S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గాయపడ్డ పిచ్చుక

మాఇంట్లో గోడలకి ఫొటోఫ్రేమ్‌లు ఎక్కువగా వుండేవి. వాటి వెనక పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేవి. వాటి నుంచి అప్పుడప్పుడు వాటి గ్రుడ్లు క్రిందపడి పగిలిపోయేవి. ఒక్కోసారి పక్షి పిల్లలు కూడా క్రింద పడేవి. తల్లి పిచ్చుక వాటి చుట్టూ తిరిగి వాటిని తిరిగి పైకి తీసుకొని వెళ్లేవి. కొంత పెద్దగా అయిన పక్షులు కూడా క్రిందపడేవి. అవి పైకి ఎగరడానికి ప్రయత్నం చేసేవి. ఎవరైనా కొంత సహాయం చేస్తే పైకి ఎగిరిపోయేవి.
ఒకసారి ఓ చిన్న పిచ్చుక అలాగే క్రింద పడింది. ఓ రెండు రెక్కలు కూడా క్రింద పడిపోయాయి. అది ఎగరడానికి విఫల ప్రయత్నం చేస్తూ కన్పించింది. దాని రెక్కకు గాయమైంది.
చాలా కష్టంగా అది ఎగరడానికి ప్రయత్నం చేస్తూ కన్పించింది. దాన్ని చూస్తే జాలేసింది. దాన్ని నా చేతిలోకి తీసుకొని పైకి ఎగరడానికి తోడ్పడినాను.
అది సరిగ్గా ఎగరలేకపోయింది.
ఎగరడంలో కూడా కొంత కుంటినట్టు అన్పించింది. కాని అది ఆకాశంలోకి ఎగిరింది.
ఆశ్చర్యం
ఆనందం.
నాలో కలిగాయి.
ఆ పిచ్చుక మీద నేను చూపించిన సానుభూతి స్థానంలో ఉత్సాహం వచ్చింది.
ఆ చిన్న పిచ్చుక దాని గాయాన్ని నెపంగా తీసుకొని నేల మీదనే ఉండటానికి ప్రయత్నం చేయలేదు.
ఆ పిచ్చుకలాగే మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. మనం ఎగరకుండా అంటే ముందుకు వెళ్లకుండా ఉండటానికి లక్ష కారణాలు ఉండవచ్చు. అవి పెద్ద కారణాలు కూడా కాకపోవచ్చు.
మనలో బాధ ఉండవచ్చు.
ఎంతో కొంత వేదన ఉండవచ్చు.
మన లోపాలు మనకి ఆటంకాలుగా కన్పించవచ్చు. అవి సహేతుకంగా కూడా అన్పించవచ్చు.
ఏమైనా నిర్ణయం మనమీదే ఉంది.
ఆ పిచ్చుక లాగా ఎగురుదామా?
నేల మీద ఉంటూ బాధపడుతూ కూర్చుందామా?

- జింబో 94404 83001