!!
మనల్ని మనం సరిదిద్దుకోగలమా? మనం వికసించి ఉన్నతం కాగలమా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పటికప్పుడు అర్రులు చాస్తూనే ఉన్నాం. ప్రయత్నాలతో కాక నిరీక్షణలతోనే జీవితాలు కరిగిపోతున్నాయి.
మనం సెల్ఫ్ అసెస్‌మెంట్, సెల్ఫ్ మేనేజ్‌మెంట్, సెల్ఫ్ డెవలప్‌మెంట్ అంటూ ఆంగ్లీకరింపబడుతున్నాం. మనవి రానురాను ఇంగ్లీషు చదువులు అయిపోతున్నాయి కాబట్టి, ‘పర’వ్యామోహం ఎక్కువయిపోతోంది కాబట్టి మనకు మనమే ‘పరాయి’ అయిపోతున్నాం. ఫలితంగా సమస్యలు, సమాధానాలు సైతం పరం నుండి దిగుమతి కావలసిందే.
అవును, మనవే అనిపిస్తున్న సమస్యలు మనవి కావు. అనేక కోణాల అవి మన జీవితాలలోకి దిగుమతి అయిపోతున్నాయి కాబట్టి సమస్యలకు పరిష్కారాలు సైతం మాతృసాహిత్యం నుండి కాక మాతృ సంస్కృతి నుండి కాక పరాయి సాహిత్యం, పర సంస్కృతి నుండి అంది వస్తేనే మహదానందం!
ఈనాటి జీవన ఘర్షణ మన స్వంతం కాదు.. ఈనాటి లక్ష్యాలు మన స్వంతం కాదు. మన బ్రతుకులు, మన జీవన విధానాలు ఘర్షణలోను, సంఘర్షణలోను ప్రపంచీకరణ మత్తులోనే ఉన్నాయి. ఒక విధంగా వెస్టర్న్ మేనేజ్‌మెంట్‌ను ఆశ్రయించిన కార్పొరేట్ లీడర్‌షిప్ మనదవుతోంది. చివరకు యాక్షన్ అండ్ రిజల్ట్ అంటే అర్థమైనంత స్పష్టంగా ఆచరణ - ఫలితం అంటే అర్థంకాని స్థితిలో మనం ఉన్నాం. కారణం యాక్షన్ మన స్వంతమైంది కావటం లేదు.. రిజల్ట్ కూడా మన స్వంతమే అనుకునే అవకాశం లేకుండా పోతోంది.
మన కార్యాచరణలు మన మనసు నుండి అంటే ఇండియనైజ్డ్ సైక్ నుండి పుట్టుకొచ్చినవి కావు కాబట్టి అవి పుట్టుకొచ్చిన సంస్కృతి నుండే మార్గాలను వెతుక్కుంటున్నాం. వాస్తవానికి ఇలా ఎంతలా వెతుక్కుంటున్నా నాయకత్వ లక్షణాలు మాత్రం పుట్టుకొచ్చేది మన స్వభావం నుండే. దాని రంగులు పరానివి కావచ్చు. గోడ బలంగా ఉంటే అది మట్టి గోడనా, సిమెంట్ గోడనా, రాతి గోడనా అని ఎవరూ చూడరు. రంగు ఆకర్షణకే తప్ప స్థితంగా ఉండటానికి కాదు. కాబట్టి నాయకత్వానికి కావలసింది ‘స్థితప్రజ్ఞ’. ఈ ‘స్థితప్రజ్ఞ’త గురించి భగవద్గీత తెలియజేసినంతగా మరే గ్రంథమూ విశదీకరించలేదు.
నాయకత్వానికి కావలసింది మీనింగ్‌ఫుల్ మేనేజ్‌మెంట్. అర్థవంతమైన నాయకత్వం సాధ్యమయ్యేది గీతా రహస్యాలను అర్థం చేసుకోగలిగితేనే. ప్రస్తుతం మనం ఉన్నది కార్పొరేట్ కల్చర్‌లో కాబట్టి గీతా రహస్యాలను కొత్త కోణంలో ఆవిష్కరించుకోవలసిందే. అంటే గీతను అంతరంగ అవలోకనంతో దర్శించాలి. అప్పుడే సెల్ఫ్ మాస్టరీ సాధ్యవౌతుంది. మనకు మనంగా నాయకులం కాగలుగుతాం. వాస్తవానికి మనల్ని మనం మేనేజ్ చేసుకోవాలి.. మన వర్గాన్నీ మేనేజ్ చేయగలిగితేనే మనది సమర్థ నాయకత్వం అవుతుంది. కారణం కామన్ ప్లాన్, కామన్ పర్పస్, కామన్ పాలసీ, కామన్ ప్రాక్టీస్ సాధ్యమైతేనే లీడర్‌షిప్ రాణిస్తుంది.. పాపులర్ అవుతుంది.
బలాలు, బలహీనతలు తెలిసి ఉండాలి
అబ్జర్వేషన్ సాధ్యమైన తావులనే బలాలు, బలహీనతలు తెలిసివచ్చేది అనటానికి కురుక్షేత్రంలో అర్జునుడి అస్త్ర సన్యాస ఘట్టమే మంచి ఉదాహరణ. మన ప్రేమ స్వార్థపూరితం కాకూడదు. మన కార్యాచరణ స్వార్థరహితం కావాలి. మన ఆలోచన జ్ఞానప్రపూర్ణం కావాలి. ‘చెడు’ను తొలగించటానికి స్వ-పరాల ప్రసక్తి అనవసరం.
ఆధర్మాన్ని ఆశ్రయిస్తే ఎంతటి నాయకుడైనా ఏదో ఒకనాడు అనాథ కావలసిందే! ధర్మాన్ని కాపాడగలిగితే ఏనాటికైనా ఎటువంటి సమాజమైనా అక్కున చేర్చుకోగలుగుతుంది. కాబట్టి నాయకత్వంలో ధర్మ సంస్థాపనే విజన్ అండ్ మిషన్ కావాలి. నాయకత్వం అంటే కేవలం మేనేజ్‌మెంట్ మాత్రమే కాదు.. అది క్వాలిటీ మేనేజ్‌మెంట్ కావాలి. ఇక్కడ క్వాలిటీ అంటే నాణ్యమైన ప్రతిభ అని కాదు.. సమర్థవంతమైన ప్రతిభ అని. అంటే నాయకత్వం విషయంలో సమర్థతే నాణ్యత అవుతుంది.
లైఫ్ ఈజ్ ఎమోషనల్.. అయినా గెలవాల్సిందే! అన్న కృష్ణ సందేశం గీత ప్రారంభంలోనే అందుతుంటుంది. అసలు సిట్యుయేషనల్ లీడర్‌షిప్ అవసరాన్ని తెలియజేస్తూ కృష్ణోపదేశం సాగుతుంటుంది. పద్దెనిమిది అధ్యాయాలలో పరుచుకున్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సిట్యుయేషనల్ లీడర్‌షిప్‌లలో కారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీలు అంతర్లయలైపోతాయి.
స్వభావసిద్ధమైతేనే సంసిద్ధి
‘స్వకర్మ నిరతస్సిద్ధిం’ అనీ, ‘కర్మణ్య భిరత స్సంసిద్ధిం లభతే’ అనీ అంటుంది గీత. అంటే కర్మాచరణ మన ఆసక్తికి అనుగుణంగా ఉండాలి. నిరాసక్తతతో కర్మాచరణ కూడదు. స్వభావసిద్ధతతో, ఇష్టపూర్వకంగా చేసే పనులవల్లే సంసిద్ధి సాధ్యం. పైగా కర్మాచరణను కర్తవ్యంగా పరిగణించటం ముఖ్యం. కర్మాచరణ అంటే కర్తవ్య పరాయణత అనే. దీనివల్ల అంతఃకరణం మాలిన్య రహితం అవుతుంది. నిష్ఠాగరిష్ఠం అంటే అర్థం ఇదే! ఒక్కమాటలో చెప్పుకోవాలంటే అంతఃకరణ శుద్ధితో స్వధర్మానుగుణంగా వర్తించటం వల్ల సంసిద్ధి సాధ్యమవుతుందంటుంది గీత.
ఎంతటి కార్పొరేట్ వరల్డ్‌లో ఉన్నా, వ్యాపార సంస్కృతిలో ప్రాణం పోసుకుంటున్నా మన అంతర్వర్తనం, బాహ్య వర్తనం కలిసి పరిణమిస్తేనే మనకు మనమే నాయకులం కాగలిగేది.. సమర్థులం కాగలిగేది. మనం ‘పర్ఫెక్ట్’ కావాలంటే మనకు మనం ‘రెస్పాన్సిబుల్’ కావలసిందే. దీనే్న మనం ‘ట్రూ టు ఒన్ సెల్ఫ్’ అని అంటుంటాం. అంటే మనల్ని మనం మోసపుచ్చుకోకపోవటం.. మనల్ని మనం కప్పిపుచ్చుకోకపోవటం.
మనల్ని మనం ‘కవర్’ చేసుకోవటం నాయకత్వ అంశనే కావొచ్చు.. అలాగని ‘డిసీవ్’ చేసుకోవటం నాయకత్వ లక్షణం కాదు.
‘యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే’
అన్న గీతను బట్టి అర్థమయ్యేదేమిటంటే పదుగురు మనల్ని అనుసరించాలంటే మనం సెల్ఫ్ వాల్యూస్‌ను గౌరవించాలి.
వ్యామోహం కాదు... వివేకం ముఖ్యం
‘న కర్మణా మనారంభాన్నైష్కర్మ్యం పురుషోశ్నుతే
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి’
కార్యాచరణ అంటే ఏదో చేసుకుంటూ పోవటం కాదు.. బాడీ ప్రెజంట్ మైండ్ ఆబ్సెంట్ కాదు.. ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటేనే కార్యాచరణ అగ్రెసివ్ యాక్షన్ అవుతుంది. మెకానికల్‌గా చేయటం కొన్ని పనులకే పరిమితం.. వాటిల్లో కూడా ప్రెజన్స్ అనేది ఎంతో కొంత అవసరమే. మైండ్‌ఫుల్ కానపుడు కార్యాచరణ అనేది ఇన్‌యాక్షన్ అవుతుంది. ఫలితం కూడా అంతంత మాత్రమే. వ్యక్తిగత తృప్తి కూడా అంతంత మాత్రమే. చేసే పనులలో ప్రయారిటీని, ప్రాధాన్యతను పసిగట్టలేకపోతే ప్రొయాక్టివ్ - సుముఖం - కాలేం. యాక్టివ్‌గా లేకపోతే ఫలితం శూన్యమే. అంటే క్రియాశూన్యత వల్ల నష్టం మనకే!
కార్యాచరణలో నడుం బిగించకపోతే మైండ్ అవసరమూ ఉండదు. అలాగని మిన్నకున్నా మందగమనం మైండ్‌ని చేరి నిష్ప్రయోజకత్వమే మిగులుతుంది. కాబట్టి వివేచనతో కార్యాచరణకు దిగితేనే సత్ఫలితం. లక్ష్యశుద్ధి ఉండాలే తప్ప వ్యామోహం పనికిరాదు. వ్యామోహం వల్ల వివేకం నశించి మూఢత్వమే మిగులుతుంది. అందుకే కృష్ణుడు ‘న ద్వేష్టి నకాంక్షతి’ అని అర్జునుడితో అంటాడు. ద్వేషించటం, కాంక్షించటం నాయకత్వ లక్షణాలు కాదని, అవి ఫలప్రాప్తి విషయంలో అవరోధాలని కృష్ణ ఉవాచ.
మొత్తానికి అంతరంగ వివేకం, బాహిర కార్యాచరణ అనేవి కర్మయోగి లక్షణాలు.. ఇక్కడ కర్మయోగి అంటే వర్కోహాలిక్. కార్యమగ్నత అన్నది నాయకత్వ లక్షణమే. అందుకే అంటుంటాం.. తెలివిలేక కార్యాచరణకు పూనుకున్నా సత్ఫలితాలు అందవు... తెలివి ఉండీ కార్యాచరణలో ఆసక్తి లేకపోయినా సత్ఫలితాలు అందవు - అని.

- సౌభాగ్య, 9848157909

కథాసాగరం
యయాతి

చీన కాలంలో జీవితం సరళంగా ఉండేది. మరో ప్రపంచం కూడా మరీ అంత దూరంగా ఉండేది కాదు. యయాతి చక్రవర్తికి వందేళ్లు వచ్చాయి. జీవితంలో అన్నీ అనుభవించాడు. వందమంది కొడుకులు. అప్పుడు మృత్యువు అతని దగ్గరకు వచ్చింది. నువ్వు సంపూర్తిగా జీవించావు. ఇక చాలు నాతో పాటురా వెళదాం అంది. యయాతి ‘నేను కేవలం వంద సంవత్సరాలు మాత్రమే బతికాను. అంతే. నువ్వేమో చెప్పా పెట్టకుండా వచ్చేశావు. కొంత సమయమివ్వాలి. నా కోరికలింకా తీరలేదు. నాకు సంపూర్తిగా తృప్తి కలగలేదు. జీవితం పట్ల మమకారం ఇంకా మిగిలే ఉంది. నాలో వాంఛలు మిగిలే ఉన్నాయి. వాటిని రేపటికి రేపటికంటూ వాయిదా వేస్తూ వస్తున్నాను. మరి నువ్వు నన్ను తీసుకుపోతే అవి అలాగే అసంపూర్తిగా మిగిలిపోతాయి’ అన్నాడు.
మృత్యువు ‘నేను వచ్చాను. వట్టి చేతుల్తో తిరిగి వెళ్లను. నీ బాధ చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతోంది. నువ్వు అంతగా అడుగుతున్నావు గనక నీకు ఇంకో వంద సంవత్సరాల వయసిస్తాను. కానీ ఎవరయినా తమ యవ్వనాన్ని నీకు ఇచ్చి నీ వృద్ధాప్యాన్ని వాళ్లు స్వీకరించడానికి సిద్ధపడితేనే అది వీలవుతుంది’ అన్నది.
యయాతి అదెంత పని అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు వంద మంది కొడుకులు. తండ్రి కొరకు ఆ మాత్రం త్యాగం చేయలేరా? అనుకున్నాడు. కొడుకులందర్నీ సమావేశపరిచాడు. మృత్యువు తన కోసం రావడం తన కోరిక మన్నించి వందేళ్లు ఇవ్వడం, తన వృద్ధాప్యాన్ని ఎవరయినా తీసుకుంటే వాళ్ల యవ్వనం తనకు సంక్రమిస్తుందని అనడం వివరించాడు. కొడుకులందరూ ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ల మనసుల్లో రకరకాల ఆలోచనలు కదిలాయి. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించిన తమ తండ్రికే జీవితం పట్ల అంత మమకారముంటే జీవితం ఇప్పుడిప్పుడే మొదలయిన తమకెంత ఉండాలి? అని వాళ్లు అనుకున్నారు. వౌనంగా ఉండిపోయారు. ఎవరూ ముందుకు రాలేదు.
అందరికన్నా చిన్నవాడయిన యయాతి కొడుకు ముందుకు వచ్చి తన యవ్వనాన్ని తండ్రికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కారణం అతను ఆలోచించాడు ‘మా నాన్న వంద ఏళ్లు బతికినా బతుకు పట్ల మమకారంతో తపిస్తున్నాడు. అంటే జీవితంలో సంతృప్తి అన్న మాటకు అర్థం లేదు. జీవితం ఎండమావి లాంటిది. జీవితం నిష్ఫలమైంది. అసలు సంతృప్తికి ఇది మార్గం కాదు. కాబట్టి నా యవ్వనాన్ని నా తండ్రికి ఇస్తాను’ అని తీర్మానించుకుని తన యవ్వనాన్ని తన తండ్రికి ఇచ్చాడు. తండ్రి వృద్ధాప్యాన్ని తను తీసుకున్నాడు.
వందేళ్లు గడిచాయి. అప్పుడు మళ్లీ మృత్యువు ప్రత్యక్షమయింది. గతించిన వందేళ్లలో, తరువాత కొడుకు నించీ తీసుకున్న వందేళ్ల జీవితంలో ప్రతి కోరికా అలాగే మిగిలి ఉంది. ఏ కాంక్షా అదృశ్యం కాలేదు. ఒక కోరిక తీరిందనుకునేంతలో ఇంకో కోరిక మొదలవుతోంది. దీన్నిబట్టి కోరికలు అనంతమన్న సంగతి, వాటికి మరణం లేదన్న సంగతి తెలుస్తోంది. అందుకే మరణం అన్న వరాన్ని భగవంతుడు మనిషికిచ్చాడన్న సంగతి యయాతి గుర్తించాడు.
ఇనే్నళ్లు తన వృద్ధాప్యాన్ని మోసిన తన చిన్న కొడుకు చిన్నతనంలోనే జ్ఞానం గ్రహించాడని తెలుసుకుని తన వృద్ధాప్యాన్ని తను స్వీకరించి మృత్యువుతోపాటు యయాతి మృత్యులోకానికి వెళ్లాడు.

మీకు మీరే డాక్టర్

షుగరు వ్యాధిలో మెదడు సంరక్షణ

- డా. జి.వి.పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642
ఔఖూశ్ఘష్ద్ఘశజూపభఘౄజ.ష్యౄ

ఫ్రశ్న: నా వయసు 65 ఏళ్లు. 90 కిలోల బరువు. పాతికేళ్లుగా షుగరు వ్యాధితో బాధపడ్తున్నాను. రానురానూ జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. మనసుకు సంతోషం ఉండట్లేదు. నివారణ చెప్పగలరు.
జ: అగ్ని, వాయువు తోడైతే దావానలం వ్యాపిస్తుంది. వీటికి తోడు వరద ప్రమాదాలు కూడా చేరితే పరిస్థితి ఊహాతీతం అవుతుంది. షుగరు వ్యాధి వాయువు లాంటిది. బీపీ వ్యాధి అగ్ని. స్థూలకాయం వరద ప్రమాదం లాంటిది. ఈ మూడు కలిస్తే ఉప్పెన పెనుముప్పులా ముంచుకొస్తుంది. అందుకే, స్థూలకాయం, షుగరూ, బీపీ ఉన్నవారు ఇతరులకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ మధుమేహ అధ్యయన సంస్థ వారి జర్నల్ జ్ఘఇళఆ్య్యజ్ఘ లో ఇటీవల ఫ్రచురించిన వివరాల్లో స్థూలకాయుల్లో వచ్చే షుగరు వ్యాధి వలన మెదడుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదని స్పష్టంగా పేర్కొన్నారు.
రక్తంలో షుగరు స్థాయి కంట్రోల్లో ఉండటం అవసరమే! కానీ, షుగరు కంట్రోల్లో ఉన్నంత మాత్రాన శక్తి ఉత్పత్తి బ్రహ్మాండంగా జరిగినట్టు కాదు కదా! శక్తి ఉత్పత్తి తగ్గినందువలన శరీరంలో శక్తి సరఫరా కూడా తగ్గుతుంది. శరీరంలో గుండుసూది మొన మోపినంత మేరకు కూడా శక్తి తగినంత అందాలి. ఉత్పత్తి తగ్గితే సరఫరా తగ్గి అణువణువూ శరీరంలో శక్తి హీనం అవుతాయి. షుగరు వ్యాధి దీర్ఘకాలంగా ఉన్న వారిలో అనేక ఉపద్రవాలు రావటానికి ఇది ముఖ్య కారణం. షుగరు కంట్రోల్లోనే ఉన్నా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని దీన్నిబట్టి అర్థం చేసుకోవాలి.
పంచజ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, నాలుక, చెవులు, చర్మం వీటి మీద తొలి ప్రభావం కనిపిస్తుంది. పోనుపోనూ ముఖ్య అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల్లాంటివి చెడటం మొదలౌతాయి. ఇప్పుడు కొత్తగా శాస్తవ్రేత్తలు చేస్తున్న హెచ్చరిక మెదడు కూడా త్వరగా దెబ్బతింటుందని! అందుకే ‘ఏ బాధ కలిగినా మీకు షుగరు ఉన్నది కదా! సైడ్ ఎఫెక్టులు తప్పవు’ అనటం డాక్టర్ల నుంచి తరచూ వింటూ ఉంటాం.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే షుగరు వ్యాధిని గుర్తించిన మొదటి రోజు నుండే తగిన జాగ్రత్తలకు అలవాటు పడగలిగితే ఇవ్వాళ వచ్చే సైడ్ ఎఫెక్టులను రేపటికి వాయిదా వేయటానికి అవకాశం ఉంటుందని!
షుగరు వ్యాధి కారణంగా మెదడు పైన కలిగే వత్తిడి వలన డిమెన్షియ ఏర్పడే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. మెదడు శక్తిహీనం కావటం, మతిమరుపు, ఆందోళన, దిగుళ్లతో కూడుకున్న లక్షణాలు ఏర్పడతాయి. ఇన్సులిన్ పని చేయకపోవటం, రక్తంలో షుగరు పెరిగిపోవటం, సున్నితమైన కండరాల్లో వాపులు ఇవి డిమెన్షియాకు దారితీయవచ్చు. ఇవి స్థూలకాయంతో ముడిపడి ఉండటాన్ని శాస్తవ్రేత్తలు ప్రత్యేకంగా గుర్తించారు. శారీరకంగా, మానసికంగా, నరాల పరంగా అనేక లక్షణాలు కలగటానికి ఊబకాయం కారణం అవుతుందని ఈ పరిశోధన సారాంశం.
ఇప్పుడు మధుమేహ వ్యాధి బారిన పడిన రోగులు అన్నింటికీ మందులతో పరిష్కారాన్ని కొనుక్కోవచ్చనే ఆలోచన వదిలేసి జాగ్రత్తలు పాటించటం మంచిది.
‘రాజ భోజనాలు శవపేటికలను నింపటానికే’ (జ్ఘూళ జూజశశళూఒ ఛిజ ష్యచిచిజశఒ) అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. ఆహార వ్యామోహం అసలుకే మోసం తెస్తుంది. ఇతర వ్యామోహాలకన్నా ఆహార వ్యామోహం ప్రమాదకరమైంది.
కంప్యూటర్లో వైరస్ చేరినప్పుడు అనవసర యాపులన్నిటినీ డౌన్‌లోడ్ చేసుకోమని అడ్డుపడుతూ ఉంటుంది. స్థూలకాయుల పేగుల్లో కూడా ఒక ప్రత్యేకమైన సూక్ష్మజీవి కంప్యూటర్ వైరస్‌లానే ఏది కనిపిస్తే అది తినాలని కోరికని ప్రేరేపిస్తుందని కొత్త పరిశోధనాంశం ఒకటి ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది. శరీర యంత్రాంగాన్ని చెడగొట్టడమే ఈ క్రిమి లక్ష్యం. అనారోగ్యకర వంటకాలను చూడగానే కొవ్వు కణాలను ప్రేరేపించి, ఎక్కువ ఆహారం కోసం మెదడుకు సిగ్నల్స్ పంపేలా చేస్తుంది. ఇంకో ముద్ద అదనంగా తినాలనే కోరికని పెంచుతుంది. నెరుూ్య, నూనె, పులుపు, తీపి, ఉప్పు వీటి మీద మనలో ఎక్కడలేని వ్యామోహాన్నీ రేకెత్తించే అంశాలు. స్థూలకాయుల్లోనూ, షుగరు వ్యాధి వచ్చిన వారిలోనూ ఈ వ్యామోహాన్ని జయించగలగటమే అసలు పరిష్కారం. మనోబలమే యాంటీ వైరస్‌లా పనిచేస్తుంది.
మెదడు అనేది శరీరం మొత్తం బరువులో 2% మాత్రమే ఉండగా అది గుండె నుంచి బయటకు వచ్చే శుద్ధ రక్తంలో 15 శాతాన్ని, శరీరం మొత్తం తీసుకునే ఆక్సిజన్‌లో 20 శాతాన్నీ, అలాగే శరీరం మొత్తం వినియోగించుకొనే గ్లూకోజులో 25 శాతాన్నీ ఉపయోగించుకుంటోంది. శరీరంతో చేసే వ్యాయామం కన్నా మెదడు శ్రమకు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. మెదడుకి మనం పని చెప్పే కొద్దీ అది శరీరంలో శక్తిని తీసుకొని ఖర్చు చేస్తుంది. ఆ విధంగా చురుకైన ఆలోచనా శక్తి మధుమేహాన్ని అదుపులో పెట్టేందుకే తోడ్పడుతుంది.
ఆందోళనలు, దిగుళ్లు మెదడు శక్తిని హరిస్తాయి. షుగరు, స్థూలకాయం పెరగటానికి కారణం అవుతాయి. చింతా శోక భయ దుఃఖాదులన్నీ తక్షణం వాతాన్ని పెంచుతాయని ఆయుర్వేదం చెప్తుంది. మనసుకు సంతోషం, సంతృప్తి కలిగించని అంశాలన్నీ ఈ వ్యాధిని పెంచుతాయనే దీని అర్థం. మనసుదే ఇందులో ప్రముఖ పాత్ర. దాన్ని వ్యాధి నివారణకు అనుకూలంగా సన్నద్ధం చేసుకోవాలి.
స్థూలకాయం పెరగటానికి, షుగరు వ్యాధి పెరగటానికి, వీటికి రక్తపోటు కూడా తోడు కావటానికి వ్యక్తి జీవన విధానం ముఖ్య కారణం అవుతుంది.
లైఫ్ స్టయిల్ అనే మాట వెనుక చాలా అర్థాలున్నాయి. అపకారం చేసే రుచుల మీద వ్యామోహంతోనూ, మానసిక వత్తిడులతోనూ, అసంతృప్తితోనూ, దిగుళ్లు ఆందోళనలతోనూ రోజులు సాగుతుంటే, ఎంత విలాసవంతమైన సౌకర్యాలతో జీవిస్తున్నా మెదడుకు తిప్పలు తప్పవు.
శరీర సౌకర్యాలకన్నా మానసిక సౌకర్యాలకు ప్రాధాన్యత నివ్వాలి. తిళ్లు, వత్తిళ్లు ఇవి రెండూ షుగరు, స్థూలకాయాలకు ముఖ్య ప్రేరకాలు. ఈ రెండింటినీ ఎంత అదుపు చేసుకోగలిగితే మెదడు అంత శక్తిమంతంగా ఉంటుంది. షుగరు వ్యాధి అంత అదుపులో ఉంటుంది.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946