S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈగిల్ పాయంట్

కొత్తగా పెళ్లైన కాన్రాయ్ తన భార్య శాలీతో లూజియానా రాట్రం నించి కేలిఫోర్నియాకి హానీమూన్‌కి కార్లో బయలుదేరాడు. కార్లో కొద్దిసేపు నిద్ర పోయిన శాలీ లేచాక కాన్రాయ్ అడిగాడు.
‘కలగన్నావా?’
‘నీకెలా తెలుసు?’
‘నిద్రలో నువ్వు అర్థం కాని శబ్దాలు చేసావు’
కారు కొద్ది దూరం వెళ్లాక ఆమె చెప్పింది.
‘ఓ మైలు దూరం వెళ్లాక కుడివైపు రోడ్లోకి తిరుగు. అక్కడ ఓ కొండ కనిపిస్తుంది. అక్కడి పైన్ వృక్షాలని దాటి కొండ మీదకి పోనివ్వు’
‘ఇది నీకెలా తెలుసు? నువ్వు ఎప్పుడూ కేలిఫోర్నియా రాలేదుగా?’ కాన్రాయ్ ఆశ్చర్యంగా అడిగాడు.
శాలీ జవాబు చెప్పలేదు. ఆమె చెప్పిన దారిలో కారుని పోనించాక మళ్లీ చెప్పింది.
‘ఇంకొంచెం ముందుకి వెళ్తే ఈగిల్ పాయింట్ వస్తుంది. జాగ్రత్త! రోడ్‌కి అడ్డంగా ఓ చెట్టు పడి ఉంది’
ఆమె చెప్పినట్లుగానే రోడ్‌కి అడ్డంగా చెట్టు కనిపించడంతో కాన్రాయ్ కారు ఆపాడు. శాలీ కారు దిగి వేగంగా ఓ వైపు వెళ్తూంటే ఆమెని పిలుస్తూ అనుసరించాడు. ఆమె ఓ చోట నిలబడి కొండ కింద దూరంగా ఉన్న సముద్రాన్ని చూస్తూంటే అడిగాడు.
‘శాలీ! అలా చూస్తావేమిటి? నీకు ఏమైంది?’
‘నువ్వెవరు?’ ఆమె అడిగింది.
ఆమె వెనక్కి పరిగెత్తుకెళ్లి కారెక్కి దాన్ని స్టార్ట్ చేసి వెనక్కి తిప్పి వెళ్లిపోవడం కాన్రాయ్ ఆశ్చర్యంగా చూస్తూండిపోయాడు. అతను కారు వెంట పరిగెత్తుతూ ఎంత పిలుస్తున్నా ఆమె కారు ఆపలేదు.
కాన్రాయ్ ఓ పోలీస్ పెట్రోల్ కార్‌ని ఆపి జరిగింది చెప్పి, శాలీని వెతకాలని కోరి, అతని కారుని ఎక్కాడు.
‘ఎప్పుడూ కేలిఫోర్నియా రాని శాలీకి ఈ ఈగిల్ పాయింట్ గురించి ఎలా తెలిసింది?’ పోలీస్ ఆఫీసర్ అడిగాడు.
‘అది నాకు తెలీదు. ఎంతో తేడాగా కనిపించింది’
ఓ ఇంటి బయట ఆగి ఉన్న తన కారుని గుర్తు పట్టి పోలీస్ కారుని అక్కడ ఆపించాడు. ఇద్దరూ లోపలకి వెళ్లారు. లోపల లైట్లు వెలగడం చూసి పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
‘ఇందులో ఎవరూ ఉండటం లేదు. ఇందులో ఉన్న ఓ యువతి రెండు వారాల క్రితం ఈగిల్ పాయింట్ నించి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది.’
‘లేదు. నేను... నేను ఆత్మహత్య చేసుకోలేదు. హత్య చేయబడ్డాను’ మేడ పై మెట్టు మీద నిలుచున్న శాలీ అరిచింది.
ఆందోళనగా ఉన్న ఆమెని పోలీసు కార్లో ఎక్కించుకుని డాక్టర్ అలెక్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.
* * *
మర్నాడు ఉదయం కాన్రాయ్ డాక్టర్ ఎలెక్స్‌ని అడిగాడు.
‘నా భార్యకి మత్తుమందు ఇస్తున్నారు. అసలు ఆమెకి ఏమైంది?’
‘నాకూ తెలీడం లేదు. ఇలాంటి మానసిక స్థితి గురించి నేను ఎన్నడూ ఏ వైద్య పుస్తకంలో చదవలేదు. దీన్ని వినండి’
అలెక్స్ ఆన్ చేసిన టేప్ రికార్డర్‌ని కాన్రాయ్ ఆసక్తిగా విన్నాడు. శాలీ మాటలు ఇలా వినపడ్డాయి.
‘అలెక్స్. నువ్వు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నన్ను నీ హాస్పిటల్లో ఎందుకు ఉంచావు?’ అనే శాలీ ప్రశ్న, ‘నీకు బాగుచెయ్యాలని’ అనే అలెక్స్ జవాబు విన్నాడు.
‘అలెక్స్. నా పేరు శాలీ కాదని, కెరిల్ అని నీకు తెలుసు’ శాలీ కంఠం వినిపించింది.
‘కెరిల్ ఇప్పుడు లేదు. ఆత్మహత్య చేసుకుంది’ అలెక్స్ చెప్పాడు.
‘లేదు. నన్ను హత్య చేశాడు’
వెంటనే నర్స్ మత్తుమందు ఇంజెక్షన్ ఇస్తూంటే, శాలీ ప్రతిఘటించిన శబ్దాలు వినిపించాయి.
కాన్రాయ్ అయోమయంగా చూశాడు.
ఇద్దరూ స్పృహ వచ్చిన ఆమె దగ్గరికి నడిచారు.
‘నా పేరు కెరిల్ వార్డన్. నేను వ్యోమింగ్‌లోని ఫోర్ట్ వర్త్‌లో 1935లో ఫిబ్రవరి పదో తేదీన పుట్టాను. మా అమ్మ పేరు మేరీ లూరుూస్. మా నాన్న ఫిలిప్ జోసెఫ్ వార్డన్. న్యుమోనియాతో ఆయన 1939 ఏప్రిల్ పనె్నండో తారీకున మరణించారు. నీ భార్య ఎలెన్ ఫోర్త్ జులై 1941లో పిక్నిక్‌లో లేక్ ఎట్నాలో మునిగి మరణించింది. అలెక్స్! నాలుగేళ్ల క్రితం నువ్వు కంట్రీ క్లబ్‌లో నిన్ను పెళ్లి చేసుకోమని అడిగావు’
‘కెరిల్! నిన్ను ఎవరు హత్య చేశారు?’ అలెక్స్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘డేన్ స్టేప్లర్’
‘ఎందుకు?’
‘నేను విడాకులు ఇవ్వనని’
‘మీకు పెళ్లి కాలేదు’
‘మేం క్రితం సంవత్సరం మెక్సికోలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాం’
‘ఎందుకలా?’
‘మా అమ్మకి మా పెళ్లి ఇష్టం లేదని నీకు తెలుసు. నాకు వారసత్వ ఆస్థి లేదని తెలిసాక అతని ప్రేమ చచ్చిపోయింది’
‘అతను కోరినా నువ్వు విడాకులు ఎందుకు ఇవ్వలేదు?’
‘నేను అతన్ని ప్రేమించాను కాబట్టి. పరాయి స్ర్తిలతో బీచ్ పార్టీల్లో అతన్ని చూసినా అతను తిరిగి నా దగ్గరికి వస్తాడని ఆశపడ్డాను’
‘ఎందుకు చంపాడు?’
‘డబ్బున్న మరో స్ర్తితో పరిచయం ఏర్పడింది. చాలా వారాల తర్వాత వచ్చి విడాకులు అడిగాడు. ఇవ్వనంటే ఆరేళ్ల పిల్లాడిలా ఏడుస్తూ నేనతన్ని మోసం చేసానని చెప్పాడు. నేను సరే అనే లోపలే నన్ను చంపేసాడు’
‘ఎలా చంపాడు?’
‘నా తల మీద దేంతోనో బలంగా మోది, ఈగిల్ పాయింట్ నించి కిందకి తోసేసాడు. అంతా అది ఆత్మహత్య అనుకున్నారు. నన్ను వెళ్లనిస్తే నేను చెప్పింది రుజువు చేస్తాను7
* * *
శాలీ గదిలోంచి మాయమైందని నర్స్ చెప్పగానే డాక్టర్ అలెక్స్ ఆలోచించి పోలీసులకి ఎక్కడికి రావాలో ఫోన్ చేసి చెప్పి, కాన్రాయ్‌ని తీసుకుని కార్లో ఈగిల్ పాయింట్‌కి చేరుకున్నాడు. శాలీ అక్కడ నేల మీద చేతులతో తవ్వుతూ ఏడుస్తోంది. మట్టిలోంచి ఓ బరువైన ఇనప సుత్తిని వెలికితీసింది.
‘దీంతోనే డేన్ నన్ను కొట్టి చంపింది’ ఏడుస్తూ చెప్పింది. ఆమెకి స్పృహ తప్పిపోయింది.
పోలీస్ ఆఫీసర్ ఆ సుత్తిని తీసుకున్నాడు. అంతా ఆమెని కార్లో హాస్పిటల్‌కి తీసుకెళ్తూండగా దారిలో స్పృహ వచ్చిన శాలీ చుట్టూ చూసి డ్రైవింగ్ సీట్లోని భర్త వంక చూసి నవ్వుతూ అడిగింది.
‘కాన్రాయ్! బాగా నిద్రపోయాను. కేలిఫోర్నియా వచ్చేసామా?’
‘మనం దారి తప్పాం. ఇప్పుడే చేరుకున్నాం’ కాన్రాయ్ జవాబు చెప్పాడు.
* * *
డేన్ 11 జూన్ 1956న కెరిల్‌ని మెక్సికోలో పెళ్లి చేసుకున్నాడని మెక్సికో హాల్ ఆఫ్ రికార్డ్స్‌లో సాక్ష్యం దొరికింది.
పోలీస్ ఆఫీసర్ ఆ సుత్తిని చూపించి డేన్ స్టేప్లర్‌ని నిలదీశాడు. కొత్త పెళ్లికూతురైన శాలీ శరీరాన్ని కెరిల్ తాత్కాలికంగా ఆవహించి, తన నేరాన్ని బయటపెట్టిందని తెలీగానే భయంతో అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
రికార్డుల్లో దయ్యం పట్టడం మీద అనేక వేల కేసులు ఉన్నాయి. వాటిలో చాలా భాగం నిజమే అని ఋజువయ్యాయి కూడా. అలాంటి వాటిలో ఇదొకటి. నిజంగా దయ్యం అనేది ఉందా? ఉంటే, కెరిల్ దయ్యం నిజంగా శాలీని ఆవహించిందా? లేకపోతే శాలీకి తను ఎన్నడూ రాని ప్రాంతం గురించి, ఓ చోట మట్టిలోని హత్యాయుధం గురించి వెదకాలని ఎలా తెలుసు? మొదలైన ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి జవాబు దేవుడికే తెలియాలి.