S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సవారి

ఆశలు, ఆకాంక్షలు అన్నీ హద్దుల్లేని ప్రాంతం వైపే సాగిపోవాలని ఈ తరం తహతహలాడుతోంది. రాకెట్లు, విమానాలు, కార్లు, అధునాతన ప్రయాణ సాధనాలు సౌకర్యాన్నిస్తూనే ఉన్నాయి. అయినా.. ఎంత పెద్ద వారైనా ఓ సైకిల్ కనిపిస్తే చిన్నపిల్లల్లా మారిపోతారు. అదే సైకిల్‌లోని మహత్తు. ‘కవర్‌స్టోరీ’ సామాన్యుని సవారి చదువుతూంటే మళ్లీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నట్టనిపించింది. చక్కటి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
అదృశ్యం
‘నమ్మండి ఇది నిజం’ శీర్షికన అందిస్తున్న కథనాలు చదువుతూంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతున్నాయి. హాస్పిటల్ నించి వింటర్‌టన్ పారిపోయాక వీధుల్లో ఎక్కడైనా మరణించాడా? లేదా జీవించి ఇంకెక్కడికైనా వెళ్లాడా? హసన్ తన ఆలోచనలని అతని మీద కేంద్రీకరించినా అతని సూక్ష్మ శరీరం మళ్లీ కనపడలేదు. వింటర్‌టన్ ఏమయ్యాడో దేవుడికే తెలియాలి. ఇది నిజంగానే అద్భుతం.
-కె.లావణ్య (కాకినాడ)
అమృతవర్షిణి
‘అమృతవర్షిణి’ శీర్షిక ద్వారా సంగీత మహనీయుల గురించిన విశేషాలను అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు. నారుమంచి సుబ్బారావు గారి జ్ఞాపకాలను చదివి భావోద్వేగానికి లోనయ్యాం. తెనాలి సుబ్బారావుగా జగత్ప్రసిద్ధం అయిన నారుమంచి వారు వృత్తిరీత్యా న్యాయవాది అయినా, త్యాగరాజు స్వామిపై వున్న అభిమానంతో తెనాలి పట్టణంలో సీతారామ గానసభను ప్రారంభించి, స్వంత ఖర్చులతో అనేక సంగీత కచేరీలను ఏర్పాటు చేసి సంగీతం ద్వారా భగవంతునికి ఎలా సేవ చేసుకోవచ్చునో నిరూపించారు. ఆనాటి సంగీత కచేరీలలో శ్రోతలు ధ్యానమగ్నులై ఉండేవారని, నారద తంబురాదులతో పాటు దేవతలందరూ దివి నుండి భువికేగి ఆ సంగీత మాధుర్యంలో ఓలలాడినట్లుగా అనిపించేదని నాటి తరం పెద్దలు నేటికీ చెప్పుకుంటూ ఉంటారు. నారుమంచి వారి సంగీత సేవను స్ఫూర్తిగా తీసుకొని నేటికీ అసంఖ్యాకులు తెనాలి పట్టణంలో సంగీత సభలు ఏర్పాటు చేస్తూ ఉండటం గమనించాల్సిన విషయం. సంగీతాభిమానులందరికీ నారుమంచి వారు మార్గదర్శకులు, గురుతుల్యులు.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
బుర్ర చించుకుని...
‘లోకాభిరామమ్’ శీర్షికలో గోపాలం గారు అందిస్తున్న వ్యాసాలు ఆలోచింపజేసేవిగానూ, ఆయా అంశాల్తో మమేకమై పోయేట్టుగానూ ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ఈ శీర్షిక పంథా మార్చుకొందని తెలుస్తోంది. ‘బుర్ర చించుకుని..’ వ్యాసం చదివితే ఆ విషయం అర్థమవుతోంది.
-ఆర్.కె. (హైదరాబాద్)
నిజం
సైకిల్ పాఠాన్ని జీవితానికి అన్వయించి చెప్పిన ‘సండే గీత’ ఆలోచింపజేసింది. జీవితంలో పెద్ద వాళ్ల రక్షణ, సలహాలు కొంతకాలం ఉన్నా తర్వాత వారి అవసరం లేకుండా జీవితాన్ని ఎదుర్కోవాలనడంలో ఎంతో నిజం ఉంది. పాట గొప్పదనం వివరిస్తూ రాసిన ‘పాటను చంపలేరు’ కవిత మాకెంతో నచ్చింది. ‘భ్రష్టుడా! పాటెప్పుడూ బతికే ఉంటుంది. అందరి ఉసురు తగిలి నీవే చస్తావ్’ అన్న భావం చాలా బాగుంది. సంగీత లోకానికి వెలుగు దివ్వెలైన వారి పరిచయ వాక్యాలు సంతోషాన్నిచ్చాయి.
-డి.అభిలాష (సాంబమూర్తినగర్)
విలువ
పసుపులో ఉండే అనేక ఔషధ గుణాలను, ఎలా వాడాలో ‘మీకు మీరే డాక్టర్’ శీర్షికలో చక్కగా వివరించారు. పూర్వకాలంలో, ఇంకా ఇప్పుడు పల్లెటూళ్లల్లో పేరంటానికి వచ్చిన ముతె్తైదువుల పాదాలకు తడి చేసిన పసుపు రాసేవారు. సువాసినులు ప్రతిరోజూ పసుపు రాసుకునేవారు. కారణం వారు ఇంట్లో ఎక్కువగా తడినేల మీద గడుపుతూంటారు. ఇందువల్ల కాళ్లకు పుళ్లు పడవు. వంటకాల్లో పసుపు వాడటం కూడా కద్దు. పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగిస్తే జలుబు, ఇతర శారీరక రుగ్మతలు నివారించబడతాయనేది అనాదిగా వినిపిస్తున్న వాస్తవం. ఉడుకు నీళ్లల్లో పసుపు వేసి ఆవిరి పడితే తలభారం తగ్గుతుంది. ఈ పసుపులో అనేక సుగంధ ద్రవ్యాలు కలిపి ట్యూబుల్లో నింపి ముఖానికి రాసుకునే క్రీములను తయారుచేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. అన్ని కాస్మొటిక్స్‌లోనూ పసుపు ప్రధాన మూలిక అని నేటి తరానికి అంతగా తెలియదు. అవాంఛిత రోమాలను నివారిస్తుంది కూడా. అందానికి, ఆరోగ్యానికి పసుపు వాడకం మంచిదని స్ర్తిలు తెలుసుకోవాలి. ఈ శీర్షిక మాకెంతో ఉపయుక్తంగా ఉంటోంది.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
హాయి
మన ఆర్థిక సామాజిక వ్యవస్థల్ని ప్రభావితం చేసే వానల గురించి వివరించిన కవర్‌స్టోరీ మాకెంతో నచ్చింది. చిటపట చినుకుల్లో తడుస్తూ నృత్యం చేసినంత హాయిగా అనిపించింది వ్యాసం చదివితే. ప్రకృతి అందాలన్నీ ఒకేచోట ఆరబోసినట్టుగా ఉండే అరకు సోకులకు అద్దాల రైలుబండి అదనపు సోకు. వ్యాసం చదివాక వెంటనే ఆ రైలు ఎక్కాలనిపించింది. పోలీసులకన్నా సమర్థంగా కిడ్నాపర్‌ల స్థావరాన్ని కనుగొని అందులో ఒకనిని తను చంపి మిగిలిన వారిని పోలీసుల చేత చంపించి కొడుకుని రక్షించుకున్న ‘అన్నిటా సమర్థుడు’ కోవెట్ కథ చాలా బాగుంది.
-ఆర్.శాంతిచంద్రిక (సామర్లకోట)
ప్రత్యేకత
‘మీకు తెలుసా’లో రంగు మారితే ఈడొచ్చినట్టే, పూడుల్ జాతి శునకాల ప్రత్యేకతలు ఆకట్టుకొన్నాయి. శేఖర్ జోసెఫ్ మొదట చిలుకల నేస్తం తర్వాత బర్డ్‌మాన్ ఆఫ్ చెన్నై అయిన విశేషాలు అలరించాయి. వయసు మళ్లిన ఒక భర్త భార్యను హత్య చేయించి ప్రేయసిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, కిరాయి హంతకుని నియమించి ఫీజు చెల్లించడం, ఆ కిరాయి హంతకుడు అతని ప్రేయసితో ఉడాయించడం భలే తమాషాగా ఉత్కంఠభరితంగా ఉంది క్రైం కథ. అన్నం బాగా పిసికి ఉండలా చేస్తే దానిలోని జిగురు ఎండిపోయాక ఉండ గట్టిపడి బంతిలా తయారవుతుంది. కింద పడేస్తే బంతిలా పైకి లేస్తుంది. ఈ చర్యకూ ప్లాస్టిక్‌తో సంబంధం లేదు.
-బి.చంద్రిక (రాజేంద్రనగర్)