S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దటీజ్.. అనుష్క!

టాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాదిన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొంటున్న భామల జాబితాలో అనుష్క పేరు కూడా వుంటుంది. అతి తక్కువ సమయంలో కోటి రూపాయల మార్కుని చేరుకోగలిగింది ఈ బ్యూటీ. నటించిన చిత్రాల్లో అనుష్క చేసిన క్యారెక్టర్స్ వేటికవే భిన్నంగా వుండడంతో అటు చిత్రసీమ, ఇటు ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఒకటా.. రెండా ఎన్నో వైవిధ్యమైన, అరుదైన పాత్రల్లో నటించి జీవించింది. ఆయా పాత్రలకు అనుష్క జీవం పోసింది అంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. మనం చూస్తున్న చాలా చిత్రాల్లో కథానాయికల పాత్ర పరిధి అంతంత మాత్రమే కనిపిస్తోంది. హీరోల చుట్టూ తిరిగే పాత్రలకే చిత్రాలు పరిమితమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క కథానాయిక ప్రాధాన్యత వున్న చిత్రాలు చేసి తనకు తానే సాటి అనిపించుకుంటోంది. హీరోల డామినేషన్ అనుష్క చిత్రాల్లో కనిపించదు. కథకు ప్రాధాన్యం వున్న చిత్రాలనే అనుష్క ఎంపిక చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు పయనిస్తోంది. ఈ విషయం ఆమె చేసిన చిత్రాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. అయితే కోటి రూపాయల మార్క్ దాటిన కథానాయికల జాబితాలో చోటు గురించి అనుష్కను కదిలిస్తే- ‘‘ హీరోల రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడైనా, ఎవరైనా అడుగుతున్నారా? కనీసం వారు తీసుకుంటున్న పారితోషికాల ప్రస్తావన ఎక్కడైనా మనకు కనిపిస్తుందా? కేవలం కథానాయికల రెమ్యూనరేషన్ గురించి మాత్రమే మీడియా ఆసక్తి కనబరుస్తుంది ఎందుకు? నేను మాత్రం ఆలోచించేది నేను చేసే చిత్రంలో నా క్యారెక్టర్ గురించి మాత్రమే. పారితోషికాల మాట నాకు సంబంధించినది కాదు. ఎంత తీసుకున్నాం.. ఎంతిచ్చారు? అన్న సంగతి నాకు అక్కర్లేదు. కోటి రూపాయాల మార్క్ విషయం గురించి నేను అస్సలు ఆలోచించను’’అంటూ ఎంతో తెలివిగా, సాఫీగా సమాధానమిచ్చింది. దటీజ్..అనుష్క!

-సమీర్