S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమ్మ

1937

ఆరిజోనా రాష్ట్రం.
కార్ల్‌కి తాగుడు అలవాటు ఉండటంతో అతని భార్య హెలెన్ విడాకులు తీసుకుంది. వాళ్లకి స్టీవ్ అనే ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఆరు వారాల క్రితం డి-ఎడిక్షన్ సెంటర్లో చేరిన కార్ల్, బయటకి వచ్చాక తన భార్యని కలిశాడు. తను ఆల్కహాల్‌ని పూర్తిగా మానేసానని, తిరిగి పెళ్లి చేసుకుందామని కోరాడు. కాని ఆమె అందుకు అంగీకరించలేదు.
‘పెళ్లైన కొత్తలో మనం ఆనందంగా ఉన్నాం కాని తర్వాత మీరు తాగి నాతో పోట్లాడటం, కొట్టడం నేను మర్చిపోలేదు. ఎన్నిసార్లు క్షమించినా మీరు మారలేదు’ చెప్పింది.
‘అవును. నేను చేసిన తప్పులన్నీ గ్రహించాకే నీ దగ్గరికి వచ్చాను. మరోసారి ఆ తప్పులని చేయను’ కార్ల్ వేడుకున్నాడు.
‘కాని నేను ఇంకో అవకాశం తీసుకోలేను. దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదలండి. మళ్లీ రాకండి’ ఆమె ఏడుస్తూ అడిగింది.
‘నువ్వు బలవంతం చేసినా చేరని నేను, విడాకులు అయ్యాక స్వచ్ఛందంగా డి-ఎడిక్షన్ సెంటర్లో చేరలేదా? ఆ రుజువు చాలదా నేను మారాననడానికి?’ అర్థించాడు.
‘సరే. నేను ఆలోచించుకోవాలి. ఈ సాయంత్రం స్టీవ్‌ని సైట్ సీయింగ్‌కి తీసుకెళ్తానని మాట ఇచ్చాను. వెళ్తాను’
‘ఒకవేళ నీ నిర్ణయం నాకు అనుకూలంగా లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని గుర్తుంచుకో’ కార్ల్ చెప్పాడు.
* * *
స్టీవ్‌ని ఆరిజోనాలోని వెండి గనుల దగ్గరికి తీసుకెళ్తూన్న హెలెన్ వాడు మూడీగా ఉండటం చూసి అడిగింది.
‘ఎందుకలా ఉన్నావు? మీ నాన్న గురించా?’
వాడు జవాబు చెప్పలేదు.
‘మీ నాన్నంటే నీకున్న ప్రేమే బహుశ నాకూ ఉందేమో?’
‘బహుశ? నాన్నని మనింట్లోకి ఎప్పుడు రానిస్తావు?’
‘అదంత తేలిక కాదు’
గమ్యం చేరుకునే దాకా ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. కార్లోంచి బయటకి వస్తూ టార్చ్‌లైట్‌ని స్టీవ్‌కి ఇచ్చింది. ఇద్దరూ వెండి గనిలోకి వెళ్లారు. వాడు ఓ చోట టార్చ్‌లైట్ వెలుగుని కిందకి ప్రసరించి చూస్తే అంతా చీకటి. ఓ రాతిని తీసుకుని కింద పడేస్తే దాదాపు పావునిమిషం తర్వాత అది నీళ్లల్లో పడ్డ శబ్దం వినిపించింది.
‘వందడుగుల లోతుంటుందా?’ అడిగాడు.
‘నాకు తెలీదు... సరే. నేను నిర్ణయించాను. మీ నాన్నని మనింటికి రమ్మని చెప్దాం’ హెలెన్ చెప్పింది.
స్టీవ్ ఆనందంగా కింద కనపడ్డ ఓ సుత్తిని అందుకుని గని కూలకుండా సపోర్ట్‌గా పెట్టిన చెక్కల్లోని ఓ దాని మీదకి ఎక్కి సుత్తితో గోడ మీద కొట్టసాగాడు. అకస్మాత్తుగా పైనించి మట్టి రాలింది. ఒక్కసారిగా సపోర్ట్‌గా పెట్టిన చెక్కలు తొలగి గనిలోని కొంత భాగం కూలింది. స్టీవ్ మీద ఓ చెక్క పడటంతో ‘అమ్మా’ అని గట్టిగా అరిచాడు. వాడి మీద రాళ్లు పడ్డాయి.
* * *
మోటెల్ గదిలో భారంగా పడుకున్న కార్ల్‌కి గుమ్మం దగ్గర మట్టికొట్టుకు పోయి నిలబడ్డ హెలెన్ కనిపించింది.
‘హెలెన్. ఏమైంది?’ అడిగాడు.
‘స్టీవ్ వెండి గని కూలి చిక్కుపడ్డాడు’ ఏడుస్తూ చెప్పింది.
వెంటనే కార్ల్ కోటు అందుకుని, ఆమె చేతిని పట్టుకుని తన కారు దగ్గరికి లాక్కెళ్లాడు. ఆమె చూపించే మార్గంలో ఇద్దరూ కొద్ది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. ఆమె కారు దిగి వేగంగా లోపలకి పరిగెత్తుతూ అరిచింది.
‘త్వరగా’
కార్ల్ కూడా టార్చ్‌లైట్ అందుకుని వేగంగా ఆమెని అనుసరించాడు. హెలెన్ అతన్ని చెక్కలు కూలిన దగ్గరికి తీసుకెళ్లింది. అతను వెంటనే పైనించి కూలిన రాళ్లని పక్కకి జరిపి, బలమైన చెక్క దుంగలని పక్కకి జరిపే విఫల ప్రయత్నం చేస్తూ ‘స్టీవ్! స్టీవ్! నేనొచ్చాను’ అని అరవసాగాడు.
గని బయట నించి ఓ నల్లజాతి వ్యక్తి, వెనకే ఓ తెల్లజాతి వ్యక్తికి హెలెన్ ‘హెల్ప్ హెల్ప్’ అన్న అరుపులు వినపడటంతో లోపలకి వచ్చి ‘ఎక్కడ? అమ్మా! ఎక్కడున్నావు?’ అని అరిచారు. ఆ అరుపులు విన్న కార్ల్ ఇక్కడ అని గట్టిగా అరిచాడు. ఆ ఇద్దరూ గనిలోని బి సెక్షన్‌కి చేరుకున్నారు.
‘మా అబ్బాయి స్టీవ్ మూలుగు వినిపిస్తోంది. సహాయం చేయండి’ కార్ల్ ఏడుస్తూ కోరాడు.
వాళ్ల సహాయంతో అడ్డుగా ఉన్నవన్నీ తొలగించి స్టీవ్‌ని బయటకి తీశాడు.
స్పృహలోనే ఉన్న వాడు ‘అమ్మ, అమ్మ’ అని అరుస్తూ మరో వైపు కూలిన రాళ్ల వైపు పరిగెత్తి వాటిని పక్కకి తీయసాగాడు. దూలం కింద ఉన్న ఓ చెయ్యి వాళ్లకి కనిపించింది. అన్నీ అడ్డూ తొలగించాక చూస్తే హెలెన్ మరణించి ఉంది. కార్ల్ పిచ్చివాడిలా అరరుస్తూండటంతో వాళ్లు అతన్ని హాస్పిటల్‌కి తరలించారు.
* * *
సైకియాట్రిస్ట్ కార్ల్ చెప్పింది విని చెప్పాడు.
‘మీ భార్య గని కూలగానే తక్షణం మరణించిందని డాక్టర్ చెప్పారు’
‘అది నిజం కాదు. గని కూలాక ఆమె నా దగ్గరికి వచ్చింది?’
‘మరణించిన మీ భార్య గని నించి మీ మోటెల్‌కి ఎలా వచ్చింది? మీ కారులో వెళ్లారని, ఆమె స్టేషన్ వేగన్ గని బయటే ఉందని చెప్పారు. నిన్నంతా వేడిగా ఉండటంతో మీరు భ్రమ పడ్డారు. పైగా తీవ్ర మానసిక వత్తిడిలో ఉన్నారు. ఆమె తిరిగి రాదని తెలిసిన మీ మనసుకి ఆ భ్రమ కలిగింది.’
‘కాదు. ఆమె నిజంగా నా దగ్గరికి వచ్చింది’ కార్ల్ అరిచాడు.
‘డి-ఎడిక్షన్ సెంటర్లో మీ మనసు ఎలా భ్రమలకి గురయ్యేదో మీ రికార్డులో ఉంది. ఇది ఆల్కహాల్ బాధితులకి ఉండే ప్రధాన లక్షణం.’
‘కాని నాది భ్రమ కాదు’ కార్ల్ ఆవేదనగా చెప్పాడు.
‘డాక్టర్‌గా మిమ్మల్నా భ్రమలోంచి బయట పడేయటం నా బాధ్యత. లేదా మీరు పిచ్చివాడై పోవచ్చు. మీ మీద ఆధారపడ్డ ఓ కొడుకు కూడా బయట మీ కోసం వేచి ఉన్నాడు. ఆ భ్రమలోంచి బయటకి రావడం అంత తేలిక కాదు. కొంత కాలం ఈ మందుని వాడండి’
డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్‌ని కార్ల్ తీసుకున్నాడు. కార్ల్ మోటెల్ గది చప్పుడైంది. డాక్టర్ ‘కమిన్’ అని చెప్పాక తలుపు తెరచుకుని లోపలకి వచ్చిన నల్లజాతి వ్యక్తి చెప్పాడు.
‘మీరు ఎలా ఉన్నారో చూసి పోదామని వచ్చాను’
‘్థంక్స్. బానే ఉన్నాను. నిన్న రాత్రి మీకు కృతజ్ఞతలు చెప్పనే లేదు... డాక్టర్. స్టీవ్‌ని బయటకి తీయడానికి సహాయం చేసిన వారిలో ఇతనూ ఉన్నాడు. ఇతని పేరు కూడా నాకు తెలీదు’ కార్ల్ డాక్టర్‌తో చెప్పాడు.
‘నా పేరు శామ్. నా మిత్రుడి పేరు హేరిస్. మేమిద్దరం ఆ సమయంలో అక్కడ ఉండటం మీ అదృష్టం. ఆమె అరుపులు వినగానే మేము సాధ్యమైనంత వేగంగా వచ్చాం’ శామ్ చెప్పాడు.
‘ఎవరి అరుపులు?’ డాక్టర్ అడిగాడు.
‘ఓ అమ్మాయి సహాయం చేయమని పెద్దగా అరవడం విన్నాం. గని ముఖద్వారం దగ్గర నిలబడ్డ ఆమె మమ్మల్ని లోపలకి రమ్మని తను పరిగెత్తడంతో మేమూ వెనకే వెళ్లాం.. వెళ్లొస్తాను’ చెప్పి శామ్ వెళ్లిపోయాడు.
కార్ల్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్కిప్షన్‌ని ఆయన జేబులో ఉంచి చెప్పాడు.
‘నాకు ఇప్పుడు దీని అవసరం లేదనుకుంటాను’
కార్ల్‌ది భ్రమా? కలా? మాయా? లేక ముగ్గురు పెద్ద వాళ్లు కన్న పగటి కలా? తక్షణం మరణించిన హెలెన్ తన కొడుకుని రక్షించుకోడానికి ముగ్గురికి ఎలా కనపడి సహాయం అర్థించగలిగింది? ప్రేమకి మృత్యు సరిహద్దులు ఉండవా? ఈ ప్రశ్నలకి సమాధానం దేవుడికే తెలియాలి.