S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్టెనోగ్రాఫర్..?

న్యాయవాద వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి స్టెనోగ్రాఫర్లతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఎందుకంటే ఈ వృత్తికి వాళ్లు చాలా అవసరం.
న్యాయమూర్తి అయిన తరువాత రోజూ దినపత్రిక చదవడం ఎంత ముఖ్యమో, స్టెనోగ్రాఫర్‌తో ఉదయం ఓ గంట పని చేయించడం అంత అవసరం అయిపోయింది.
స్టెనోగ్రఫీ చాలా కష్టంతో కూడుకున్న పని. ఉద్యోగం వస్తుందని చాలామంది ఈ విద్యని నేర్చుకుంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్టెనోగ్రాఫర్‌తో పని ఉంటుంది న్యాయమూర్తికి. ఉత్తర్వులు, తీర్పులు డిక్టేషన్ ఇవ్వడం చాలా అవసరం.
మనం చెప్పింది స్టెనోగ్రఫీలో రాసుకోవడం, ఆ తరువాత దాన్ని టైప్ చేసి ఇవ్వడం, సరిదిద్దిన తరువాత మళ్లీ కరెక్ట్ చేసి ఇవ్వడం వాళ్ల పని.
స్వయంగా వాళ్లు ఒక్క వాక్యం కూడా రాయడానికి వీల్లేదు. న్యాయమూర్తులు చెప్పిందే టైప్ చేసి ఇవ్వాలి.
ఉద్యోగరీత్యా అది పర్వాలేదు.
కానీ జీవితం ఎవరో చెప్పినట్టు, మరెవరో డిక్టేట్ చేసినట్టు ఉండటానికి వీల్లేదు.
మన జీవిత పేజీలను మనం రాసుకోవాలి. ఇంతవరకు ఎవరైనా రాసినట్టు నడిచినా పర్వాలేదు. ఇంకా మన జీవితంలో చాలా పేజీలు ఉన్నాయి. వాటిని మనమే డిక్టేట్ చేసుకోవాలి.
ఎందుకంటే మనలని డిక్టేట్ చేస్తున్న వ్యక్తుల ఉద్దేశాలు మంచివే కావచ్చు. కానీ మన భవిష్యత్తు గురించి పూర్తి బాధ్యత మనం తీసుకుంటేనే ఫలితాలు మంచిగా వస్తాయి.
ఉదయం వాకింగ్ చేయాలని మనలో సంకల్పం బలంగా ఉంటే మనం చేయగలుగుతాం.
ఇది ఓ చిన్న ఉదాహరణ. ఇట్లా ఎన్నో చెప్పుకోవచ్చు.
మన కలలని ఇతరులు కనలేరు.
మన శక్తి సామర్థ్యాలను ఇతరులు ఉపయోగించలేరు.
మనం చేయాల్సిన పనులని ఇతరులు చేయలేరు.
ఇతరులు ఉత్ప్రేరకం కావచ్చేమో గానీ ఆ నిర్దేశించిన పనిని చేయలేరు.
అందుకని మన కలలని మనం కందాం.
వాటి సాఫల్యం మనమే చేద్దాం.
మన జీవితాలని మనమే నిర్దేశిద్దాం.
మనమే డిక్టేట్ చేసుకుందాం.
మన జీవితాలకి మనం స్టెనోగ్రాఫర్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే!

జింబో 94404 83001