S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విషాదం

ఇదంతా ఓ ఉద్యానవనం... ప్రకృతి సోయగాల మధ్య.. అందంగా కనిపిస్తున్న ఆ ఉద్యానవనమే ‘ఉద్దానం’గా చెబుతారు.. అందమైన ఆ లోకంలో ఇప్పుడు విషాదం తెరకమ్మేసింది.. ప్రపంచంలో నాలుగైదు చోట్ల మాత్రమే సవాలు విసురుతున్న అరుదైన కిడ్నీ వ్యాధి ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. గ్రామాలకు గ్రామాల్లో కుటుంబాలకు కుటుంబాలు దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే మృతుల సంఖ్య వేలల్లో ఉంది. రెండు దశాబ్దాల విషాదం ఇది. ఈ వ్యాధికి ఇదీ కారణమని తేల్చలేని స్థితి. వైద్యులు, సర్వేలు, పరీక్షలు, పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నా...అసలు కారణం అర్థం కావడం లేదు. ఓ అంచనా ప్రకారం ఉద్దానంలో గడచిన రెండు దశాబ్దాలలో ఇలా మరణించినవారి సంఖ్య 20వేలు. ఈ వ్యాసం చదువుతుంటే ఒళ్లు గగుర్పొడిచింది.
-సిహెచ్.రామారావు (ముమ్మిడివరం)
విశేషాలు
దొంగచాటుగా దాడి చేసి ఒక్క గెంతులో శత్రువుని నోట కరిచి పుర్రెను కొరికి చంపేసే జాగ్వార్ విశేషాలు ఆకట్టుకొన్నాయి. ఎలుక కాకపోయినా నగ్న ఎలుకగా పిలువబడి పంది జాతికి చెందిన జీవికి కేన్సర్ రానే రాదంటే వింతే! బహుమతి కథ ‘నేను బాగున్నానా?’ బానే ఉంది గాని అసహజంగా అనిపించింది. అమ్మాయిలు కాస్త తీరుగా ఉండాలని తెలుగు ఎం.పి. అన్నందుకు మహిళా ఎం.పిలు ఆగ్రహించారు. రేప్‌లు జరగడానికి వస్తధ్రారణ ఒక కారణం అన్నందుకు లౌకిక పార్టీలు నానా రాద్ధాంతం చేసాయి. నువ్వు మారాలి అనగానే రిషిత సరే అనడం అసహజమే. క్రైం కథ ఉత్కంఠభరితంగా ఉంది.
-ఎన్.గిరిధర్ (కాకినాడ)
మహావాది
చెప్పలేనన్ని చురకలతో సాగుతూ, మహా సంగీతజ్ఞుల స్వభావాలు పేర్కొంటూ, అన్నీ ఉన్నా, ఎగబడని నిశ్చల నదిగా ఉన్న, జీవించిన, ఆత్మాభిమాన మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీగారిని, కుంతీ కుమారి పద్య గాయకుడిని, పాఠకులకు పరిచయం చేసిన మల్లాది సూరిబాబు గార్కి ధన్యవాదాలు. ఆర్భాటాలు, ప్రచారాలకు దూరమై, మరుగున పడ్డ మాణిక్యంగా ఈ తరం వారికి అసలే తెలీని ఒక మహా సంగీత స్రష్ఠ గురించి చెప్పిన విశేషాలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి.
-ఆర్.కె. (హైదరాబాద్)
దృష్టాంతం
కిందపడి గాయపడ్డ పిచ్చుక ఆకాశంలోకి ఎగిరిపోయిన వైనం దృష్టాంతంగా చూపి ఆ పిచ్చుక లాగ ఎగురుదామా? నేల మీదనే ఉంటూ బాధతో కుంగిపోదామా అంటూ ‘ఓ చిన్న ప్రశ్న (మాట)గా చెప్పడం బాగుంది. కుందేళ్లు, పిల్లులకు ఉన్నట్టే ఇప్పుడు ఎలుకలకూ ఒక హోటల్ తెరవడం ముచ్చటగా అనిపించింది. ‘ఆపాత సమయాలు’ కవిత మలయ మారుతంలాగ గుండెల్ని హాయిగా తాకింది. అమృతవర్షిణిలో సంకల్ప సిద్ధులు, సంగీత రసజ్ఞులు గురించి చెప్పిన విషయాలు ఆకట్టుకున్నాయి. హిప్నటైజ్ చేయడం వృత్తిగాగల ఆర్నాల్డ్ ఎవరినైనా హిప్నటైజ్ చేయగలననడం నమ్మదగ్గది కాదు. మనసు అనుగుణంగా సమ్మతించకపోతే హిప్నటిజం కుదరదు.
-సదాప్రసాద్ (గొడారిగుంట)
మరింత లోతుగా...
అన్ని జీవులలోనూ ఉన్నది అవే రసాయనాలు. మనిషి గమనించిందీ, ఆలోచించిందీ తక్కువే అయినా ఆ తక్కువ తెలివిడితోనే విశ్వం మొత్తం గురించి ముందుకు ఆలోచనలు సాగుతున్నాయి అంటూ ‘మరింత లోతుగా’ చెప్పిన విషయాలు కొన్ని మా పరిధిని దాటినా స్థూలంగా అర్థమైంది. ‘లోకాభిరామమ్’ ద్వారా ఎన్నో విశేషాలను తెలుసుకొంటున్నాం. హిప్నటిజం, టెలిపతి గురించి చెప్పిన కథనం చదువుతుంటే సినిమా చూస్తున్నట్లుంది గాని నమ్మకం కుదరలేదు. ఇలాంటి విషయాలపై యథార్థాల్ని గోపాలంగారు చెప్తే బాగుంటుంది. ఆయన మరింత లోతుగా చెప్తారు కాబట్టి ఈ విషయాలపై కూడా ఆయన వ్యాసం రాయాలని మా విజ్ఞప్తి. చీమలకు రెక్కలు ఎందుకు వస్తాయో తెలుసుకొని ఆశ్చర్యపోయాం.
-హెచ్.పవన్‌పుత్ర (రామారావుపేట)
గొప్ప సమాధానం
మనం ఎన్నో లక్ష్యాలు ఏర్పరచుకుంటాం గానీ దేన్నీ పూర్తి చేయలేం. ఎవర్నీ సంతృప్తి పరచడానికివి అని ప్రశ్నించుకుంటూ ఆలస్యం చేస్తూంటాం. అయితే మనల్ని మనమే సంతృప్తి పరచుకోడానికే లక్ష్యాలు సాధించాలని ‘ఓ చిన్న మాట’లో గొప్పగా సమాధానం చెప్పారు. బాగుంది. గానగంధర్వ స్వర ఝరి అంటూ కుంతికుమారిని వర్ణించారు అమృతవర్షిణిలో. దశాబ్దాల క్రితం కాకినాడలో వినాయక చవితి, దసరాలకు పందిళ్లు వేసి హరికథలు, బుర్రకథలు, నాటకాలు ఏర్పాటు చేసేవారు. ఆనాటి హరికథల్లో సందర్భాన్నిబట్టి, కుంతికుమారి, పుష్పవిలాపం కవితలు గానం చేసేవారు. నిజమే. ఆ కవితలు గానగంధర్వ స్వర ఝరులే.
-పి.శుభ (కాకినాడ)
నిఘా నేత్రం
మనకు తెలియని ఒక నిఘా నేత్రం మనల్ని భౌతికంగానే కాక మన అంతరంగాన్ని కూడా సదా పర్యవేక్షిస్తూ ఉంటుందని, ఈ విషయం గుర్తించి మన నడవడికను సరిదిద్దుకొని ప్రయాణం సాగించాలని చెప్పిన ‘సండే గీత’ చక్కగా ఉంది. కెనడా ప్రజలను నాలుగు రోజులపాటు అలరించిన జెయింట్ డ్రాగన్, జెయింట్ స్పైడర్ యంత్రాల మధ్య పోటీ మమ్మల్ని అలరించింది. నిశ్చలమైన సెలయేటిలో సూర్యబింబంతోపాటు దానిపైగల వంతెనల ప్రతిబింబం ఫొటో అద్భుతంగా ఉంది. గుప్పెడు క్షణాలు కవిత, నాగాంజనేయులు మినీ కవితలు ఆహ్లాదకరంగా ఉన్నాయి.
-బి.చంద్రిక (రాజేంద్రనగర్)
లోకాభిరామమ్
ఐదు వారాలు అనవరతంగా తన ఆలోచనలతో పాఠకుల్ని ఊదరగొట్టిన (ఆయన మాటలే) తర్వాత గోపాలంగారు మా దారిలోకి మళ్లడం హాయిగా అనిపించింది. జానే కహాఁ గయే అంటూ మన బాటసారి వెంట మమ్మల్ని తిప్పారు.
-ఆర్.శాంతిసమీర (వాకలపూడి)