S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 52 మీరే డిటెక్టివ్

ఆయన ఆ రోజు కథని ఇలా చెప్పాడు.
లక్ష్మణుడు వెంట రాగా రాముడు చెప్పింది విని ప్రియంగా మాట్లాడే, ప్రియమైన మాటలే పలికే సీత ప్రేమతో కూడిన కోపంతో ఇలా చెప్పింది.
‘రామా! నాకు సమాచారం వేగుల ద్వారా అందింది. నువ్వు చెప్పేది ఏమిటి? అర్థం లేని ఈ మాటలకి తప్పక నీకే నవ్వొస్తుంది. నాకూ నవ్వొస్తోంది. ఆర్య పుత్రా! తల్లిదండ్రులు, సోదరుడు, కొడుకు, కోడలు లాంటి వారంతా తమ పూర్వ ఫలాన్ని అనుసరించి ఆయా ఫలితాలని అనుభవిస్తారు. ఎవరు చేసిన పాప పుణ్యాలని వారే అనుభవిస్తారు. భార్య ఒక్కతి మాత్రమే భర్త భాగ్యాన్ని పంచుకుంటుంది. అందువల్ల నిన్ను అడవికి వెళ్లమని ఆజ్ఞాపించినట్లైతే నన్ను కూడా ఆజ్ఞాపించినట్లే. స్ర్తికి తండ్రి కాని, కొడుకు కాని, తనకి తానే కాని, తల్లి కాని, స్నేహితురాళ్లు కాని గతి కారు. ఇహ లోకంలోనైనా, మరణానంతరం ఐనా భర్త ఒక్కడే స్ర్తిలకి ఉత్తమ గతి.
‘రామా! నువ్వు ఇప్పుడే కీకారణ్యానికి బయలుదేరేట్లైతే నేను కూడా నీ ముందే నడుస్తూ దర్భలని, ముళ్లని నలక్కొట్టి నీకు నడవడానికి సుఖంగా ఉండేలా చేస్తాను. వీరా! నీ మాటని విననందుకు నీకు కలిగే ఈర్ష్యని, కోపాన్ని వదిలేసి నన్ను కూడా తీసుకెళ్లు. అత్యుత్తమమైన భవనాల కంటే, మేడల మీద నివాసం కంటే, ఆకాశ సంచారం కంటే భర్త పాదాల నీడ దగ్గర ఉండటం గొప్ప. అనేక విషయాల గురించి నా తల్లిదండ్రులు నాకు ఇదివరకే చెప్పారు. అందువల్ల నేను ఎలా నడచుకోవాలో ఇప్పుడు నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మానుష్యమైనది, అనేక జంతువులతో ఉన్నది, పులులు, తోడేళ్లు మొదలైన వాటికి నివాసమైంది, ప్రవేశించడానికి కష్టమైంది ఐన అరణ్యానికి నేను కూడా వస్తాను. నేను మూడు లోకాల గురించి ఆలోచించను. కేవలం భర్తకి సేవ చేయడం గురించే ఆలోచిస్తాను. పుట్టింట్లో ఉన్నట్లుగా అడవిలో సుఖంగా ఉంటాను. నిత్యం నీ సేవ చేస్తూ నియమంగా బ్రహ్మచర్యాన్ని అవలంబించి, తేనెల వాసనలతో నిండిన అరణ్యంలో నీతో విహరిస్తాను. గౌరవాన్ని రక్షించే ఓ రామా! నువ్వు ఇక్కడ, అడవిలో కూడా ఇతరుల్ని సంరక్షించగల సమర్థుడివి. ఇంక నా మాట చెప్పాలా? ఈ రోజు నీతో కూడా నిస్సందేహంగా అడవికి వస్తాను. నా నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరు. నేను నిస్సందేహంగా రోజూ ఫల మూలాల్ని మాత్రమే తింటాను. నీకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నీతో కలిసి జీవిస్తాను. నదులు, పర్వతాలు, చిన్న చెరువులు, వనాలు చూడాలని కోరుకుంటున్నాను. వీరుడివైన నీతో కలిసి హంసలతోను, కారండవ పక్షులతో ఉన్న, చక్కగా పుష్పించిన పద్మ సరస్సులని సుఖంగా చూడాలని కోరుకుంటున్నాను. స్థిరమైన వ్రతాన్ని ఆచరిస్తూ ఆ తామర కొలనుల్లో స్నానం చేస్తూ, నీతో క్రీడిస్తూ ఆనందం పొందుతాను. ఇలా నీ సాంగత్యంలో వంద సంవత్సరాలైనా నా సుఖ సంతోషాల్లో ఎలాంటి భేదం ఉండదు. నరుల్లో శ్రేష్ఠుడివైన ఓ రామా! నువ్వు లేకుండా స్వర్గ నివాసం కూడా నాకు ఇష్టం లేదు. మృగాలతో, కోతులతో, ఏనుగులతో నిండి, ప్రవేశించడానికి చాలా కష్టమైన అడవికి వచ్చి నియమంతో నీ పాదాల దగ్గర ఆ అడవిలో పుట్టింట్లోలా సుఖంగా నివసిస్తాను. నీ మీదే ప్రేమగల మనసుతో, ఇతర ఆలోచనలు ఏమీ లేకుండా ఉన్న నేను నీతో వియోగం ఏర్పడితే మరణించాలని నిశ్చయించుకున్నాను. కాబట్టి నా కోరికని మన్నించి నన్ను తీసుకెళ్లు. అందువల్ల నేను నీకేం భారం కాను’
ధర్మాత్ముడైన రాముడు సీత ఇలా చెప్పినా ఆమెని తీసుకెళ్లడానికి అంగీకరించలేదు. ఆమె మనసుని మరల్చడానికి వనవాసంలోని కష్టాల గురించి ఆమెకి చెప్పాడు. (సర్గ 27)
సీత ఇలా మాట్లాడుతున్నా ధర్మంగా నడుచుకునే, ధర్మం అంటే ఇష్టం గల రాముడు అడవుల్లో కలిగే దుఃఖాల గురించి ఆలోచిస్తూ ఆమెని తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. ఏడ్చే సీతని ఓదార్చి అడవికి వచ్చే ఆలోచన నించి ఆమెని మరల్చడానికి ఇలా చెప్పాడు.
‘సీతా! నువ్వు ఉత్తమ కులంలో పుట్టినదానివి. ఎల్లప్పుడూ ధర్మం మీచద ఆసక్తి కలదానివి. నువ్వు ఇక్కడే ఉండి నీ స్వధర్మాన్ని ఆచరిస్తే నా మనసుకి ఆనందం కలుగుతుంది. అబలవైన ఓ సీతా! నేను చెప్పినట్లు చెయ్యి. అడవిలో అనేక కష్టాలు ఉంటాయి. కాబట్టి అడవికి వెళ్లాలనే ఆలోచనని విడిచిపెట్టు. అవి చెప్తాను విను. సీతా! ప్రవేశించడానికే వీలుపడని అరణ్యంలో ఎన్నో కష్టాలు ఉన్నట్లు అంతా చెప్పుకుంటారు కదా. నేను నీ మంచి కోరి చెప్తున్నాను. ఎప్పుడైనా అడవి దుఃఖకరం. అక్కడ సుఖం ఎప్పుడూ కలగదు. పర్వతాల నించి పడే సెలయేళ్ల చప్పుళ్లు, పర్వత గుహల్లో నివసించే సింహాల గర్జనలు వింటే భయం కలుగుతుంది. అందువల్ల అడవి దుఃఖకరం. నిర్మానుష్యమైన అరణ్యాల్లో మత్తెక్కి నిర్భయంగా క్రీడించే క్రూరమృగాలు మనుషుల్ని చూడగానే మీదకి వస్తాయి. అందువల్ల అడవి దుఃఖకరం. మొసళ్లతోను, బురదతోను, మదించిన ఏనుగులు కూడా దాటేందుకు వీల్లేనట్లుగా నదులు ఉంటాయి. అందువల్ల అడవి ఎప్పుడూ దుఃఖకరం. దారులన్నీ డొంకలతో, ముళ్లతో నిండి ఉంటాయి. అడవి కోళ్ల కూతలు ప్రతిధ్వనిస్తూంటాయి. నీరు దొరకదు. ఇలా అరణ్యంలో ప్రవేశించడం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల అడవి దుఃఖకరం. పగలంతా శ్రమ పడ్డాక రాత్రుళ్లు తమంతట తాముగా రాలిపడ్డ ఆకుల పక్కల మీద, నేల మీదే పడుకోవాల్సి ఉంటుంది. అందువల్ల అడవి దుఃఖకరం. రాత్రి, పగళ్ల నియమాల ప్రకారం తమంతట తాముగా చెట్ల నించి రాలిపడే పళ్లతో తృప్తి చెందాలి. అందువల్ల అడవి దుఃఖకరం. అడవుల్లో నివసించే వాళ్లు యథాశక్తిగా ఉపవాసం చేస్తూ, నార చీరలని, జటాభారాన్ని ధరించి ఉండాల్సి ఉంటుంది. అందువల్ల అడవి దుఃఖకరం. దేవతలని, పితృదేవతలని, వచ్చిన అతిథులని నిత్యం యథావిధిగా పూజిస్తూండాలి. అడవిలో నివసించే వారు ఎప్పుడూ నియమంగా ఆయా కాలాల్లో ప్రతీరోజూ మూడుసార్లు స్నానం చేయాల్సి ఉంటుంది. అందువల్ల అడవి దుఃఖకరం. సీతా! అడవిలో నివసించే వాళ్లు దొరికిన ఆహారంతో తృప్తి పడాలి. అందువల్ల అడవి దుఃఖకరం. అడవుల్లో పెనుగాలులు వీస్తూంటాయి. చీకటి దట్టంగా ఉంటుంది. ఎప్పుడూ ఆకలి వేస్తూంటుంది. అనేకమైన భయాలు కలుగుతాయి. అందువల్ల అడవి దుఃఖకరం. నదుల్లో నివసిస్తూ, నదుల్లా వంకరగా నడిచే పాములు దారికి అడ్డంగా ఉంటాయి. అందువల్ల అడవి దుఃఖకరం. పక్షులు, తేళ్లు, పురుగులు, ఈగలు, దోమలు నిత్యం అందర్నీ బాధ పెడుతూంటాయి. అబలవైన నువ్వు ఆ బాధని భరించలేవు. అందువల్ల అడవి దుఃఖకరం. సీతా! అడవుల్లో చెట్లు, దర్భలు, ముళ్లతో నిండిన కొమ్మలు ఒక దాంతో మరోటి పెనవేసుకుని ఉంటాయి. అందువల్ల అడవి దుఃఖకరం. అడవుల్లో నివసించేవాడు అనేక శారీరక కష్టాలని అనుభవించాల్సి ఉంటుంది. వాడికి ఎన్నో భయాలు ఉంటాయి. అందువల్ల అడవిలో దుఃఖమే తప్ప సుఖం ఉండదు. అడవుల్లో నివసించే వారు క్రోధ, లోభాలని వదిలి మనసుని తపస్సు మీద నిలపాలి. భయపడాల్సి వచ్చినా భయపడకూడదు. అందువల్ల అడవి ఎప్పుడూ దుఃఖకరం. ఈ కారణాల వల్ల నువ్వు అడవికి రావద్దు. నీకు అడవి నివాసయోగ్యం కాదు. ఆలోచించే కొద్దీ అడవిలో కష్టాలే కనిపిస్తున్నాయి’
హరిదాసు పానకం తాగి ఇలా పూర్తి చేసాడు.
‘ఇలా సీతకి రాముడు అడవి ఎందుకు దుఃఖకరమో పద్దెనిమిది కారణాలని చెప్పాడు. కాని మహాత్ముడైన రాముడు తనని అడవికి తీసుకెళ్లడానికి ఒప్పుకోకపోవడంతో సీత చాలా విచారిస్తూ రాముడితో ఇలా చెప్పింది. (సర్గ 23)
ఆ రోజు ఆశే్లష తన దగ్గర ఉన్న అయోధ్యకాండలోని ఆ రెండు సర్గలని చూసుకుంటూ హరిదాసు చెప్పేది విన్నాడు. అతనికి హరిదాసు చెప్పిన దాంట్లో ఆరు తప్పులు కనిపించాయి. మీరు కనుక్కోగలరా?

*
మీకో ప్రశ్న
*
శ్రీ సత్యసాయిబాబా రాముడి మీద
రాసిన పుస్తకం పేరేమిటి?
*
గత వారం
‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
కాళిదాసు సంస్కృతంలో రాముడి మీద రాసిన పుస్తకం పేరేమిటి?
రఘువంశం
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.రాముడు తన ఇంట్లోకి లక్ష్మణుడితో ప్రవేశించాడని వాల్మీకి ఈ ఘట్టంలో రాయలేదు. హరిదాసు అది తప్పుగా చెప్పాడు.
2.్భరతుడికి రాజ్యాన్ని అప్పగించాడు అని సీతకి రాముడు చెప్పాడు. (అంటే ఆ వరం అప్పటికే తీరినట్లుగా, రాజ్యాభిషేకం కేవలం లాంఛనంగా రాముడు భావించాడు) కాని ‘అప్పగిస్తాడు’ అని సీతకి చెప్పినట్లుగా హరిదాసు చెప్పాడు.
3.్భరత, శత్రుఘు్నలని నీ సోదరుల్లా, కొడుకుల్లా చూసుకోవాలి అని రాముడు చెప్పాడు. సోదరుల్లా అన్నది హరిదాసు చెప్పలేదు.
4.్భరత, శత్రుఘు్నలని నీ సోదరుల్లా, కొడుకుల్లా చూసుకోవాలి అని చెప్పాడు తప్ప రాముడు లక్ష్మణుడి పేరుని చెప్పలేదు. కాని హరిదాసు తప్పుగా లక్ష్మణుడి పేరుని కూడా చెప్పాడు.
5.హరిదాసు నాలుగు తప్పులనే చెప్పాడు. కాని వైష్ణవుడు తనే ఓ పొరపాటు చేస్తూ ఐదు తప్పులని చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి