S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా ఉందీ వారం? (సెప్టెంబర్ 3 నుండి 9 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక విజయం దగ్గరలోనే ఉంది. అనుకున్నది అవగాహనతో పూర్తి చేయాల్సి వస్తుంది. బకాయిపడ్డ కార్యాలు లక్ష్యాలతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, వ్యవహారాలు, ఐటి రంగాలు లక్ష్య సాధనకు దగ్గరలో ఉన్నాయి. కొన్ని ప్రణాళికలు మార్పునకు లోనవుతాయి. ఒత్తిడికి దూరంగా ఉండండి. మీవారితో సఖ్యతతో మెలగండి. విలువైన వస్తువులు జాగ్రత్త. సంకల్ప సిద్ధి. సంఘంలో గౌరవ మర్యాదాదులు ఉంటాయి. అందరినీ ఆకట్టుకుంటారు. పెట్టుబడులు ఫలితాలకు అనుకూలం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
మీ ఖర్చులు అంచనాలకు అనుగుణంగా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇతరుల ప్రమేయం ఉన్నా మీ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించండి. కార్యసఫలం మీ నైపుణ్యంపై ఆధారపడుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఉత్సాహాన్నిస్తాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక ఫలితాలను అందిస్తాయి. ఒక వార్త ఆలోచింపజేస్తుంది. సంతోషం మీ వెంటే ఉందనుకుంటారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
సంప్రదింపులకు అనుకూలంగా ఆర్థిక ప్రణాళికలు పూర్తి చేస్తారు. ఒక విషయం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సాంకేతిక, రియల్ ఎస్టేట్ రంగాలు నైపుణ్యంపై ఆధారపడి ఉంటాయి. అవకాశాలను సావకాశంగా వినియోగించుకోవాలి. అనుకోని వ్యయాలకు కళ్లెం వేయాలి. పెట్టుబడులు బాధ్యతలకు అనుకూలం. అనుకోని విధంగా పైకం అందుతుంది. వదంతులు నమ్మకండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

విత్త వృద్ధి. ఇరకాటంలో పడకుండా లక్ష్యాలకు అనుగుణంగా కార్యాన్ని సాధిస్తారు. అర్థాంతరంగా పనులు పూర్తి చేయకండి. కొన్ని సమస్యలు ఇబ్బందికరంగా ఉండేట్లున్నాయి. అనుకున్నవి ఆలస్యంగా అవుతాయి. అవగాహనతోనే పరిస్థితుల మేరకు వ్యవహరించండి. నైపుణ్య ప్రదర్శనకు ఇదే సమయం. మొహమాటాలు వద్దు. కుటుంబ వ్యవహారాలు పట్టించుకోవాల్సి వస్తుంది. పనులు వాయిదా వేయకండి. స్పెక్యులేషన్ మిశ్రమం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
ఆర్థిక స్థితి స్వల్ప అనుకూలం. మీ చర్యలను ఇతరులు గమనిస్తున్నారు అన్న భావనతో వ్యవహరించండి. ఉత్సాహాన్ని విడనాడకండి. మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెట్టే వారు ఉంటారు. దీటుగా స్పందించండి. వీలు, వాలు చూసుకుని కార్యాలను నిర్విఘ్నంగా కొనసాగించండి. స్పెక్యులేషన్ పరిమితం. కుటుంబంతో ఆనందం విస్తరిస్తుంది. అనుకున్నవి అంచెలంచెలుగా అందుకుంటారు. హడావిడితనం మంచిది కాదు. స్పెక్యులేషన్ పట్టునిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
కార్యకలాపాలు నచ్చినట్లు చేయండి. ఇబ్బందులు పడకండి. అవసరానికి పైకం అందుతుంది. స్పందన ప్రతిస్పందనలకు అనుగుణంగా అన్నింటా మెలగండి. మంచి సమయం. సమయాన్ని వృధా చేయకండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్పెక్యులేషన్ ఫలప్రదం. ఆధ్యాత్మికత ఉపకరిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అంతా మంచే జరుగుతుంది అనుకోండి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
తులనాత్మక పర్యవేక్షణ ఈ వారం మీకు మంచికి దోహదపడుతుంది. కాంపిటేటివ్ స్పిరిట్, ప్రోగ్రెసివ్ స్పిరిట్ పెంచుకోండి. ఉన్నతంగా ఎదగడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలు గతంకన్నా మెరుగవుతాయి. అన్నింటా విలువ ఒకేలా ఉండదు అన్న విషయాన్ని మననం చేయటం మంచిది. వ్యవహారాలందు గోప్యత మేలు. స్పెక్యులేషన్ విస్తరిస్తుంది. కుటుంబ వ్యవహారాలు పట్టించుకోవాల్సి వస్తుంది. పనులు వాయిదా వేయకండి. స్పెక్యులేషన్ మిశ్రమం.
వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
పనులు వాయిదా వేయకండి. అనుకున్నవి ముందూ వెనకా అయినా పూర్తి చేస్తారు. విలువైన వాటితో ప్రయాణాలందు అప్రమత్తత మేలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలందు ప్రతిభకు గుర్తింపు వర్తిస్తుంది. కుటుంబ సభ్యులు మంచి వార్తలు వింటారు. సంతాన ప్రాప్తి. విదేశీ స్వదేశీ దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలందు మెళకువ పాటించండి. మొహమాటాలు వద్దు. కుటుంబ వ్యవహారాలు పట్టించుకోవాల్సి వస్తుంది. పనులు వాయిదా వేయకండి. స్పెక్యులేషన్ మిశ్రమం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

అందరినీ కలుపుకొని పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. వాతావరణానికి అనుకూలంగా మెలగండి. ఎంచుకున్న రంగంలో విస్తరణకు అవకాశం. సమాజ హితానికై మీ వంతు సాయం చేయండి. స్థల సేకరణకు అనుకూలం. స్పెక్యులేషన్ మిశ్రమం. చిన్న వృత్తుల వారు నిలదొక్కుకునే అవకాశాలున్నాయి. శుభాలను అందుకుంటారు. అనుకున్నవి అంచెలంచెలుగా అందుకుంటారు. హడావిడితనం మంచిది కాదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

సాంకేతికంగా నైపుణ్యం పెంచుకోవటానికి అవకాశాలను వినియోగించుకోండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా సంయమనం పాటించండి. క్రమపద్ధతిలో ముందుకు వెళ్లండి. పెద్దల పరిచయాలు ప్రయోజనకారిగా ఉంటాయి. ఇబ్బందులు మీ దరికి చూసుకోండి. సాయం అవసరం మేరకు తీసుకోండి. అపాయాల జోలికి వెళ్లకండి. స్ర్తిలకు మంచి తరుణం.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

తెలియని వాళ్లు మీ సాయం కోసం వచ్చేట్టున్నారు. స్థాయిని బట్టి వీలుంటేనే సాయపడండి. దానివల్ల ఇబ్బందుల్లో పడవద్దు. పైకం సమయానికి అందుతుంది. కొత్తవి విలువైనవి ఖరీదు చేస్తారు. అనారోగ్య సూచనలు. పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది. ఆత్మ విమర్శ చేసుకోండి. చేపట్టే వాటియందు మీ అనుకూలత చూసుకోండి. కొత్త విషయాలు తెలుస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
మాటికీ తడబడకండి. నిలకడపై మీ ఆలోచనలకు పదును పెట్టాల్సి వస్తుంది. ఆనందం కొన్నింట విస్తరిస్తుంది. వృత్తి, వ్యాపార, వ్యవహార, ఉద్యోగ రంగాలు ప్రయత్నానికి అనుగుణంగా ఉంటాయి. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు. నైపుణ్యాన్ని పెంపొందించుకోండి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మన్ననలు అందుకుంటారు.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855