S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కబీరు విందు

కబీరు బోధనలు విలువైనవి. సంప్రదాయానికి భిన్నమైనవి. కబీరు దేవుడు హిందువు కాడు, ముస్లిం కాడు. కబీరు బోధనలు మార్మికమయినవి.
కబీరు కాశిలో నివాసమేర్పరచుకుని అపూర్వమయిన తన వాణిని వినిపించాడు. ఆయన మణిపూస లాంటి మాటలకు ఎందరో ఆకర్షింపబడ్డారు. పేదలు, సంపన్నులు, అన్ని మతాల వాళ్లు, వర్గాల వాళ్లు ఆయన వాక్కులు విని తరించే వాళ్లు. కబీరు నేత పనివాడు. మగ్గంలో నేసిన వస్త్రాలు అమ్మి జీవించే వాడు. నిరాడంబరుడు.
సంప్రదాయ వాదులయిన హిందువుల, ముస్లింల మత పెద్దలు కబీర్ మీద కక్ష పెంచుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కారణం ఆయన బోధనలు భిన్నమైనవి. రెండు మతాల ఛాందసాన్ని విమర్శించేవి.
కబీరు మనుషులు దేవుణ్ణి అనే్వషించాలి. అయితే దేవుడు బయట లేడు. మనుషుల హృదయాల్లో వున్నాడు. ఎవరికి వారు దేవుణ్ణి వాళ్ల హృదయాల్లోనే వెతకాలి. గుళ్లకు, మసీదులకు వెళితే దేవుడు కనిపించడు అన్నాడు.
అందువల్ల మత పెద్దలు ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నారు. కానీ కబీరు అదేమీ పట్టించుకునేవాడు కాదు. తన మార్గంలో తను బోధనలు చేసేవాడు. ఆయన బోధనలు వినడానికి అన్ని చోట్ల నుండి విశేషంగా జనం వచ్చేవాళ్లు.
కబీర్‌ను దెబ్బ కొట్టడానికి మత పెద్దలంతా కలిసి ఒక ప్రణాళిక వేశారు. కబీరు గొప్ప సంపన్నుడని ఫలానా రోజు ఆయన గొప్ప యజ్ఞం చేయబోతున్నాడని ఆ రోజు మంచి విందు భోజనం పెడుతున్నాడని, జనం తండోపతండాలుగా తరలి రావాలని ప్రకటించారు. ఆ రోజు రానే వచ్చింది. ఇదంతా కబీరుకు తెలీదు. జనం గుంపులు గుంపులుగా వచ్చారు. పరిసరాలు కిటకిటలాడిపోయాయి.
కబీరుకు అప్పుడు అసలు నిజం తెలిసింది. ఆయన పేద నేత పనివాడు. ఇంత మందికి ఆతిథ్యమిచ్చే స్థోమత లేనివాడు. ఇట్లాంటి పరిస్థితిలో ఏమీ తోచక ఆయన కాశీని వదిలి ఊరు చివరికి వెళ్లిపోయాడు. ఒక చెట్టు కింద కూచుని ఏమి చెయ్యాలో తెలీక దిగాలు పడ్డాడు.
ఆయన వెళ్లిన వెంటనే దేవుడు రంగంలోకి దిగాడు. ఎవరి ప్రమేయం లేకుండా విందు భోజనాలు ప్రత్యక్షమయ్యాయి. అద్భుతమైన విందు. ఆ భోజనాలు తిని జనమంతా ‘కబీరు మహానుభావుడు, దాత’ అని కీర్తిస్తూ వెళ్లారు.
ఆ సంగతేమీ కబీరుకు తెలీదు. జనం తన గురించి నిందించుకుంటూ ఉంటారని ఆయన చీకటి పడ్డాక యింటి వేపు వచ్చాడు. చూస్తే అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. సుష్ఠుగా భోంచేసి జనం వెళ్లారని ఇంట్లో వాళ్లు చెబితే ఆశ్చర్యపోయాడు. ఆయన ఈ దైవలీలకు కన్నీళ్ల పర్యంతమయ్యారు. దేవునికి కృతజ్ఞతలు ప్రకటించారు.
ఆ సందర్భంగా ఆయన ఇలా అన్నాడు.
ఇది నేను చెయ్యలేదు. నేను చెయ్యలేను కూడా.
ఈ శరీరం ఇవేవీ చెయ్యగల సామర్థ్యం లేనిది.
ఏది జరిగినా అదంతా దేవుడు చేసిందే.
ఆయన దయ వల్ల జరిగింది.
ఫలితమేమో కబీరుకు దక్కింది.

- సౌభాగ్య, 9848157909