S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? ( జులై 30 నుండి ఆగస్టు 5 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక లాభం చేకూరుతుంది. మీ పనులు అనుకున్నట్లు వేగవంతమవుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకొని లాభపడతారు. ఉద్యోగంలో అనుకోని పరిణామాలు, బదిలీలు. విలువ వృద్ధి. వ్యాపార రంగం తృప్తినిస్తుంది. మీ నిర్ణయాలు లాభిస్తాయి. గౌరవ మన్ననలు పెరుగుతాయి. స్ర్తిలు అనుకున్నవి అందుకుంటారు. స్పెక్యులేషన్‌లో విజయం. ఇంటిలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంకల్ప సిద్ధికై ప్రయత్నించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఆర్థికంగా బాగుంటుంది. లౌక్యంతో వ్యవహరిస్తారు. కార్యాలు ఆలస్యంగా పూర్తి చేసినా విలువ వృద్ధి. ఒక ముఖ్య సమాచారం మీకు అనుకోని విధంగా ఉంటుంది. చిట్‌ఫండ్‌లలో పైకం అందుతుంది. నిరుద్యోగులకు మంచి కాలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి. ఇంటిలో మార్పులు గోచరిస్తున్నాయి. మొహమాటాలకు పోవద్దు. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. హితులు మీకు సాయం చేస్తారు. దంపతులు, స్ర్తిలు ఆలోచనలు మీకు ఉపకరిస్తాయి. నిదానం ప్రధానం. అన్నింటా శ్రమానుకూల ఫలితాలు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆదాయ లావాదేవీలు ప్రయోజనకరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిధులు దాటకుండా అన్నింటా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. ప్రముఖుల కలయిక, సలహాలు అత్యంత ప్రయోజనకరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార పరిస్థితులు మీకు అనుకూలంగా సంతోషాన్ని కలిగిస్తాయి. సమస్యలు పరిష్కరించుకుంటారు. పిల్లల వైఖరి గమనిస్తూ ఉండండి. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చేపట్టే కార్యాలు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిత్రులు సాయపడతారు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పనికిరాదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహార రంగాలలో అనుకున్న ప్రగతి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఆధ్యాత్మిక భావనలు, దూర ప్రయాణాలున్నాయి. వాహన సౌఖ్యం. స్పెక్యులేషన్ మిశ్రమం. విందు వినోదాలలో పాల్గొంటారు. అతిగా ఆలోచించకండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

విజయ ప్రాప్తి. రావలసిన సొమ్ము అందుతుంది. ఆర్థిక వ్యవహారాలలో శుభ సూచకాలు. స్ర్తిల సహకారం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార, వ్యవహార, ఉద్యోగ రంగాలు ఇతరులకు మార్గదర్శకాలవుతాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. అనుకోని సమస్యలు కొన్ని వచ్చేట్లున్నాయి. లౌక్యంతో ఆలోచించి పరిష్కరించుకోండి. పనులు త్వరగా పూర్తి చేస్తారు. ప్రయత్న లోపం లేకుండా వ్యవహరించండి. వ్యక్తిగత విమర్శలొద్దు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

బుద్ధిబలంతో అనుకున్నవి పూర్తి చేస్తారు. ఆర్థిక వనరులు తృప్తినిస్తాయి. విమర్శలను పట్టించుకోకుండి. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పెద్ద కార్యాలను చిన్న కార్యాలుగా విభజించి సమిష్టిగా చేయటం మేలు చేస్తుంది. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. విద్య, వ్యాపార, వృత్తి, ఉద్యోగ రంగాలు గతం కంటె మేలు. కొన్ని చెల్లింపులు పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు ఉపకరిస్తాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

ధన లాభం కొనసాగుతుంది. వ్యయ నియంత్రణ మంచిది. చేయబోయే పనుల గురించి ముందుగా అంచనాకు రండి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరాన్నిబట్టి ఉపయోగించుకోవాలి. విశ్రాంతి అవసరం. విద్య, వైద్య, వృత్తి, ఉద్యోగ రంగాలు తృప్తినిస్తాయి. పొరపొచ్చాలు లేకుండా జాగ్రత్త పడండి. అనాలోచితంగా అప్పులు ఇవ్వొద్దు. సమాజంలో గౌరవ మన్ననలు పెరుగుతాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. మిత్రుల సహాయంతో కొన్ని పనులు తేలికగా పూర్తి చేస్తారు. అనుమానం వద్దు. సంకల్ప సిద్ధికై ప్రయత్నించండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక లావాదేవీలు ఆలోచనలకు వ్యతిరేకంగా చేయకండి. ఆస్తి కొనుగోలుకై అప్పులు చేయవలసి వస్తుంది. వాయిదా పద్ధతి వద్దు. వృద్ధి, అభివృద్ధిని గుర్తించి వ్యవహరించండి. స్పెక్యులేషన్‌కై పెట్టుబడులు ఆలోచింపజేస్తాయి. చేపట్టిన వృత్తి, వ్యాపారాలు, వ్యవహారాదులు గతంకన్నా మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు, స్వయం ప్రతిపత్తితో విజయాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు వృద్ధి బాటలో ఉంటాయి. దంపతులు, స్ర్తిలు ఆలోచనలు మీకు ఉపకరిస్తాయి. నిదానం ప్రధానం. అన్నింటా శ్రమానుకూల ఫలితాలు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆర్థిక విషయాలు ఆనందింపజేస్తాయి. శుభ యోగముంది. మీ పనుల వల్ల మంచి గుర్తింపు, గౌరవ మన్ననలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహార రంగాలు మిత్రులతో అనుకున్న విధంగా మలచుకుంటారు. అనుకోని ప్రయాణాలున్నాయి. నిరుద్యోగులకు శుభ సమయం. విలువైనవి ఈ రాశి వారు అందుకుంటారు. ఒక వార్త సంతోషాన్నిస్తుంది. సకారాత్మక దృక్పథం మేలు. నకారాత్మకతలు వద్దు. స్పెక్యులేషన్ మిశ్రమం. స్ర్తిలు అన్నింటా లాభపడతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ప్రముఖుల సాయంతో ఆర్థిక రంగ వృద్ధి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు వృద్ధి బాటలో ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. విందు వినోదాలు. ఆత్మీయుల రాక మీకు సంతోషాన్నిస్తుంది. విలువైన ఆర్థిక పత్రాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పట్టుదల అన్నింటా మేలు. పెట్టుబడులు వనరులకు అనుగుణంగా చూసుకుంటే మంచి ఫలాలను అందుకుంటారు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ప్రణాళికలకు అనుకూలంగా మంచి ఫలాలను అందుకుంటారు. ఉద్యోగులకు శుభ సమయం. విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలం. వివాహ ప్రయత్నాలకు ప్రణాళికు శుభాల నిస్తాయి. ధన యోగం. వస్తు లాభం అందుతుంది. స్పెక్యులేషన్ మిశ్రమం. కుటుంబ సమస్యలకై సమయం తప్పక కేటాయించాలి. కోర్టు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని చిక్కు సమస్యలను పరిష్కరించుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

మీ పనులు మీరే చేసుకోవటం మంచిది. ఇతరులు చేస్తారని వాయిదాలు వేయకండి. సన్నిహితులు సహకరిస్తారు. పెద్దల ఆశీస్సులు, సహకారాలు ఉపయోగపడతాయి. తడబాటుతనం వద్దు. చేపట్టే వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలు గతం కంటె మెరుగు. విలువైన వస్తువుల ఖరీదు విషయంలో, ప్రయాణాదులందు మెళకువ అవసరం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855