S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హైకూలు

త్రాగటానికి
మంచినీళ్లు లేవు
రైతు కళ్లల్లో నిండుగా
రాత్రి
ఆకులు రాలితే
చెట్టు వణికింది

పలక మీద
అక్షరాలు బాల్యానికి
వీలునామా

వాకిట్లో
రంగవల్లి
చూపుల జలపాతం

చూపుల చినుకులతో
ఇంట్లో తుఫాను
బుల్లితెర

రొయ్య మడుగులతో
కాలుష్యం
నేలతల్లి గుండె నిండా
చీమ
క్రమశిక్షణ
మనిషికి లేదు

బావిలోనికి
తొంగి చూసింది చెట్టు
కృతజ్ఞతగా.

వెండితెర
ఇంద్రధనస్సు
జీవితం చీకటి వల

కాలువ నీరు
వదిలారని మురిసింది
చేప పిల్ల!

-నల్లా నరసింహమూర్తి 92475 77501