S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్టెమ్‌సెల్స్‌తో పార్కిన్‌సన్స్ వ్యాధికి చెక్ (విజ్ఞానం)

శరీర కదలికలను నియంత్రించే మెదడులోని డొపామిన్ న్యూరాన్‌లు క్షీణించడం వల్ల వచ్చే పార్కిన్‌సన్స్ వ్యాధిని నియంత్రించేందుకు ఉపయుక్తమయ్యే ఓ పరిశోధన ఫలితాలను శాస్తవ్రేత్తలు ప్రకటించారు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి మూలకణాలను రోగి మెదడులోకి పంపడం వల్ల మెదడులో డొపామిన్ న్యూరాన్‌ల ఉత్పత్తి జరిగి రోగి కోలుకుని మామూలుగా శరీరాన్ని కదల్చగలిగే స్థితికి చేరుకోవచ్చన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఒకటి రెండేళ్లలో ఇది ఆచరణాత్మకంగా నిరూపించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. జపాన్‌లోని క్యోటో యూనివర్శిటీకి చెందిన పార్కిన్‌సన్స్ న్యూరోసర్జన్ జున్ తకహషి సారథ్యంలో ఈమేరకు పరిశోధనలు జరిగాయి. పార్కిన్‌సన్స్ తరహా వ్యాధితో బాధపడుతున్న వానరాల మెదళ్లలోకి డొపామిన్ న్యూరాన్లతో కూడిన స్టెమ్‌సెల్‌ను ఇంజెక్ట్ చేసిన తరువాత వాటిలో గుణాత్మకమైన మార్పులను వారు గుర్తించారు. ఆ వ్యాధిబారిన పడి కేజ్‌లో కదలలేని స్థితిలో ఉన్న వానరాలు స్టెమ్‌సెల్స్ జొప్పించిన కొద్దిరోజులకే లేచి అటూతిటూ ఆరోగ్యంగా తిరగడాన్ని వారు గమనించారు. దీంతో వారిలో ఉత్సాహం వెల్లివిరిసింది. మున్ముందు ఈ ప్రయోగాన్ని మానవులపైకూడా చేయాలన్న ఉత్సాహంతో వారున్నారు. వానరాలపై ఇప్పటికే చాలాసార్లు విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ రెండు విషయాలను గమనించాలి. వ్యాధిబారిన పడిన కోతులకు ఆ వ్యాధిని కృత్రిమంగానే వచ్చేలా చేశారు. అదీగాక వ్యాధిపీడిత కోతుల మెదళ్లలోకి మానవుల మూలకణాలను ఇంజెక్ట్ చేశారు. వాటి ఫలితాలు అనూహ్యంగా, ఆశాజనకంగా ఉండటంతో శాస్తవ్రేత్తల బృందం ఉత్సాహంగా ఉంది. మెదడు కణాలలోని న్యూరాన్లను ప్రభావితం చేసే డొపామిన్ రసాయనం శరీర కదలికలను నియంత్రిస్తుంది. పెద్దసంఖ్యలో న్యూరాన్లు క్షీణించడం వల్ల లేదా శక్తిని కోల్పోవడం వల్ల ఆ వ్యాధి వస్తుంది. దానికి ఇలా కృత్రిమ మూలకణాల ద్వారా ఫలితం రాబట్టారు. ప్రస్తుతం ఈ వానరాల్లో జొప్పించిన మూలకణాలు మానవులవే అయినప్పటికీ లాబరేటరీల్లో అభివృద్ధి చేశారు. వాటిని ఇండ్యూస్‌డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ (ఐపిఎస్)గా పిలుస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో వాటిని వాడతారు. మూలకణజాల మార్పిడి తరువాత రోగపీడిత వానరాల్లో వచ్చిన గుణాత్మక మార్పులు ఆధారంగా మానవులపైనా ప్రయోగాలు చేయడానికి శాస్తవ్రేత్తలు సిద్ధమయ్యారు. ఆ ప్రయోగాలకు తగిన రోగుల కోసం అనే్వషణ మొదలుపెట్టనున్నారు. డొపామిన్ లోపం వల్ల శరీరభాగాలు వణికిపోతూ ఉండటం కనిపిస్తుంది. మూలకణాలను పిండం దశలోనే, తల్లిగర్భం నుంచి లేదా బొడ్డుపేగు నుంచి సేకరించడం మామూలే. ఆ మూలకణాల్లో ఎలాంటివి ఈ ప్రయోగానికి పనికివస్తాయోనన్నదానిపైనా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు 11 మర్కటాలపై వీరు ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చాయని, ఇది పార్కిన్‌సన్ రోగులకు వరమని ఎడిన్‌బరో యూనివర్శిటీ ప్రచురించిన నేచర్ జర్నల్‌లోని వ్యాసంలో పేర్కొన్నారు. బ్రెయిన్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ థెరపీ ఆచరణాత్మకమేనని భావిస్తున్నారు.