S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్థిరత్వం

‘అదే తెలుస్తుంది’ అంటూ నిజంగా ఆలోచించగలిగితే కదలికే స్థిరత్వం! స్థిరంగా కనిపించేవన్నీ నిజానికి కదులుతున్నాయి. నునుపుగా వున్న తలాలన్నీ సూక్ష్మంగా చూస్తే ఒక క్రమంలో ఉన్న ఎత్తుపల్లాలు అని భౌతిక శాస్త్రాన్ని ఉటంకిస్తూ గోపాలంగారు అర్థమరుూ అవనట్టు చెప్పిన భౌతిక శాస్త్ర విషయాలు తెలిసీ తెలియనట్టుకనిపించి చివరకు తెలిసిందిలే అనిపించాయి. కథాసాగరంలో శిష్యుడికి సత్యం అంటే ఏమిటో చెప్పడానికి గురువుగారు వివరించిన కాగడాల ఉదాహరణ అర్థవంతంగా ఉంది. ఎండ్రకాయలకు మభుషుల్లాగే మెదడు, నాడీ వ్యవస్థ, గుండె, శ్వాస వ్యవస్థ ఉంటాయనీ, దానికి రెండు ఉదరాలుంటాయని తెలిసి ఆశ్చర్యపోయాం.
-సి.మైథిలి (సర్పవరం)
అడవి మనిషి
బంగ్లాదేశ్‌కు చెందిన అబ్దుల్ సమాద్ షేక్ అనే 60 ఏళ్ల రిక్షావాలా రోజుకు కనీసం ఒక మొక్క చొప్పున ఇప్పటి వరకు 17500 మొక్కలకు ప్రాణం పోసిన ‘అడవి మనిషి’ కథనం స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే మంచి సస్పెన్స్‌తో సాగిన క్రైం కథ ‘విలువైన వస్తువు’ చాలా బాగుంది. చివరకు అతడొక వాంపైర్ అని తెలిసి ఆశ్చర్యపోయాం. ఆంగ్ల చిత్రాల కథల్లో డ్రాకులా లాంటి వాంపైర్లు కనిపిస్తూ ఉంటాయి మన దేశవాళీ పిశాచాల్లాగ. మహిళల వనే్డ క్రికెట్ ప్రపంచ కప్ ధర్మమా అని హర్మన్, మిథాలి లాంటి క్రికెటర్ల పేరు మార్మోగింది. భారత మహిళా క్రికెట్‌కి మంచి రోజులొచ్చినట్టున్నాయి.
-కె.ఎల్.ప్రసన్న (పేర్రాజుపేట)
సాధన
మన జీవన ప్రయాణంలో మన నిర్వహణను బట్టి విలువ, గౌరవం లభిస్తాయి. ఇది నిరంతర సాధన వల్ల, నిర్వహణ సామర్థ్యం సమకూరుతుందన్న ఓ చిన్న మాట ప్రత్యక్షర సత్యం. ‘అవీ-ఇవీ’లో పులి వేట, సైనిక విన్యాసాలు అన్న అంశాలు ఆకట్టుకొన్నాయి. ‘కవితలో’ కవి ఏమేమి చేయగలడో వివరించిన విధానం బాగుంది. కీర్తన ఎలా ఉండాలో వివరిస్తూ త్యాగరాజ కీర్తనల గొప్పదనం గురించి ‘అమృతవర్షిణి’లో వివరించిన విధానం మాకు బాగా నచ్చింది. చనిపోయిన వ్యక్తి పుర్రె దగ్గర ఉంచుకున్న వ్యక్తికి కష్టనష్టాలు కలగడం, పుర్రెలోని దుష్టశక్తిని పారదోలడానికి శాంతి చేయించడంతో ఆ వ్యక్తి కష్టాలు తొలగిపోవడం అచ్చు భారతీయ కథలాగా ఉంది.
-సదాప్రసాద్ (గొడారిగుంట)
హెచ్చరిక
నూతన సంవత్సర తీర్మానాలు చేసుకొని వాటిని సాధించకుండా కాలయాపన చేస్తుంటాం. అలాకాక వాటిని రాసుకొని మనకు తరచుగా కనిపించే విధంగా ఉంచుకుంటే అదొక హెచ్చరిక లాగ పనిచేసి ఆ తీర్మానాలు సాధించేస్తాం అన్న సండే గీత బాగుంది. కాగితాలతో కళాఖండాల్లాగ చేసిన తెరలు, డూమ్‌లు అద్భుతంగా ఉన్నాయి. వాటిని కాగితం తయారుచేశారని ఎవరూ ఊహించలేరు. ముక్తకాలు కవిత బాగుంది. దానిలో ‘అద్దంలో అందాన్ని చూసుకొని మురిసిపోతున్న జవ్వనీ.. ఆ అద్దమే నిన్ను వెక్కిరిస్తుంది ముసలితనం రానీ’ అనడం మరీమరీ బాగుంది.
-జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్)
హైప్
మహిళల వనే్డ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు గత కొంతకాలంగా జరుగుతున్నా ఈసారి వచ్చినంత హైప్ గతంలో లేదు. అందుకు కారణం మన దేశంతోపాటు మరో మూడు దేశాల జట్లు బాగా పుంజుకోవడమే. మిగిలిన దేశాల మహిళలు కూడా సత్తా చాటగలిగితే ఆటలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. కవర్‌స్టోరీలో మహిళా క్రికెట్ గురించి చక్కని వివరాలు అందజేసినందుకు ధన్యవాదాలు. ‘మీకు తెలుసా?’ అంటూ లతలా పెరిగే రోబో గురించి చెప్పిన విషయాలు ఆకట్టుకొన్నాయి. 72 రోజుల్లో 10 దేశాల మీదుగా 22 వేల కిలోమీటర్లు సాగిన వృద్ధ దంపతుల సాహస యాత్ర ఆసక్తిగొలిపింది.
-పి.చంద్ర (కాకినాడ)
సమర్థత
సంగీత జ్ఞానం ఎంత ఎత్తుకు పెరిగినా అప్పుడప్పుడు కొంత సమర్థత కూడా అలవరచుకోవాలి. మన గంధర్వ గాయకులెందరో నిరూపించిన సత్యమిది. తన గానంలో చిన్నచిన్న దోషాలు వచ్చినప్పుడు అవి ఆ గాయకుడే తన గాత్రంతో స్వరానికి మరింత శోభను చేకూర్చి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ కీర్తనకో కొత్త పేరు తగిలించి తమ సమర్థతను నిరూపించుకుంటారు. కొందరు సంగీత సర్వజ్ఞులు బాలమురళి స్వరంలోని చిన్న అపశృతిని ఎత్తిచూపినపుడు, అదొక కొత్త రాగమని, దానికో పేరు పెట్టారు. ఇలా ఆయన కనిపెట్టినవెన్నో.
-లక్ష్మీరామం (హైదరాబాద్)
గురువు
ఎన్ని డిగ్రీలు ఉన్నా అవి చదువు చెప్పవు. కాని ఉద్యోగార్హతను కలుగజేస్తాయి. ఉద్యోగంలో చేరిన తరువాత గురువుగా బాధ్యతలను స్వీకరించి ఏ విధంగా బోధిస్తే విద్యార్థుల మనసులో నాటుకుంటుంది. చెప్పిన పాఠాలు మరువకుండా ఎలా ఉండగలరో తెలుసుకోగలగాలి. అస్తమానూ ఒక్క సిలబస్‌ను పట్టుకు వేలాడకుండా దానికి సంబంధించిన లేటెస్ట్ మార్పులు సమాజంలో, వ్యాపారంలో, దేశంలో ఏమి వచ్చాయి? ఈ కొత్త విషయాలు ఉపాధ్యాయులు చెప్పగలిగే స్థాయికి చేరాలి. నేర్పుగా మనసుకు అంటే విధంగా ఉదాహరణలతో చెప్పాలి. ఉపాధ్యాయులు తప్పనిసరిగా దినసరి వార్తలను చదవాలి. మేధావులను సంప్రదించాలి. తమకు తెలియని వాటిని తెలుసుకోవాలి. ఇవన్నీ విద్యార్థుల మనోవికాసానికి, సమకాలిక జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడతాయి.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)