S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బిజీ బిజీగా..!

నవతరం కథానాయికలకు టాలీవుడ్ ఎప్పుడూ అక్కున చేర్చుకుంటూనే వుంటుంది. వారి ప్రతిభను గుర్తించి తమ చిత్రాల్లో మంచి పాత్రలు చేసేలా ప్రోత్సహిస్తుంటుంది. ఇప్పుడు అలాంటి కోవలోకే చేరింది బ్యూటీ మేఘా ఆకాశ్. తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తూనే మంచి అవకాశాలను తన ఖాతోలో వేసుకుంటూ బిజీ బిజీగా మారుతోంది. యంగ్ హీరో నితిన్ 25వ చిత్రంతో పాటు, రామ్‌తో మరో సినిమాలో నటిస్తూ యమ స్పీడుగా ఉరకలేస్తోంది మేఘా. తొలి సినిమా అవకాశం వచ్చినప్పటికంటే గౌతమ్‌మీనన్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసినప్పటి కంటే కూడా ‘లై’ సినిమాతో మేఘా ఆకాశ్‌లో ఎంతో హ్యాపీనెస్ కనిపిస్తోంది. విడుదల పరంగా చూస్తే ‘లై’ ఈ అమ్మడికి తొలి చిత్రం. మొదటగా తమిళంలో రెండు చిత్రాల్లో నటించింది. అయితే ఆ చిత్రాలు ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. వెండితెరపై వెలిగిపోవాలన్న తన కల టాలీవుడ్‌లో ‘లై’తో తీరింది. తనను తాను ముందుగా తెరపై చూసుకునే అవకాశం కల్పించింది తెలుగు చిత్రసీమ. టాలీవుడ్ - కోలీవుడ్ ఇలా రెండు పడవల ప్రయాణాన్ని కెరీర్ ప్రారంభంలోనే మొదలుపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఇలాంటి ప్రయాణం తప్పదని కూడా చెబుతోందిట మేఘా. ఈ విషయం గురించి మేఘాను కదిలిస్తే- ‘‘ప్రస్తుతం నా కెరీర్ హ్యాపీ హ్యాపీగా సాగుతోందనిపిస్తోంది. తమిళ చిత్రసీమ ద్వారా వెండితెర అవకాశాలను అందిపుచ్చుకున్న నన్ను తెలుగు చిత్రసీమ తొలిసారిగా తెరపై చూపించింది. ఆ ఆనందం అంతా ఇంతా కాదు. తమిళంలో నటించిన తొలి రెండు చిత్రాలు ఇంకా విడుదలవకుండా తెలుగులో ‘లై’ నన్ను ప్రేక్షకుల ముందుంచింది. అందుకు నేనే టాలీవుడ్‌కు ఎంతో రుణపడి వుంటా. ఇక్కడి ప్రేక్షకులు, చిత్రసీమ నాపై కురిపిస్తున్న అభిమానానికి సదా కృతజ్ఞురాలిని. నితిన్, రామ్ చిత్రాలతో పాటు మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాను. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తా’’నంటూ చెప్పుకొచ్చింది మేఘా ఆకాశ్. వాహ్..ఇక అంతా బిజీ బిజీగానే మేఘా కెరీర్‌ని చూడబోతున్నాం. ఆల్ ది బెస్ట్ మేఘా!

-సమీర్