S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రేజీ గర్ల్!

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా రూటే సపరేటు. బాలీవుడ్‌లో శత్రఘ్న సిన్హా తనయగా వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. కెరీర్‌లో క్రేజీభామగా బాలీవుడ్‌లో ఉన్నత స్థాయికి ఎదిగింది. తనకు లభించిన చిత్రాల్లో తను పోషించిన మంచి పాత్రలే కెరీర్‌లో ఎదిగేలా చేసాయంటోంది సిన్హా. ‘‘నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకోను కూడా. నటనకు అవకాశం వున్న క్యారెక్టర్స్ కూడా చేస్తానని నిరూపించుకోవడానికే ‘లూటేరా’లాంటి సినిమాలో నటించానని కొందరు నా గురించి అంటుంటారు. నేను ఆ సినిమా చేసింది వరుస కమర్షియల్ చిత్రాల మధ్యలో కొంచెం రిలీఫ్ ఉంటుందనే. సినిమా చిత్రీకరణ సమయంలోనూ అలానే అన్నారు. కానీ నేను పట్టించుకోలేదు. అందుకే ఆ చిత్రంలో నా క్యారెక్టర్ అంత బాగా పండింది. నేను ఆలోచించేది ఒక్కటే అదే.. నా క్యారెక్టర్ గురించి. పోషించే పాత్ర ప్రేక్షకులకు ఎంత బాగా చేరువవుతుందనేదే అలోచిస్తా’’అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి. తండ్రికి తగ్గ తనయనే!