S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అందరివాడు

అందలమెక్కిన అందరివాడు ‘కవర్‌స్టోరీ’ మాకెంతో నచ్చింది. ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారానికి అనంతపురానికి వచ్చినపుడు వారి ఉపన్యాసం వినడం జరిగింది. ఆయన గొప్ప ఉపన్యాసక చక్రవర్తి. ఏ భాషలోనైనా అనర్గళంగా ఉపన్యసించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేయగల వ్యక్తి. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు అందించిన చేయూత మరువరానిది.
-కైప నాగరాజు (అనంతపురం)
నమ్మకం
అందలమెక్కిన అందరివాడు వెంకయ్య నాయుడు ఉపరాష్టప్రతి పదవిని మిక్కిలి హుందాగా, హృద్యమంగా తప్పక అలరించగలరనే నమ్మకం అశేష ప్రజానీకానికి ఉన్నది. ఆయన గంభీరత, సున్నితత్వం, సందర్భానుసార వాక్చాతుర్యం అందుకు తోడ్పడగల స్వభావ లక్షణాలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. చిన్నతనంలో తల్లి గతించినా, కన్నతల్లి లాంటి బిజెపిని రాష్ట్రంలోను, దేశంలోనూ ఆ రోజుల్లో అంతగా ప్రజాదరణ లేకపోయినా, విడవకుండా అంటిపెట్టుకుని నేడు దేశంలో అతి పెద్ద పార్టీగా ఎదగడానికి తన వంతు అశేష కృషి సల్పిన కృషీవలుడాయన. గతంలో తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు వెన్నుపోటుకు గురై, పదవి పోగొట్టుకున్నప్పుడు న్యాయ ధర్మాల ననుసరించి ఎన్టీఆర్‌కు వెన్నుదన్నుగా నిలబడి తిరిగి ఎన్టీఆర్‌ను పదవిలో నిలబెట్టిన ఘనుడాయన. రాష్ట్ర అసెంబ్లీ సభ్యునిగా కూడా ప్రజావసరాల కోసం సింహంలా గర్జించి ప్రభుత్వాన్ని నిలదీసిన ధీరుడాయన. రాజకీయాలలో ఉంటే ప్రజల మధ్య గడపవచ్చుననే ఆయన భావన మెచ్చుకోదగినదే. అయితే ఉపరాష్టప్రతిగా రాజ్యసభలో తన చాతుర్యంతో ప్రజల అభీష్టాలను తీర్చే విధంగా ఎగువ సభ సభ్యులను తీర్చిదిద్దగలరనే ఆశ, నమ్మకం ప్రజలకున్నాయి. చక్కటి వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
విలువ
పరిస్థితులెలా ఉన్నా మనిషి విలువ మారదు. ప్రతిభా పాటవాలు, శక్తియుక్తులు, తెలివితేటలు చెక్కులాంటివి అని చెప్పిన ‘సండే గీత’ వెరీగుడ్. ఆకేషియా చెట్టు వెనక నిలిచిన జిరాఫీ శరీరం కనిపించకుండా చెట్టుపై జిరాఫీ మెడ, తల మొలిచినట్టు తీసిన ఫొటో అద్భుతంగా ఉంది. సహాయనిధి కోసం రబ్బరు బాతులు అమ్మి వాటిని నదిలోకి వదిలి ఏ బొమ్మ అయితే ముందుగా ఫినిషింగ్ లైన్‌కి చేరుకుంటుందో ఆ బొమ్మ కొన్నవారికి బహుమతి ఇవ్వడం భలే ఐడియా! ‘మనుషులమే’ అన్న గిరిధర్ కవిత బాగుంది. ముఖ్యంగా ‘అన్నింటికి కారణం మనుషులే. అన్నింటికి మూలం మనుషులే. తోడై మెలగాలి. నీడై నిలవాలి’ అన్న పంక్తులు ది బెస్ట్!
-పి.శాండిల్య (కాకినాడ)
ప్రయాణం
మనిషి జీవితం ప్రయాణం లాంటిది. అందులోనూ రైలు ప్రయాణం లాంటిది. మంచి జ్ఞాపకాలు మిగుల్చుకొని క్షమ, కరుణ కురిపించి ప్రయాణం కొనసాగించాలన్న ‘ఓ చిన్న మాట’ మహత్తరంగా ఉంది. ‘ఏవీ నా బావులు?’ కవిత మాకెంతో నచ్చింది. సుస్వరానికి భూషణం శుద్ధమైన మనస్సంటూ ‘అమృతవర్షిణి’లో చెంబై వైద్యనాథ భాగవతార్ గురించి చెప్పిన విషయాలు అలరించాయి. గని కూలి హెలెన్ చనిపోవడం, కొడుకుని రక్షించమని చనిపోయిన హెలెన్ భర్తని అడగడం, అతడు మరో ఇద్దరి సాయంతో కొడుకుని రక్షించడం, హెలెన్ కనిపించి మాట్లాడటం వొఠ్ఠి భ్రమ అని డాక్టర్ చెప్పడం, కాని అది నిజమే అని సహాయకులు చెప్పడం నిజంగా నమ్మలేని నిజమే.
-పి.చంపక్ (మాధవనగర్)
అజాతశత్రువు
అందరివాడు, అందలమెక్కిన ఆంధ్రుడు, అజాతశత్రువు - ఇలా వెంకయ్యను ఎంత పొగిడినా తక్కువే. సుడిగాలి పర్యటనల్లో దిట్ట. ప్రాసల ప్రసంగ మాంత్రికుడు వెంకయ్య ఏ పదవిలో ఉన్నా దానికి గుర్తింపు తెచ్చాడు. ఇప్పుడు ఉపరాష్టప్రతి పదవీకి వనె్న తెస్తాడు. సందేహం లేదు. ఇకపై రాజ్యసభ తీరు మారుతుంది! దృఢ దీక్ష, పట్టుదల, కష్టపడే నైజం ఉంటే కలలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదని ఆటోడ్రైవర్ శ్రీకాంత్ పైలట్ అయిన వైనం వివరించింది. దట్టంగా నున్నగా మెత్తగా ఉండే వూలు లాంటి బొచ్చున్న వూలీమంకీస్ ఆశ్చర్యం కలిగించాయి. ఈ ప్రపంచంలో ఎన్ని వింతలో!
-కె.సాహిత్యదీప్తి (రమణయ్యపేట)
బాగుంది
చిన్నారుల మాదిరిగానే శునకాలకూ భావోద్వేగాలుంటాయని చెప్పిన చిరువ్యాసం బాగుంది. సాధారణ ప్రచురణే అయినా అవార్డు స్థాయి కథ ‘సిసిటివి కెమెరా’ బాగుంది. ట్రంప్ అనగానే ఉన్మాదుడు, అమెరికన్ అనగానే రేసిస్ట్ అనుకోవడం మనలాగే చాలామందికి అలవాటు. కాని వాస్తవాలు అందుకు భిన్నం అని తెలిపింది ఈ కథ. అలాగే కత్తిపోటు సంఘటనలో మనవాళ్ల ప్రతిస్పందన సహజంగా చిత్రించారు. అతీంద్రియ శక్తులు, శరీరాన్ని విడిచి కోరుకున్న స్థలంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం లాంటివి నమ్మలేని నిజాలే. అయినా వాటిని కేంద్రంగా తీసుకొని చెప్పిన క్రైం కథ ఎంతో బాగుంది. ముగింపు ఊహాతీతం.
-ఎ.చైతన్య (వాకలపూడి)
వకాల్తా
‘లోకాభిరామమ్’లో గోపాలంగారు తెలుగు తరఫున వకాల్తా పుచ్చుకొని చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. కాలక్రమంలో ఉచ్చారణ ఎలా మారిపోయిందో గొప్పగా వివరించారు. పాత, కొత్త మాటలన్నీ కలిపి మాట్లాడుకుంటే భాష బతుకుతుంది. అచ్చ తెలుగు అన్నదే లేదు. వచ్చిన తెలుగు మాట్లాడి పిల్లలకు నేర్పించమనడం ఎంతో బాగుంది. వాడుక తెలుగు పదాలకు అర్థాలు వివరిస్తూ నిఘంటువు తయారుచేయడం గోపాలం లాంటి వారివల్లనే కుదురుతుంది. అందుకే ఆయన పూనుకోవాలి. ఎడమ భాగం ఊదాగా మిగిలిన శరీరం బూడిద వర్ణంలో ఉండే ఆస్ట్రేలియా చిలుకల్ని ఫూల్, స్టుపిడ్ అనడం వింతగానే ఉంది.
-కె.గునే్నశ్ (కొవ్వాడ)