S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సినారె సంతకం

అది నా అదృష్టం
ఆ కవితా చంద్రుడిని కలిశాను
వెనె్నల్లో తడిసిన కలువపూవులా మురిశాను

సినారె దర్శనం ఆకాశమంత తన్మయత్వం,
గంపెడు పూలవర్షం
ఆనందం అనంతం.

ఆ ఆనందంలో
ఆ మైమరపులో
నమస్కరించాను,
కరచాలనం ఇమ్మంటూ నా అరచేయిని
వారి ముందుకు సాగనంపాను

క్షణకాలం నా కుప్పిగంతులు చూసి
పిల్లాడిని లాలించినట్టు
సన్నగా నవ్విన ‘విశ్వంభర’,

తూనీగని పట్టినట్టు
నా చూపుడు వేలు కొసపై
ఆ రెండు మునివేళ్ల స్పర్శ
మెత్తగా పొడిచిన పచ్చబొట్టు సంతకం
అది నా అదృష్టం.

‘ఏం పేరు’ అన్నారు
చెప్పాను.
‘ఇంటి పేరూ’ అడిగారు.
చెప్పాను
‘చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన’ అని
దీవించినట్టు రాగం వొలికింది
అది నా అదృష్టం.

ముఖా ముఖీ ముగిసింది
మిత్రులు అన్నారు భలే ‘వోడివయ్యా’ అని
ఆలోచించాను
అప్పుడు అనిపించింది
అదృష్టం జారిపోయిందని,
పాదాలు తాకాల్సింది
రెండు అరచేతులు నిండా కవిత్వం
అంటుకునేది కదా!
*

-గజ్జెల రామకృష్ణ 8977412795