S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (ఆగస్టు 20 నుండి 26 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక తృప్తి. ఉత్సాహమే ఊపిరిగా పని చేయాలి. బంధుమిత్రులు సాయపడతారు. ప్రణాళికల మేరకు పనులు చేయాల్సి ఉంటుంది. సమస్యలున్నప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొంటారు. గౌరవ, మన్ననలు అందుకుంటారు. యధాలాపంగా కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి. అనవసర ఆలోచనలు వద్దు. పరిశీలనాత్మక ధోరణి మేలు. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాలలో శ్రద్ధ అవసరం. రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతుంది. ఆత్మబలంతో అనుకోని పనులు పూర్తవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
కార్యాలందు నేర్పు, శ్రద్ధ వహించాలి. మీరు అనుకున్నవి త్వరగా ఇతరుల సాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక లాభం. కుటుంబ సభ్యుల సాయం. మంచి వార్తలు వింటారు. స్పెక్యులేషన్ ఫలప్రదం. ప్రగతి కాలం. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగ రంగాలు ఆనందాన్నిస్తాయి. దంపతులు సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబ విస్తరణకు అవకాశం. పెద్దల పరిచయాలు ప్రయోజనకారి. పోటీ పరీక్షలకు చక్కని కాలం. అనుకోని ప్రయాణాలుంటాయి. ఒక విషయం మిమ్మల్ని విమర్శలకు గురి చేయనుంది. స్పెక్యులేషన్ మిశ్రమం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆత్మవిశ్వాసం వృద్ధి అవుతుంది. ఆర్థికాంశాలు అనుకూలం. ఉద్యోగ రంగం ఆలోచింపజేస్తుంది. స్వశక్తితో ముందంజ వేస్తారు. మంచిని ఆస్వాదిస్తారు. వృత్తి, వ్యాపార, ఇతర రంగాలు మార్పులకు లోనవుతాయి. విందు వినోదాలలో సానుకూల మార్పులు. స్పెక్యులేషన్ ఆలోచనాత్మకం. శుభవార్తలు వింటారు. కల్యాణ గడియలు దగ్గర్లో ఉన్నాయి. పనిలో నిమగ్నమవ్వాలి. విద్య, వైద్య, వ్యవహార రంగాలు క్రితం కంటె మెరుగవుతాయి. అన్నింటా పర్యవేక్షణ ముఖ్యం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఆర్థికంగా మిశ్రమం. కాలం మీకు పరీక్షగా మిగులుతుంది. ఇతరుల సమస్యలపై అతి శ్రద్ధ కూడదు. విలువైన వస్తువులు మీ ప్రమేయం లేకుండానే చేతులు మారతాయి. విందు వినోదాలందు నెమ్మదిత్వం మేలు. అవాకులు చెవాకులు వద్దు. బంధువుల కదలికలను గమనిస్తూ ఉండండి. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక లబ్ధికి అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త. వివాదాలను దరికి రానీయకండి. స్ర్తిలు పనులలో రాణిస్తారు. అనుకున్నవి తృప్తినిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
పరిశీలనతో పనులు చేయాల్సి ఉంటుంది. ఇతరుల ధోరణి మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రు జయం, మిత్ర బలం ఉంది. ధన సౌలభ్యం. అనుకున్న మార్గాన మీ ప్రయాణాలుంటాయి. మంచి వార్తలు వింటారు. కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబీకులు సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యవహార రంగాలు మిశ్రమ ఫలితాలనిస్తాయి. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభం. సమస్యలున్నప్పటికీ పరిష్కారమవుతాయి. ఆందోళన చెందకండి.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
ఈ వారం సాఫీగా నడుస్తుంది. ఆర్థిక లౌక్యం పాటించాలి. ఖర్చు నియంత్రణ మంచిది. తొందరపడి మాటలు, ధన వితరణల్లో జాగ్రత్త పాటించాలి. సమీక్షలతో కార్యసిద్ధి. విజయం ప్రాప్తిస్తుంది. ఎంచుకున్న రంగాల్లో, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అందర్నీ ఓ కంట కనిపెట్టండి. శాంతి ప్రధానం. స్పెక్యులేషన్ నత్తనడన ఉంటుంది. వ్యవహారాదులు ఫలప్రదం. శుభకార్యాలందు పాల్గొంటారు.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
ఆర్థిక లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. ముందుచూపు మంచిది. పదవులు, బాధ్యతలు గుర్తింపును పెంచుతాయి. పలుకుబడి పెరుగుతుంది. హితులు సన్నిహితులవుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు మెరుగుపడతాయి. స్ర్తిలు చేపట్టే రంగాలు వృద్ధిబాటలో ఉంటాయి. సమస్యలున్నా పరిష్కరించుకుంటారు. కొన్ని వ్యవహారాలు అలవోకగా పరిష్కరించబడతాయి. విదేశీ విద్య, వైద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒత్తిడి పెట్టుకోకండి. స్పెక్యులేషన్ ఫరవాలేదనిపిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థికంగా తృప్తి. హితులు సాయపడతారు. ఒడంబడికలు చేసుకోకండి. శ్రమకు గురికావలసి వస్తుంది. అందరిలో వున్నా ఏదో వెలితి మిమ్మల్ని వెంటాడుతుంది. అనుకున్న పనులు ఒకదాని వెంట ఒకటి పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. తొందరపాటు తగదు. స్థోమతను గుర్తెరిగి ప్రవర్తించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆర్థిక విషయాలు లక్ష్యాలకు అనుకూలం. స్ర్తిల సలహాలు పుష్టినిస్తాయి. అందర్నీ ఒకేలాగ చూడకండి. ఆలోచించి లౌక్యంతో ముందుకెళ్లండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలు ఫలప్రదం. ప్రమోషన్లు ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ధన, గౌరవాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి సమయం. శ్రమ ఫలిస్తుంది. చెల్లింపులు చేస్తారు. కొత్త పరిచయాలు శుభాన్నిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ధనం సమయానికి అందుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలం. కొన్ని పనులు వాయిదా వేయటం మంచిది. ప్రయాణాలు వృధాగా చేయాల్సి రావచ్చు. ఇబ్బందులు లేకుండా ప్రవర్తించటం అన్నింటా మంచిది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకోవాలి. దంపతులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్పెక్యులేషన్ నత్తనడకన ఉంటుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సంతాన పరంగా సంతోషం. లావాదేవీలు ఊహకు అనుగుణంగా ఉంటాయి. వృత్తి, వ్యాపార, విద్య, సాంకేతిక, ఉద్యోగ రంగాలు ఆలోచింపజేస్తాయి. చెప్పుడు మాటలు పెడచెవిన పెట్టండి. స్వంత నిర్ణయాలు నైపుణ్యంతో అమలు చేయండి. స్పెక్యులేషన్ మిశ్రమం. లౌక్యంతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో ఆసక్తి కూడదు. బకాయి పనులు పూర్తి కానున్నాయి.
మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
అదృష్ట ప్రదం. ఫలప్రదంగా ఈ వారం గడుస్తుంది. గమనింపుతో మంచి విషయాలు, నిర్ణయాలు సంతోషాన్ని అందిస్తాయి. సంఘ కార్యక్రమాదులందు పాల్గొంటారు. లౌక్యం, బుద్ధిబలంతో అన్నింటా విజయం. మంచి వార్తలు వింటారు. లక్ష్య సాధ్యం. ఇష్టపడే కార్యాలు కుటుంబ సభ్యుల సాయంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాదులు ఫలప్రదం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855