S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దీనికి ‘కొమడో’ పేరు ఎలా వచ్చింది?

లిజార్డ్ (బల్లి) జాతికి చెందిన ఈ కొమడో డ్రాగన్‌లు భూమిపై ఉన్న అతి పాతకాలపు జీవులు. భూమి ఏర్పడిన తరువాత పుట్టిన ఈ జీవులు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అయినా వాటిని గురించి తొలిసారిగా తెలిసింది వందేళ్ల క్రితమే. అదీ ఓ విమాన ప్రమాదం కారణంగా వాటి సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. కొమడో అనేది ఓ దీవి. ఓ ఓసారి ప్రమాదానికి గురైన ఓ విమానం ఈ దీవిలో పడింది. అప్పుడు జరిగిన పరిశోధనలో వీటి సంగతి తెలిసింది. డ్రాగన్‌ల మాదిరిగా ఉండటం వల్ల, ఆ దీవిలో ఉండటం వల్ల వాటిని కొమడో డ్రాగన్‌లని పిలుస్తున్నారు. ఎర్రగా ఉండే వీటి లాలాజలం విషపూరితం. దాదాపు 50 రకాల బ్యాక్టీరియా వీటి లాలాజలంలో ఉంటుంది. దాడి చేసిన తరువాత ఆ జీవిని ఎముకలు, బొచ్చుకూడా ఉంచకుండా తినడం వీటికి అలవాటు. మగవాటితో జతకట్టకపోయినా ఆడ కొమడో డ్రాగన్‌లో సొంతంగా గుడ్లు పెట్టగలవు. ఇండోనేషియా, కొమడో, ఫ్లోరెస్, రింకా, గిరిమొతాంగ్ దీవుల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. దాదాపు 12 అడుగుల పొడవున ఇవి పెరుగుతాయి.

- ఎస్.కె.కె. రవళి